Karthika Deepam Jun22nd episode: యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న దీప.. నిజం చెప్పి భారం దించేసుకున్న కార్తీక్!

కార్తీక్ శౌర్య మీద చూపిస్తున్న అభిమానం విషయంలో జ్యోత్స్న ని హెచ్చరిస్తుంది శ్రీవాణి. కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న దీప హోటల్ దగ్గరికి వెళ్లి ఆమెని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాధపెడుతుంది. శోభ కి పిల్లలు పుట్టరని తెలిసిన అనసూయ దీప కూతుర్ని తెచ్చుకోమని కొడుక్కి సలహా ఇస్తుంది. రోడ్డుమీద మరొక స్త్రీతో శ్రీధర్ ని చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం కలుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 22 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 78వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

పాపా నాకు పుట్టిందంటేనే నాకు ఇవ్వు లేదంటే ఇవ్వద్దు అంటాడు నర్సింహ. కోపంగా చూస్తుంది దీప. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోమంటే నువ్వు మాత్రం ఎలా నిర్ణయం తీసుకుంటావో ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించు, కానీ ఒక విషయం గుర్తుంచుకో పాపా నాకు పుడితేనే నాకు ఇవ్వు అని మరొకసారి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. ఆ మాటలకి ఏడుస్తూ కూర్చుంటుంది దీప. మరోవైపు ఫోన్ లో చాటింగ్ చేస్తున్న జ్యోత్స్న దగ్గర ఫోన్ లాక్కొని ఆమె చేత బలవంతంగా జ్యూస్ తాగిస్తుంది సుమిత్ర.

Karthika Deepam 2 Serial 22nd June 2224 Episode Number 78 Here is full story

తల్లితో ఫోన్ ఇవ్వు బావతో చాటింగ్ చేస్తున్నాను అంటుంది జ్యోత్స్న. అప్పుడు నవ్వుతూ నేను అంతా చూస్తూనే ఉన్నాను, మొన్ననే బావతో కూడా మాట్లాడాను మీ ఇద్దరు బయట కలుసుకుంటున్నారంట కదా అంటుంది సుమిత్ర. ఇంట్లో జరిగిన గొడవలకి మీ ఇద్దరి మధ్య ఎక్కడ ఎడబాటు పెరిగిపోతుందో అని భయపడ్డాను, కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతంతో పిల్లలకి కాస్త దూరంగా ఉండండి అని హెచ్చరించి వెళ్ళిపోతుంది సుమిత్ర. మరోవైపు కావేరి దగ్గరికి వెళ్లడానికి ప్రయాణం అవుతూ ఉంటాడు శ్రీధర్.

Karthika Deepam 2 Serial 22nd June 2224 Episode Number 78 Here is full story

అంతలోనే కార్తీక్ తల్లికి జ్వరంగా ఉండటంతో కంగారు పడటం చూసి శ్రీధర్ కూడా కంగారుపడుతాడు, హాస్పిటల్ కి వెళ్దాం పద ఉంటాడు. వద్దు లోజ్వరమే అంటుంది కాంచన. శ్రీధర్ చేతిలో సూట్ కేస్ చూసి మీరు ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతాడు కార్తీక్ క్యాంపు కి వెళ్ళాలి కానీ మీ అమ్మని ఈ స్థితిలో వదిలి వెళ్ళాలని లేదు అంటాడు శ్రీధర్. అప్పుడు కాంచన మందలించి పంపిస్తుంది. శ్రీధర్ కార్తీక్ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.

Karthika Deepam 2 Serial 22nd June 2224 Episode Number 78 Here is full story

నాన్న క్యాంపుకు వెళ్తున్నాడు కానీ మనసంతా ఇక్కడే ఉంది, మీరు అమర ప్రేమికులు అని తల్లితో నవ్వుతూ అంటాడు కార్తీక్. ఆ మాటలకి కాంచన కూడా నవ్వుతుంది. మరోవైపు నర్సింహ అన్న మాటల గురించి ఆలోచిస్తూ రోడ్డుమీద పరధ్యానంగా నడుస్తుంది దీప. ఆమెని ఒక కారు గుదెయ్యబోతోంది. కానీ అవతలి వ్యక్తి సడన్ బ్రేక్ వేసి కారు ఆపి దీప దగ్గరికి వచ్చి చూసుకొని నడవలేవా అని అరుస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ నువ్వే చూసుకోకుండా నడిపావు అంటూ అతడి పై కేకలు వేస్తాడు.

అప్పుడు దీప మాట్లాడుతూ నేనే పరధ్యానంగా నడిచాను అతనిది ఏమి తప్పులేదు అంటూ అతనికి క్షమాపణ చెప్తుంది. అతను వెళ్ళిపోయిన తరువాత మీ నాన్నగారి విషయంలో జరిగింది చెప్పటానికి ఇదే కరెక్ట్ సమయం అందుకే అలా మాట్లాడాను ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్ లో ఆరోజు మీ నాన్నగారు ఉన్నారు.. ఆ కారు డ్రైవర్ ఉన్న ప్లేస్ లో నేను ఉన్నాను అంటూ జరిగింది చెప్తాడు కార్తీక్. కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు అదే దారిలో రాంగ్ రూట్లో వచ్చిన దీప తండ్రి కారుని గుద్ధి క్రింద పడిపోతాడు.

గబగబా కిందికి వచ్చిన కార్తీక్ అతడిని చూసి కంగారు పడతాడు. కానీ దీప తండ్రి మాత్రం తప్పు నాదే అని చెప్తాడు అంతలోనే ఎవరిదో ఆక్సిడెంట్ అనుకుని అక్కడికి వచ్చిన దీప తండ్రిని చూసి ఏడుస్తుంది, అయితే అప్పటికే ఆమె తండ్రి చనిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతడే మీ తండ్రిని చంపాడు అని చెప్తారు.. భయపడిన ఫ్రెండ్స్ కార్తీక్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది అక్కడ జరిగింది, ఈ రోజు జరిగింది నేను చూశాను కాబట్టి చెప్పాను ఆ రోజు జరిగింది చెప్పటానికి అక్కడ ఎవరు ముందుకు రాలేదు అందుకే మీ ముందు దోషిగా నిలబడ్డాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 22nd June 2224 Episode Number 78 Here is full story

దీప ఏమి మాట్లాడకపోవడంతో అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నారు, శౌర్య అని ఎందుకు అరిచారు అని అడుగుతాడు కార్తీక్. నిజం చెప్పటం ఇష్టం లేక నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది దీప. నేను అటే వెళ్తున్నాను రండి అని చెప్పటంతో అతని కార్ ఎక్కుతుంది దీప. మరోవైపు పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. నీకోసం నేను ఇంట్లోకి తిట్లు తింటున్నాను అంటుంది పారిజాతం. ఈ ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి.

మమ్మీ, డాడీ, తాతయ్య దీప ని సపోర్ట్ చేస్తే నువ్వు, మామయ్య, అత్తయ్య నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటుంది జ్యోత్స్న. ఓటింగ్ సమానంగా ఉంది కదా అంటుంది పారిజాతం. బావ మిగిలిపోయాడు గ్రానీ, బావ ఓటు ఎటువైపు వేస్తాడు అనుకుంటున్నావు అంటుంది జ్యోత్స్న. బావ ఖచ్చితంగా దీపకే ఓటు వేస్తాడు అంటుంది పారిజాతం. మన ఇంట్లోనే మనకి మెజారిటీ లేదు అలాంటిది నువ్వు నాకోసం ఏదో త్యాగం చేసేసావని మాట్లాడటం ఏమి బాగోలేదు అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X