Karthika Deepam June 20th episode: నా జోలికి రావద్దు.. కార్తీక్‌కు దీప వార్నింగ్
జ్యోత్స్న శౌర్య స్కూల్ కి వెళ్లి రచ్చ చేస్తుంది, తర్వాత దీప హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ కూడా రచ్చ చేస్తుంది. తమతో పాటు ఉండటం లేదని తండ్రితో గొడవ పడుతుంది స్వప్న. ఆమెకి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు శ్రీధర్. కార్తీక్ విషయంలో జ్యోత్స్న ని హెచ్చరిస్తుంది శ్రీవాణి. కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న దీప హోటల్ దగ్గరికి వెళ్లి ఆమెని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాధపెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 20 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 76వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దీప. నర్సింహని పోలీసులు పట్టుకెళ్లటం చూసి వాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడేమో అని కంగారు పడి వచ్చాను అంటాడు కార్తీక్. వాడు నన్ను ఇబ్బంది పెడితే మీ కేంటి, నేను మిమ్మల్ని రమ్మనమని అడిగానా లేదంటే శౌర్య ఫోన్ చేసి రమ్మని అడిగిందా, మీకెందుకు బాబు నా గురించి ఇంత తపన. మీ చాలా మంచివారు మీ మంచితనంతో ఇప్పటికే మీకు చాలా రుణపడ్డాము.

మీరు ఇంకా సాయం చేస్తూ పోతే మీ రుణం రాసి లాగా పేరుకు పోతుంది అది తీర్చుకోవడానికి నా జన్మ చాలదు అంటుంది. అప్పుడు కార్తీక్ కూడా కోప్పడుతూ నర్సింహ ని పోలీసులకు పట్టిస్తేనే వాడు మిమ్మల్ని అంతగా ఏడిపించాడు, అలాంటివాడు మిమ్మల్ని ఊరికే వదులుతాడు అనుకుంటున్నారా, రేపు ఇంకేదైనా చేయడానికి సిద్ధపడతాడు. వాడిని మీరు ఏమి చేయరు, నన్ను కూడా ఏమి చెయ్యనివ్వరు, మీ వరకు వస్తే ఏమో తెలియదు కానీ శౌర్య జోలికి వస్తే మాత్రం నేను వాడిని వదిలిపెట్టను అంటాడు.
ఒకవేళ వాడు మా జోలికి వచ్చినా మీరు మాత్రం కల్పించుకోవద్దు, ఇంకొకరి చేత నేను మాట పడేలాగా చెయ్యొద్దు అంటుంది దీప. జ్యోత్స్న మిమ్మల్ని ఏమైనా అందా అని అడుగుతాడు కార్తీక్. ఒకరు అనే లాగా మీరెందుకు ఉండాలి, అనిపించేలాగా నన్ను ఎందుకు ఉంచాలి. ఇక మీదట మీరు మా జీవితం లో జోక్యం చేసుకోవద్దు నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు జ్యోత్స్న చెప్పింది విని ఆనందపడుతుంది పారిజాతం.
ఈ దెబ్బకి ఇంక ఆ దీప కార్తీక్ ని దగ్గరికి రానివ్వదు అంటుంది. వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియని ఎమోషనల్ బాండింగ్ ఏదో ఉంది, అదే వాళ్ళిద్దర్నీ దగ్గర చేస్తుంది అంటుంది జ్యోత్స్న. వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందని తెలిస్తే జ్యోత్స్న ఊరుకోదని ఆమెకి ఆ విషయం చెప్పదు పారిజాతం. మరోవైపు నేను ఒక తప్పు చేశాను నన్ను కొట్టు అని కర్ర తీసుకొని వస్తుంది శౌర్య. ఏం తప్పు చేశావు అని అడుగుతుంది దీప. మా స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ ఉంది.

అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు, అందుకే కార్తీక్ కి ఫోన్ చేసి అడిగాను. కార్తీక్ నా దగ్గరికి వచ్చి తండ్రి గురించి గొప్పగా చెప్పాడు, నిజంగానే నా తండ్రి అలాగే ఉంటాడా అమ్మ అని అడుగుతుంది. నీ ఆశ లాగే నీ తండ్రి కూడా అందంగా ఉంటాడు అని ఏడుస్తూ చెప్తుంది దీప. నీకు కూడా తండ్రి లేడు కదా అంటుంది శౌర్య. ఒకడు నా తండ్రిని దూరం చేసి నాకు జీవితం లేకుండా చేస్తే మరొకడు నా జీవితంతో ఆడుకొని నా బ్రతుకుని శూన్యం చేసేసాడు అని కన్నీరు పెట్టుకుంటుంది దీప.
మరొకవైపు ఏడుస్తూ కూర్చున్న శోభతో నువ్వెందుకు ఏడుస్తున్నావు మేము కదా ఏడవాలి అంటుంది అనసూయ. దానిని మాటలతో ఇబ్బంది పెట్టకు నాకు పిల్లలు లేకపోయినా పరవాలేదు శోభ ఉంటే చాలు అంటాడు నర్సింహ. పిల్లలు పుట్టనిది దానికి, నీకు కాదు అంటుంది దీప. అంటే మీ కొడుకుని మరో పెళ్లి చేసుకోమంటున్నారా అంటుంది శోభ. ఇప్పటికే ఇద్దరు ఉన్నారు మళ్ళీ చేసుకోమంటానా అంటుంది అనసూయ. అయితే ఎవరైనా బిడ్డని తెచ్చుకోమంటున్నారా అంటుంది శోభ.
కడుపుని పుట్టిన బిడ్డ ఉండగా ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం నా కొడుకు ఏంటి, నీ కూతుర్ని నువ్వు తెచ్చుకో అని కొడుక్కి సలహా ఇస్తుంది అనసూయ. ఆమె సలహాకి షాక్ అవుతాడు నర్సింహ. కూతురి జోలికి వెళ్తేనే అపర కాళి లాగా మారిపోయింది ఆ దీప, అలాంటిది కూతుర్ని తీసుకుంటాను అంటే చెయ్యి నరికి చేతిలో పెడుతుంది అంటుంది శోభ. నీతో సంబంధం లేదు అన్నప్పుడు నీ కూతురు మాత్రం దాని దగ్గర ఎందుకు తీసుకొచ్చేయ్ అంటుంది అనసూయ. ఆలోచనలో పడతాడు నర్సింహ.

మరోవైపు రోడ్డు మీద తండ్రిని చూస్తుంది స్వప్న. పని ఉంది ఎక్కడికో వెళ్తానన్నారు, ఇక్కడ ఉన్నారు ఏంటి అనుకుంటుంది. పని అయిపోయి ఉంటుంది ఇంటికి బయలుదేరి ఉంటారు ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను అనుకొని శ్రీధర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదేమి గమనించని శ్రీధర్ కొబ్బరిబోండం తీసుకువెళ్లి కారులో ఎవరికో ఇవ్వడం గమనిస్తుంది స్వప్న. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










