Karthika Deepam July 20th episode: జ్యోత్స్న తో నా పెళ్లి జరగదంటున్న కార్తీక్.. జరిగి తీరాలంటున్న దీప!

కడియం బాబాయ్ కి కనిపించిన శౌర్య కార్తీక్ కావాలి అనడంతో తప్పనిసరి పరిస్థితులలో అతనికి ఫోన్ చేస్తాడు బాబాయ్. బాబాయ్ ని శౌర్య ని తీసుకొని దీప ఇంటికి వెళ్తాడు కార్తీక్. ఇదంతా కార్తీక్ ని ఫాలో అవుతున్న జ్యోత్స్న చూస్తుంది. జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది. నా నిశ్చితార్థం జరగకుండా ఆపే వాళ్లెవ్వరినీ క్షమించను అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 20 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 102వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

దీపా.. మీరు ఇంటికి వస్తే ఈ గాజులు ఇద్దామనుకున్నాను కానీ మీరు ఇక ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అందుకే ఈ గాజులు మీకు ఇవ్వడానికి వస్తున్నాను బహుశా మీ ఇంటికి రావడం ఇదే ఆఖరి సారి కావచ్చు అనుకొని దీప గాజులు, సెల్ ఫోన్ తీసుకొని దీప ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్. అక్కడికి వెళ్ళిన తర్వాత దీప ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయిందిని తెలిసి షాక్ అవుతాడు. ఇప్పుడు నేను ముత్యాలమ్మ గూడెం వెళ్లాలా, అత్త దగ్గరికి వెళ్లాలా అని ఆలోచనలో పడతాడు. కాసేపటి తర్వాత అత్త దగ్గరికి వెళ్లి పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి అనుకొని సుమిత్ర ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 20th July 2024 Episode Number 101 Here is full story

మరోవైపు శోభ అనసూయతో మాట్లాడుతూ కత్తిపీట మహారాణి గారు ప్రియుడి ఇంటికి చేరారంట అని వెటకారంగా అంటుంది. అయితే నీకేంటి నొప్పి అని అడుగుతుంది అనసూయ. ఆ కార్తీక్ అన్న మాటలు నిజమేమో, నాకు ఆ అక్రమ సంబంధం వద్దు అంటుంది శోభ. అందుకు ఆమె మీద కోప్పడుతుంది అనసూయ. అప్పుడే వచ్చిన భర్తతో విషయం చెప్తుంది శోభ. నీ మొగుడికి మీసాలు మెలెయ్యడమే గాని బిడ్డని తెచ్చుకోవటం చేతకాదు అని కొడుకుని కూడా కోప్పడుతుంది అనసూయ.

నేను చెప్పే వరకు ఆగు, అప్పుడే దాని జోలికి వెళ్ళకు, మనం దానిని మరిచిపోయాం అని అది అనుకోవాలి అప్పుడే మనం దాన్ని ఏమైనా చేయొచ్చు అప్పటివరకు ఏమీ చేయొద్దు అని కొడుక్కి చెప్తుంది అనసూయ. ఆ ఇంట్లో మనకి ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటుంది. మరోవైపు పారిజాతంతో మాట్లాడుతున్న జ్యోత్స్న నిన్ను దీప ఇంటి దగ్గర దింపుతాను నీ తెలివితేటలు ఉపయోగించి దీపతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటుంది.

చూస్తావుగా నా తడాఖా అంటుంది పారిజాతం. అంతలోనే పూజ చేసుకుంటున్న సుమిత్ర కళ్ళు మూస్తుంది శౌర్య. ఆ చేతుల్ని గుర్తుపట్టి ఆనందంగా శౌర్య ని దగ్గరకు తీసుకుంటుంది సుమిత్ర. ఇదంతా చూస్తున్న పారిజాతం వాళ్ళు షాక్ అవుతారు. దీప రాక వెనక కారణం మరేదో ఉంది అంటుంది జ్యోత్స్న. అదే సమయంలో అమ్మ ఏది అని సుమిత్ర అడిగితే బయట ఉంది అని చెప్తుంది శౌర్య. దీప దగ్గరికి వెళ్లిన సుమిత్ర ఇకమీదట నాకు చెప్పకుండా వెళ్లొద్దు.

అది కూడా జ్యోత్స్న పెళ్ళి తరువాతే. గురువారం వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫుడ్ అంతా హోటల్ నుంచి వస్తుంది కానీ స్పెషల్స్ మాత్రం నువ్వే చేయాలి అని చెప్తుంది సుమిత్ర. అంతలోనే కార్తీక్ వస్తాడు. సౌర్య వాళ్ళని చూసి షాక్ అవుతాడు. శౌర్య పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. ఇదంతా చూస్తున్న జ్యోత్స్న బావ చూసావా తెలివిగా ముందు వాళ్ళని పంపించి ఇప్పుడు తను వచ్చాడు అని పారిజాతంతో చెప్తుంది.

తర్వాత కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు సుమిత్ర కార్తీక్ తో మాట్లాడుతూ ఇక నువ్వు దీపని వెతకక్కర్లేదు అని చెప్తుంది. సరే నువ్వు వంట చేసుకోవద్దు టిఫిన్ పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. కార్తీక్ ని రమ్మంటే ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పటంతో శౌర్య ని తీసుకుని వెళ్ళిపోతుంది సుమిత్ర. తర్వాత కార్తీక్ దీప గాజులు దీప కి ఇచ్చేసి మీ ఇంటికి ఇవి ఇవ్వటానికి వెళ్ళాను.

అక్కడ లేకపోవడంతో మీ ఊరు వెళ్ళిపోయారు ఏమో అనుకున్నాను అంటాడు. నేను ఇక్కడికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి మీ పెళ్లి అంటుంది దీప. అది జరగదు, జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు కార్తీక్. కారణం ఏమిటి అని అడుగుతుంది దీప. కారణమేమీ లేదు అంటాడు కార్తీక్. కానీ వాళ్లు కారణాలు వెతుక్కుంటారు హాస్పిటల్లో మీరు మాట్లాడింది ఎలాగైనా తెలుసుకొని నన్ను నా కూతుర్ని దోషిని చేస్తారు.

అయినా మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియదు కానీ జ్యోత్స్న మాత్రం మీకోసమే బ్రతుకుతుంది అంటుంది దీప. కానీ నేను అర్థం అయ్యేలాగా వాళ్లకు చెప్తాను అంటాడు కార్తీక్. భార్యగా చనిపోయాను, మనిషిగా మీ మాటలతో మీరు చంపేశారు, ఇక తల్లిగా నేను బ్రతికి ఉండాలంటే మీరు ఈ పెళ్లి చేసుకోవాలి మీరు నిజం చెప్పి ఒప్పించాలన్నా వినే ఓపిక, అర్థం చేసుకునే ఓపిక అవతలి వాళ్ళకి ఉండదు ఉంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X