చెల్లెలి ప్రేమ విషయం తెలుసుకున్న కార్తీక్.. కోలుకోలేని షాక్ లో పారిజాతం!

తల్లిదండ్రుల విన్న జ్యోత్స్న ఏ పేరెంట్స్ అయినా ఆగిపోయిన కూతురి నిశ్చితార్థం గురించి ఆలోచిస్తారు కానీ మా పేరెంట్స్ నీ గురించి ఆలోచిస్తున్నారు అని దీప బాధపడేలాగా మాట్లాడుతుంది. మరోవైపు యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాశీని రక్షించమని స్థానికులు అడిగితే పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది కానీ దీప అతడిని హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. తన కొడుకు కాశీని చూడటానికి హాస్పిటల్ కి వచ్చిన దాసు కార్తీక్ తన మేనల్లుడని గ్రహిస్తాడు, దీపని మెచ్చుకుంటూ, జ్యోత్స్న ప్రవర్తనకి బాధపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 23 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 131వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

చిన్నప్పుడు డ్రెస్ పాడైపోతుందని నన్ను వదిలేసింది, ఇప్పుడు కారు పాడైపోతుందని అతడిని వదిలేసింది ఇప్పుడు చెప్పండి ఎవరికి ప్రాణం విలువ తెలుసు అంటాడు కార్తీక్. నేను ఎవరినీ బాధ పెట్టాలని ఇలా చెప్పడం లేదు నా మనసులో బాధ చెప్తున్నాను అంతే అంటాడు కార్తీక్. నువ్వు చేసింది కరెక్టే అని మేనల్లుడుతో అంటాడు దశరథ్, తర్వాత కూతురు చేసిన పనికి చివాట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శివ నారాయణ పారిజాతంతో మాట్లాడుతూ పక్కనే నువ్వు కూడా ఉన్నావు కదా తప్పు, ఒప్పు చెప్పాలి కదా అంటాడు. అయినా నీకే తెలియదు, నువ్వేం చెప్తావు అంటూ భార్య కి చివాట్లు పెట్టి వెళ్ళిపోతాడు.

Karthika Deepam 2 Serial 23rd August 2024 Episode Number 131 Here is full story

మీరు పక్కన ఉంటే దానికి పెళ్లి అవుతుందో లేదో అని భయంగా ఉంది అని అత్తగారిని చూస్తూ కోపంగా అంటుంది సుమిత్ర. నువ్వు చేసిన తప్పుకి అందరూ నన్ను తిడుతున్నారు, నువ్వు మరీ ఇలా మారిపోతావ్ అనుకోలేదు, కార్తీక్ మనసులో నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో చూసావు కదా, ఇలా ఉంటే తను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అంటుంది పారిజాతం. నువ్వు కూడా నన్ను చంపకు అని పారిజాతంపై కోప్పడి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మరోవైపు హాస్పిటల్ కి వచ్చిన స్వప్న కాశీ ఎలా ఉన్నాడని దీపని అడుగుతుంది.

ఏడుస్తూ అతడిని కలవాలని లోపలికి వెళ్ళబోతుంటే ముందు అతని కోసం ఎందుకు ఏడుస్తున్నావు, అతడు నీకేమవుతాడో చెప్పు అంటుంది దీప. తన ప్రేమ విషయం దీప కి చెప్పి పరుగున కాశీ దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. వాళ్ళిద్దర్నీ అలా చూసిన దీప ఇప్పుడు ఈ విషయం కార్తీక్ బాబుకి ఎలా చెప్పాలి అనుకుంటుంది. స్వప్న ఏడుస్తూ నేను ఎదురు రాను అంటే నువ్వే వినిపించుకోలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటుంది. అంతా మన మంచికే అనుకో, ఏమో యాక్సిడెంట్ అయ్యి చనిపోవలసిన వాడిని నువ్వు ఎదురు రావటం వల్లే ప్రాణాలతో బయటపడ్డానేమో అంటాడు కాశీ.

