Karthika Deepam August 22 nd episode: జ్యోత్స్న ప్రవర్తన ని అసహ్యించుకుంటున్న దాసు.. జోరుగా సాగుతున్న బావ మరద
దశరథ్ దంపతులు దీపతో మాట్లాడుతూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నావు అందుకు మాకు చేతనైన సాయం చేస్తాము ఏం కావాలో అడుగు అంటారు. ఆ మాటలు విన్న జ్యోత్స్న ఏ పేరెంట్స్ అయినా ఆగిపోయిన కూతురి నిశ్చితార్థం గురించి ఆలోచిస్తారు కానీ మా పేరెంట్స్ నీ గురించి ఆలోచిస్తున్నారు అని దీప బాధపడేలాగా మాట్లాడుతుంది. మరోవైపు యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాశీని రక్షించమని స్థానికులు అడిగితే పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది కానీ దీప అతడిని హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 22 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 130వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
చనిపోయిన వాళ్ళు కాసేపే బాధపడతారు కానీ వారి బంధువులు జీవితాంతం బాధపడతారు, ఇది మా నాన్న చావు నాకు నేర్పిన పాఠం అందుకే ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నేను భరించలేను అంటుంది దీప. ఇంత మంచి మనసు ఉన్న మీకు నేను సాయం చేస్తే తప్పేముంది అయినా శౌర్య నా ఫ్రెండ్ దాని విషయంలో నాకు కూడా బాధ్యత ఉంది అంటాడు కార్తీక్. తర్వాత దీప మాట్లాడుతూ పేషెంట్ గురించి ఎవరు ఏమి చెప్పటం లేదు ఏమిటి అంటుంది.

అతనికి ఏమీ కాదు నేను నర్స్ తో మాట్లాడాను అలాగే అతని ఫోన్ తో వాళ్ళ నాన్నకి ఇన్ఫామ్ కూడా చేశాను వస్తానన్నారు అంటాడు కార్తీక్. అప్పుడే దాసు హాస్పిటల్ కి వచ్చి యాక్సిడెంట్ అయిన వ్యక్తి గురించి అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న కార్తీక్ మీకు ఫోన్ చేసింది నేనే అనడంతో అక్కడికి వెళ్తాడు దాసు. నా కొడుక్కి ఎలా ఉంది అని కార్తీక్ ని అడుగుతాడుదాసు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు.
ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు కాస్త లేటుగా తీసుకువచ్చి ఉంటే చాలా ప్రమాదం జరిగేది, వేరే రూమ్ కి షిఫ్ట్ చేస్తాము స్పృహలోకి వచ్చేవరకు అతడిని డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. నా కొడుకుని కాపాడినందుకు థాంక్స్ అని కార్తీక్ తో అంటాడు దాసు. మీ అబ్బాయిని కాపాడింది నేను కాదు అంటూ దీపని చూపిస్తాడు కార్తీక్. ఆమెకి కృతజ్ఞతలు చెప్తాడు దాసు. అతడిని వారిస్తుంది దీప. అప్పుడే తననే చూసుకుంటూ వెళ్తున్న నర్స్ ని ఎందుకలా చూస్తున్నారు అని అడుగుతుంది దీప. తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తుంది నర్స్. అది చూసిన కార్తీక్ మరదల్ని తిట్టుకుంటాడు.
దాసు ఏంటా వీడియో అని అడిగితే మీ అబ్బాయి యాక్సిడెంట్ ని ఎవరు వీడియో తీశారు అంటాడు. అప్పుడు దాసు కూడా ఆ వీడియో చూస్తాడు. అందులో జ్యోత్స్న చూసి షాక్ అవుతాడు. నా కూతురు ఎంత మానవత్వం లేని మనిషిగా ఎలా తయారయింది, పక్కనే అమ్మ ఉంది కనీసం తనైనా చెప్పవచ్చు కదా అనుకుంటాడు. కన్నీరు పెట్టుకుంటున్న దాసు దగ్గరికి వచ్చినా దీప బాధపడకండి బాబాయ్, మీ అబ్బాయి కోలుకుంటాడు అని చెప్తుంది. ఆమె ఆప్యాయతకి కరిగిపోతాడు దాసు.

మరోవైపు యాక్సిడెంట్ అయిన వీడియో చూసిన పారిజాతం కంగారుపడుతూ తన మనవరాలికి చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు అందరి ముందు చెడ్డ అయిపోతున్నావు కాస్త ఆవేశం తగ్గించుకోవచ్చు కదా అంటుంది, నువ్వేంటి సడన్గా రూటు మార్చావు నాకు నీతులు చెప్తున్నావు అని పారిజాతంపై కోప్పడుతుంది జ్యోత్స్న. నువ్వు మీ నాన్నని చెంప దెబ్బ కొడితేనే కానీ నాకు బుద్ధి రాలేదు అనుకుంటుంది పారిజాతం.
తర్వాత మాటల్లో కార్తీక్ కాంచన కొడుకు అని గ్రహిస్తాడు దాసు. ఆ విషయం తనకి చెప్పాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతాడు. దీపని తీసుకొని ఇంటికి వెళ్ళమంటాడు కార్తీక్ బాబాయ్ కొడుకు కోసం బాధపడుతున్నారు నేను ఆయనకు తోడుగా ఉంటాను అంటుంది దీప. అయితే నేను శౌర్యని అత్త కి అప్పగించి వస్తాను అని వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ జ్యోత్స్న చేసిన ఘనకార్యం అందరికీ చూపిస్తాడు.నువ్వేమి అంత వెటకారంగా మాట్లాడక్కర్లేదు, నన్ను బ్యాడ్ చెయ్యక్కర్లేదు అని కోపంగా అంటుంది జ్యోత్స్న.

నిన్ను ఒకరు బ్యాడ్ చేయక్కర్లేదు, కింద కామెంట్స్ లో అందరూ నీ గురించి బ్యాడ్ గానే మాట్లాడుకుంటున్నారు, నిన్ను దీపని పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తున్నారు అంటాడు కార్తీక్. నా ముందు దీపని పొగడొద్దు అంటుంది జ్యోత్స్న. నేను ఎవరిని పొగడంటం లేదు, మీ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను అంటాడు కార్తీక్. అంటే నాకు ప్రాణం విలువ తెలియదా అని కోపంగా ఉంటుంది జ్యోత్స్న, తెలియదు అంటూ చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేస్తాడు కార్తీక్.
అప్పుడు నన్ను రక్షించే అవకాశం ఉన్న కూడా రక్షించలేదు, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు చెప్పండి తనకి ప్రాణం విలువ తెలుసా అంటాడు కార్తీక్. ఇప్పుడు కూడా అబ్బాయిని కాపాడే అవకాశం ఉన్న కూడా కాపాడలేదు. సమయానికి దీప కాపాడింది కాబట్టి ఆ అబ్బాయి ప్రాణం నిలబడింది అంటాడు కార్తీక్ అంటే నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతుంది పారిజాతం. నేను శౌర్యని తీసుకెళ్లిన హాస్పిటల్ కే దీప ఆ అబ్బాయిని తీసుకువచ్చింది అంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











