Karthika Deepam August 21st: జ్యోత్స్న ప్రవర్తనని అసహ్యించుకుంటున్న పారిజాతం.. ప్రాణాపాయ స్థితిలో కాశీ!

కూతుర్ని చూడటం కోసం పారిజాతం ఇంటికి వస్తాడు దాసు. శివ నారాయణ దాసుని ఘోరంగా అవమానించి ఇంటి నుంచి పంపించేస్తాడు. భర్త మీద పగ పెంచుకుంటుంది పారిజాతం. దశరథ్ దంపతులు దీపతో మాట్లాడుతూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నావు అందుకు మాకు చేతనైన సాయం చేస్తాము ఏం కావాలో అడుగు అంటారు. ఆ మాటలు విన్న జ్యోత్స్న ఏ పేరెంట్స్ అయినా ఆగిపోయిన కూతురి నిశ్చితార్థం గురించి ఆలోచిస్తారు కానీ మా పేరెంట్స్ నీ గురించి ఆలోచిస్తున్నారు అని దీప బాధపడేలాగా మాట్లాడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 21 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 129వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

అనుకోని కారణాల వలన జ్యోత్స్న తో జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయింది అంటాడు కార్తీక్. దాందేముంది ముహూర్తాలు చూసి మళ్ళీ పెట్టుకోవచ్చు అంటుంది పారిజాతం. ఇక నిశ్చితార్థం అవసరం లేదు అంటాడు కార్తీక్. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అంటుంది సుమిత్ర. నువ్వు విన్నది నిజమే అత్త, ఇక నిశ్చితార్థం వద్దు డైరెక్ట్ గా పెళ్లి కే ముహూర్తాలు పెట్టించేయండి అంటాడు కార్తీక్. ఆ మాటలకి ఇంట్లో అందరూ సంతోషిస్తారు. తర్వాత శౌర్య ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు కార్తీక్. దీప గుడికని చెప్పి వెళ్ళిపోతుంది. పారిజాతం హడావిడి పడుతూ మనవరాల్ని గుడికి వెళ్దాం పద అంటుంది. ఎందుకు అంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial 21st August 2024 Episode Number 129 Here is full story

మనమరాలి పెళ్లంటే నాక్కూడా మొక్కులు ఉంటాయి కదా అని హడావుడి పడిపోతుంది పారిజాతం. మరోవైపు ఇంటర్వ్యూ కి వెళ్తున్న కాశీ దగ్గరికి వస్తుంది స్వప్న. తనకి ఎదురు రమ్మంటాడు కాశీ. తన శకునం మంచిది కాదని, తన మీద తనకే నమ్మకం లేదని అంటుంది స్వప్న. ఇప్పుడేంటి, నువ్వు ఎదురొస్తే నాకు యాక్సిడెంట్ అయి చచ్చిపోతానా అంటాడు కాశీ. అతని నోరు మూసి ఇంకెప్పుడు అలా అనొద్దు అని కన్నీరు పెట్టుకుంటుంది స్వప్న. నా కోసం కన్నీరు పెట్టుకునే ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటాడు కాశీ.

తరువాత స్వప్న తనకి ఎదురొచ్చేలా ఒప్పిస్తాడు. కాశీకి ఎదురొచ్చిన స్వప్న అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి పంపిస్తుంది. మరోవైపు స్వప్న కారులో వెళ్తూ పారిజాతంతో బావ ఇచ్చిన షాక్ తట్టుకోలేకపోతున్నాను, ఏదో జరిగింది అంటుంది. ఏదైతేనేం నీకు కావాల్సిందే మీ బావతో పెళ్లి కదా అంటుంది పారిజాతం. పెళ్లి తర్వాత దీప వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటుంది జ్యోత్స్న. ఆ బాధ్యత నాది అంటుంది పారిజాతం.

పెళ్లి తర్వాత కొడుకుని మనవరాల్ని కలపాలని కూడా మనసులో అనుకుంటుంది పారిజాతం. తర్వాత గుడికి కాకుండా ఎక్కడికో తీసుకెళుతున్న మనవరాల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడుగుతుంది. మా బావతో పెళ్లంటే నా ఫ్రెండ్స్ ఏవేవో మాట్లాడారు వాళ్లకి బావతో పెళ్ళన్న విషయం చెప్పాలి అంటుంది జ్యోత్స్న. దానికి నేను ఎందుకు అంటుంది పారిజాతం. నిన్ను బ్యూటీ పార్లర్ లో దింపేస్తాను అంటుంది జ్యోత్స్న. అందుకు ఆనందపడుతుంది పారిజాతం.