Karthika Deepam 2 Serial 23rd August 2024 Episode Number 131 Here is full story

అంతలోనే కార్తీక్ హాస్పిటల్ కి వచ్చి పేషెంట్ కి ఎలా ఉంది అని దీని అడుగుతాడు. కార్తీక్ ని లోపలికి వెళ్ళనీయకుండా ఏదో చెప్పాలనుకుంటుంది దీప. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందు పేషెంట్ ని చూడనివ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి అక్కడ స్వప్న ని షాక్ అవుతాడు కార్తీక్. తన ప్రేమ వ్యవహారం అంతా చెప్తుంది స్వప్న.ఎలా అయినా తనకి సాయం చేయమని వేడుకుంటుంది. ఈ విషయం అతని తండ్రికి తెలుసా అంటాడు కార్తీక్. తెలియదు అంటుంది స్వప్న.

అతను బయటే ఉన్నారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను అతనికి ఈ విషయం తెలియటం మంచిది కాదు నువ్వు ఇంటికి వెళ్ళు అని స్వప్నతో అంటాడు కార్తీక్. కాశీకి కార్తీక్ని, దీపని పరిచయం చేస్తుంది స్వప్న. తనని కాపాడినందుకు దీప కి కృతజ్ఞతలు చెప్తాడు కాశి. అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్ ఐ సీ యు లో అంతమంది ఉండకూడదు అని చెప్పి అందరిని బయటికి పంపించేస్తుంది తర్వాత కాశీకి నిద్ర పట్టడానికి మెడిసిన్ ఇస్తుంది. బయటికి వచ్చిన తర్వాత దీప కి తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది స్వప్న.

Karthika Deepam 2 Serial 23rd August 2024 Episode Number 131 Here is full story

తర్వాత తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే చూడటానికి వచ్చాను అందుకే ఆలస్యం అయింది అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అంటుంది కావేరి. బాగానే ఉన్నాడు అంటుంది స్వప్న. అంటే అబ్బాయా అంటుంది కావేరి. అవును అంటుంది స్వప్న. తను ఎవరినో ప్రేమిస్తుంది కదా ఆ అబ్బాయేనా ఇతను అనుకుంటుంది కావేరి. అమ్మకి అనుమానం వచ్చిందా అనుకుంటుంది స్వప్న.

మరోవైపు బావ మనసులో నామీదచెడు అభిప్రాయం ఉందన్నావు కదా దానిని పోగొట్టుకోవటం ఎలాగో నాకు తెలుసు నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను అంటుంది జ్యోత్స్న. నేనూ వస్తాను అంటుంది పారిజాతం. మరోవైపు కాశీ దగ్గరికి వచ్చిన దాసుని చూసి పేషెంట్ నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయొద్దు అని నర్స్ చెప్పడంతో బయటికి వెళ్ళిపోతాడు దాసు. మరోవైపు హాస్పిటల్ కి జ్యోత్స్న తో పాటు వచ్చిన పారిజాతం అక్కడ ఉన్న దాసుని చూసి షాక్ అవుతుంది.

Karthika Deepam 2 Serial 23rd August 2024 Episode Number 131 Here is full story

నువ్వు వెళ్ళు, తెలిసిన వాళ్ళు కనిపించారు మాట్లాడి వస్తాను అని జ్యోత్స్న ని పంపించేసి కాశీ దగ్గరికి వస్తుంది పారిజాతం. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అని కొడుకుని అడుగుతుంది. తను చూస్తున్న యాక్సిడెంట్ వీడియో తల్లికి చూపిస్తాడు దాసు. అందరూ ఇదే చూస్తున్నారు ఈ వీడియోకి నీకు ఏంటి సంబంధం అంటుంది పారిజాతం. వాడు నా కొడుకు కాశి అంటాడు దాసు. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X