Karthika Deepam August 20th episode: ఆమెతో ఎంగేజ్‌మెంట్ వద్దు.. షాకిచ్చిన కార్తీక్.. కంగారులో దీప
రెస్టారెంట్ లో తన కన్న తండ్రి అని తెలియకుండానే దాసు ని చెంప దెబ్బ కొడుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్న పంపించిన ఫోటో చూసి కొడుకుతో గొడవ పడతాడు శ్రీధర్. కూతుర్ని చూడటం కోసం పారిజాతం ఇంటికి వస్తాడు దాసు. శివ నారాయణ దాసుని ఘోరంగా అవమానించి ఇంటి నుంచి పంపించేస్తాడు. భర్త మీద పగ పెంచుకుంటుంది పారిజాతం. దశరథ్ దంపతులు దీపతో మాట్లాడుతూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నావు అందుకు మాకు చేతనైన సాయం చేస్తాము ఏం కావాలో అడుగు అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 20 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 128వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మా అత్తమామల్ని మీ అత్తయ్య మావయ్య అనుకో అంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న, ఇది నీకు పూర్తిగా సంబంధం లేని విషయం నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది సుమిత్ర. నాకు సంబంధం లేకపోవడం ఏమిటి నేను తనకోసం రెండుసార్లు కోర్టుకు వెళ్లాను, మనుషుల్ని ప్రేమించడంలో నాతో పోటీ పడొద్దు అని తల్లికి చెప్తుంది. తర్వాత దీపతో మాట్లాడుతూ నా పేరెంట్స్ అడుగుతున్నారు కదా నీకు ఏం కావాలో చెప్పు, ఎవరైనా అయితే కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అది ఎప్పుడు జరిపించాలి, పెళ్లి ఎలా జరిపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు.

కానీ మా పేరెంట్స్ మాత్రం నీకోసం తెగ ఫీల్ అవుతున్నారు అంటుంది జ్యోత్స్న. నువ్వు పూర్తిగా భ్రమలోనూ, భయంలోనూ బతుకుతున్నావు అని కూతురిని మందలిస్తుంది సుమిత్ర. నిజమే నేను బావతో పెళ్లవుతుందని భ్రమలోను, దీప వల్ల ఎక్కడ పెళ్లి ఆగిపోతుందనే భయంతోనో బ్రతుకుతున్నాను అంటుంది జ్యోత్స్న. అలాంటి భయం పెట్టుకోవద్దు, కచ్చితంగా కార్తీక్ బాబుతో మీ పెళ్లి జరుగుతుంది.
మీ పెళ్లి మీ తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు నా బాధ్యత కూడా. మీ పెళ్లి జరిపించాక మా ఊరు వెళ్ళిపోతాను అంటూ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్న కొడుకుని ఏమిటి అంత అర్జెంటు పని అని అడుగుతాడు శ్రీధర్. శౌర్యని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి అంటాడు కార్తీక్. దానికి ఆమె తల్లి ఉంది కదా అంటాడు శ్రీధర్.
పాప పరిస్థితి మీకు తెలియదు, నేను చెప్పలేను అని మనసులో అనుకున్న కార్తీక్ ఈసారికి నేను తీసుకువెళ్తాను తర్వాత తను తీసుకు వెళుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొడుకు ప్రవర్తనని భార్య ముందు తప్పు పడుతాడు శ్రీధర్. మరోవైపు స్వప్న, కాశి రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మన పెళ్లి గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడావా అని అడుగుతాడు కాశి. రేపు నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్తావు కదా అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఆ లెటర్ తీసుకొని వెళ్దాము. అప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకుంటారు అంటుంది స్వప్న.
ఒకవేళ మీ పేరెంట్స్ నన్ను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటాడు కాశి. మనసు పడ్డాను అంటే కాదని ఎలా అంటారు, ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా మా అన్నయ్య సపోర్ట్ చేస్తాడు అంటుంది స్వప్న. నీకు అన్నయ్య కూడా ఉన్నాడా అంటాడు కాశి. నాకు ఈ హైదరాబాద్ నాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ మా అన్నయ్య. ఒకవేళ నా పేరెంట్స్ ఏమైనా అభ్యంతరం చెబితే అన్నయ్య ఫుల్ సపోర్ట్ ఇస్తాడు అంటుంది స్వప్న.
నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు అంటాడు కాశీ. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన తర్వాత అందరికీ ఒకేసారి పరిచయం చేస్తాను అంటుంది స్వప్న. డబ్బులు ఉన్నాయో లేదో అని అతని చేతిలో కొంత డబ్బులు పెట్టి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వమని చెప్పి పంపిస్తుంది. మరోవైపు కూతురికి అన్నం తినిపిస్తున్న దీప త్వరగా తినేస్తే గుడికి వెళ్దాం అంటుంది. సరే నేను టాబ్లెట్స్ వేసుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తాను అంటుంది శౌర్య. అంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి హాస్పిటల్ కి వెళ్దాం పద అంటాడు. ఎందుకు అని అడుగుతుంది దీప జనరల్ చెకప్ కోసం అని అబద్ధం చెప్తాడు కార్తీక్.
మరోవైపు జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ నా పెళ్లి తన బాధ్యత అని దీప అంటుంది, అలాగే బావకి కూడా దీప మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇక దీప గురించి మనం భయపడవలసిన పని లేదు అంటుంది. అవునా అయితే ఒకసారి అటు చూడు అంటూ కార్తీక్ వాళ్ళని చూపిస్తుంది పారిజాతం. అక్కడ కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ కిందికి దిగుతుంది. మరోవైపు కార్తీక్ నిశ్చితార్థం గురించి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది దీప. జ్యోత్స్న దీపని మళ్లీ ఏమైనా అని ఉంటుంది అనుకుంటాడు కార్తీక్.
శౌర్య ని తనతో తీసుకు వెళ్తూ దీపని కూడా తనతో పాటు రమ్మంటాడు కార్తీక్. ఎక్కడికి అంటుంది దీప. రండి అంటూ శౌర్య ను తీసుకొని సుమిత్ర ఇంటికి వెళ్తాడు కార్తీక్. ఇంట్లో ఉన్న అందర్నీ పిలుస్తాడు. అప్పుడే కిందికి వచ్చిన జ్యోత్స్న నేను గొడవ చేద్దామనుకుంటే బావేమిటి అందర్నీ పిలుస్తున్నాడు అంటుంది. దీప ని పెళ్లి చేసుకుంటాను అంటాడేమో అంటుంది పారిజాతం. బావ ఆ మాట అంటే వెంటనే ఫ్లవర్ వాస్ తో దీప నెత్తి పగలగొడతాను అంటుంది జ్యోత్స్న.
ఒకటికి రెండుసార్లు పిలిచిన తర్వాత శివ నారాయణ కిందికి వచ్చి ఎందుకు అన్ని సార్లు పిలుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. కార్తీక్ ఏం చెప్తాడో ఏంటో అని కంగారు పడుతుంది దీప. కొన్ని కారణాల వలన నాకు, జ్యోత్స్న కి జరగవలసిన ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది అంటాడు కార్తీక్. ముహూర్తాలు పెట్టించి మళ్ళీ జరిపించవచ్చు అంటుంది పారిజాతం. ఇంక నాకు, జ్యోత్స్న కి నిశ్చితార్థం జరిపించవలసిన అవసరం లేదు అంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











