Karthika Deepam June 21st episode: తండ్రిపై స్వప్నకి అనుమానం.. దీపకి ఊహించని షాకిచ్చిన నర్సింహ!
తమతో పాటు ఉండటం లేదని తండ్రితో గొడవ పడుతుంది స్వప్న. ఆమెకి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు శ్రీధర్. కార్తీక్ విషయంలో జ్యోత్స్న ని హెచ్చరిస్తుంది శ్రీవాణి. కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న దీప హోటల్ దగ్గరికి వెళ్లి ఆమెని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాధపెడుతుంది. శోభ కి పిల్లలు పుట్టరని తెలిసిన అనసూయ దీప కూతుర్ని తెచ్చుకోమని కొడుక్కి సలహా ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 21 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 77వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రోడ్డుమీద కనిపించిన తండ్రి ని పలకరించి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది స్వప్న. కానీ తండ్రి కారులో మరొక స్త్రీకి కొబ్బరి బొండం ఇవ్వటం చూసి షాక్ అవుతుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది కానీ ఆమె రోడ్డు దాటి వచ్చేసరికి అక్కడ నుంచి వెళ్లిపోతాడుశ్రీధర్. తండ్రి గురించి మొదటిసారి స్వప్న మనసులో అనుమానం మొదలవుతుంది. మరో వైపు హోటల్ లో పని చేసుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు, లోపలికి రాకుండా బయటే వెయిట్ చేస్తాడు. బాబాయ్ కార్తీక్ బాబు వచ్చారు అని దీపతో చెప్తాడు. ఈయనని రావద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు వచ్చారు జ్యోత్స్న చూస్తే ఏమనుకుంటుంది అనుకుంటుంది దీప.

బయటికి మాత్రం ఆయనని పలకరించడానికి మనం ఏమి ఖాళీగా లేము కదా అని కోపంగా అంటుంది. బయట కార్తీక్ కూడా నేను దీప కోసం వచ్చాను అనుకుంటుందేమో అనుకుంటాడు. కాసేపటి తర్వాత బాబాయి దీప దగ్గరికి వచ్చి ఆయన నీకోసమే వచ్చి ఉంటారు ఒకసారి వెళ్లి మాట్లాడమ్మా అని చెప్పటంతో కార్తీక్ దగ్గరికి వస్తుంది దీప. మళ్లీ ఎందుకు వచ్చారు అని కోపంగా అడుగుతుంది. నేను మీకోసం వచ్చానని అనుకుంటున్నారా అంటాడు కార్తీక్.
వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి స్వప్న వస్తుంది. తన తండ్రి విషయం చెప్పి ఏం చేయాలో పాలుపోలేదు నువ్వైతే సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశాను అంటుంది. ఈ విషయం తేలికగా తీసుకోవద్దు, ఈరోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు, దీప విషయంలో కూడా అలాగే జరిగింది అంటాడు కార్తీక్. వెళ్లి నీ తల్లి ముందే నీ తండ్రిని నిలదీయు అప్పుడు నిజం ఆయనే చెప్తారు అంటాడు కార్తీక్. శ్రీధర్ గారు పోయి పోయి ఆయన కూతురు కంట్లోనే పడ్డారు అనుకుంటుంది దీప.

తర్వాత స్వప్న తో మాట్లాడుతూ అలా నిలదీయటం మంచిది కాదు లేనిపోని అనుమానాలు, తర్వాత అపార్ధాలు మొదలవుతాయి. అలా అయితే మీరు కూడా నన్ను కారులో తీసుకెళ్లారు కదా మన గురించి కూడా ఎవరైనా ఇలా మాట్లాడుకుంటూ మీరు ఊరుకుంటారా అంటుంది దీప. దీప చెప్పింది కూడా కరెక్టే ఇప్పుడు వెళ్లి మా మమ్మీ తో నాన్న గురించి చెప్పానంటే ఆమె మైండ్ డిస్టర్బ్ చేసిన దాన్ని అవుతాను.
అందుకే అసలు నిజం ఏమిటో ముందు నేనే కనుక్కుంటాను తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అంటుంది స్వప్న. సరే నీకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటాడు కార్తీక్. స్వప్న వెళ్ళిపోతుంది, తరువాత ఎందుకు స్వప్న వాళ్ళ నాన్నగారి గురించి అలాగా మాట్లాడావు, నేను నీ జీవితాన్ని దగ్గరగా చూసాను కదా అందుకే ఎక్కడ తప్పు జరుగుతుందో అని భయపడుతున్నాను.

శౌర్య అమ్మ అయినా, మా అమ్మ అయినా, స్వప్న వాళ్ళ అమ్మ అయినా ఏ ఆడదానికి అన్యాయం జరగకూడదు అని ఎమోషనల్ అవుతూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఆ తరువాత క్యారియర్ తీసుకొని స్కూల్ కి వెళ్తుంది దీప. మీ కోసమే వెయిట్ చేస్తున్నాను పాప తండ్రి వచ్చారు ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నారు మీరు కూడా వెళ్ళండి నేను పాపకి క్యారేజీ ఇస్తాను అంటాడు అటెండర్.
నర్సింహ వచ్చాడేమో, పాపకి తనే తండ్రిని అని చెప్పేస్తాడేమో అని కంగారు పడుతూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్తుంది దీప.అక్కడ నర్సింహ కనిపించకపోవడంతో శౌర్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అంతలోనే నర్సింహ కనిపించి నేను నీతో మాట్లాడాలి పక్కకి రా అని చెప్తాడు, నీతో నాకు మాటలు ఏంటి అని నరసింహతో వాదించినా తర్వాత అతనితో మాట్లాడటానికి పక్కకు వెళుతుంది.
అప్పుడు నర్సింహ మాట్లాడుతూ శోభ సంగతి అంతా చెప్పి నా కూతుర్ని నాకు ఇచ్చేయ్ అంటాడు. ఆ మాటలకి షాక్ అవుతుంది దీప. నా కూతుర్ని ఇస్తానని ఎలా అనుకున్నావు అంటుంది. ఆ పాప నాకే పుడితే నాకు ఇచ్చేయ్, ఆ పాప నాకు పుట్టలేదంటావా నాకు ఇవ్వద్దు అంటాడు. ఊహించని ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