అదే సమయంలో కాశీకి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో రోడ్డుమీద పడి ఉంటాడు. అక్కడ ఉన్న జనాలు అటుగా వెళుతున్న జ్యోత్స్న కార్ ఆపి ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి సహాయం అడుగుతారు తన కారు పాడైపోతుందని లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకోకుండా వెళ్ళిపోతుంది జ్యోత్స్న. సహాయం చేయాల్సింది అని మనవరాల్ని మందలిస్తుంది పారిజాతం. ఇప్పుడు నేను మంచి మూడ్ లో ఉన్నాను ఈ సమయంలో వాడితో హాస్పిటల్ కి వెళ్ళాలా అంటుంది జ్యోత్స్న.

మనవరాలి ప్రవర్తన ని అసహ్యించుకుంటూ నన్ను ఇంట్లో దింపేయ్ అంటుంది పారిజాతం. మరోవైపు అదే సమయం లో ఆటోలో వస్తున్న దీప యాక్సిడెంట్ చూసి అంబులెన్స్ వచ్చేవరకు ఆగితే ప్రాణాలు పోవచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళ సాయంతో కాశీని ఆటోలో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది దీప. ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. మరోవైపు దీప హాస్పిటల్ కి వచ్చే సమయానికి కార్తీక్, శౌర్య అదే హాస్పిటల్లో ఉంటారు. తల్లిని చూసిన శౌర్య కార్తీక్ తో పాటు అక్కడికి వస్తుంది.

ప్రమాదంలో ఉన్న వ్యక్తిని చూసి ఏమైంది, ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు కార్తీక్. జరిగింది చెప్తుంది దీప. అలా అయితే పోలీస్ కంప్లైంట్ ఉండాలి అంటాడు డాక్టర్. బాధ్యత నేను తీసుకుంటాను అంటుంది దీప. కార్తీక్ కూడా చెప్పటంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్. మరోవైపు జ్యోత్స్న తన పెళ్లి గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఎందుకో ఈ పెళ్లి కూడా జరగదేమో అనిపిస్తుంది అంటుంది ఒక ఫ్రెండ్. ఎవరు అడ్డొచ్చినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, దీనిని ఎవరూ ఆపలేరు అని కోపంగా అంటుంది జ్యోత్స్న.

మరోవైపు కాశి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న స్వప్నకి కాశి యాక్సిడెంట్ అయిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఆ వీడియోలో దీప కూడా ఉండడాన్ని చూసిన స్వప్న దీప కి ఏడుస్తూ ఫోన్ చేసి కాశి ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేస్తుంది. దీపని అక్కడే ఉండమని చెప్పి హాస్పిటల్ కి బయలుదేరుతుంది స్వప్న. స్వప్నకి తెలిసిన వ్యక్తి ఏమో అనుకుంటుంది దీప. తరువాత కార్తీక్ తో ఈ హడావిడిలో పడి శౌర్య ఆరోగ్యం గురించి అడగలేదు, తన ఆరోగ్యం ఎలా ఉంది అంటుంది దీప. బాగానే ఉంది అంటాడు కార్తీక్.

తల్లిగా నేను తీసుకోవలసిన బాధ్యత మీరు తీసుకుంటున్నారు ఈ విషయంలో నాకు ఇబ్బందిగా ఉంది అంటుంది దీప. మీరు ముక్కు, మొహం తెలియని వాళ్ళకి కూడా సాయం చేయవచ్చు కానీ నేను నా ఫ్రెండ్ కి సాయం చేయకూడదా అంటాడు కార్తీక్. చనిపోయిన వ్యక్తి కాసేపే బాధపడతాడు కానీ ఆ కుటుంబం మాత్రం జీవితాంతం బాధపడతారు. ఇది మా నాన్న చావు నాకు నేర్పిన పాఠం అంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X