Karthika Deepam July 23th episode: తండ్రి ప్రవర్తన భరించలేకపోతున్న కార్తీక్.. దీపని నిలదీస్తున్న జ్యోత్స్న!

నా నిశ్చితార్థం జరగకుండా ఆపే వాళ్లెవ్వరినీ క్షమించను అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. దీప కూతుర్ని తీసుకుని మళ్ళీ సుమిత్ర ఇంటికి చేరుతుంది. దీపతో నాకు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు కార్తీక్. పెళ్ళికి అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది దీప. తండ్రి నిజస్వరూపం తెలుసుకుంటాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 23 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 104వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అని ఆలోచిస్తూ ఉంటుంది దీప. అంతలోనే అక్కడికి వచ్చిన కార్తీక్ నాకు స్వప్న అంటే చాలా ఇష్టం చెల్లెలుగా ఆమెని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు మాట్లాడుతున్న దానికి ఏమీ సంబంధం లేదు అంటుంది దీప. నిజమే కానీ మీరు ఆమె బాధ్యతలు నాకు అప్పగించారు కదా..

Karthika Deepam 2 Serial 23th July 2024 Episode Number 103 Here is full story

పెళ్లి చేసుకుంటే భార్యగా జ్యోత్స్న నా జీవితంలోకి వస్తుంది. దత్తత తీసుకుంటే స్వప్న చెల్లెలుగా నా జీవితంలోకి వస్తుంది.అందుకే మీ అభిప్రాయం కనుక్కుందామని వచ్చాను అంటాడు కార్తీక్. అంటే తనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని కంగారుగా చెప్తుంది దీప. నేను ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాను అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది దీప.

ఏమిటి ఆశ్చర్యపోతున్నారా కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూడండి అని శ్రీధర్, కావేరి, స్వప్నల ఫోటో చూపిస్తాడు కార్తీక్. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది కానీ మీకు ఎప్పుడో తెలుసు, ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు కార్తీక్. మీ అమ్మగారి కోసమే చెప్పలేదు నిజం చెప్పాలనే ఆ రోజు మీ ఇంటికి వెళ్లాను కానీ మీ అమ్మగారి మాటల్లో నిజం తెలిస్తే ఆవిడ చనిపోతుందని తెలుసుకున్నాను.

అందుకే చెప్పలేదు మీరు కూడా చెప్పొద్దు, నిజం తెలిసిన మరుక్షణం ఆమె చనిపోవటానికి కూడా సిద్ధపడుతుంది. ఇప్పుడు మీరు చేయవలసినదల్లా ఆమెని సంతోషంగా ఉంచడమే లేదంటే తనని మోసం చేసిన భర్తకి భార్యగా, తన మాట నిలబట్టలేని కొడుక్కి తల్లిగా నిజంగానే ఆవిడ ఆవిటిదైపోతుంది అందుకే మీరు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోండి అంటుంది దీప. ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు కార్తీక్.ఇదంతా దూరం నుంచి చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది.

అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నాతో మాట్లాడకుండా దీపతో మాట్లాడి వెళ్ళిపోవటం ఏమిటి నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేస్తున్నారా దీపనే కనుక్కోవాలి, కానీ ఎలా అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ ఆనందంగా మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులని చూస్తాడు. తండ్రి అనే మాటకి, భర్త అనే మాటకి విలువ లేకుండా చేసేసాడు అని తండ్రిని చూసి అసహ్యించుకుంటాడు. నువ్వు క్యాంపు కి వెళ్లినట్లు ఉన్నావు ఏమైంది అని తండ్రిని అడుగుతాడు కార్తీక్.

మనల్ని వదిలేసి ఉండగలరా మీ నాన్న అందుకే త్వరగా వచ్చేసారు ఎంగేజ్మెంట్ అయిన వరకు రానని చెప్పారంట అంటుంది కాంచన. తల్లి భర్త మీద పెట్టుకున్న ప్రేమని చూసి జాలి పడతాడు కార్తీక్. నాకు మీ కన్నా ఎవరూ ఎక్కువ కాదు, నా ప్రపంచమే మీరు అని అంటున్న శ్రీధర్ ప్రవర్తనని భరించలేక పోతాడు కార్తీక్. కార్తీక్ ని చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది తల్లి. కొంచెం తలనొప్పిగా ఉంది అంటాడు కార్తీక్. బయటికి వెళ్దామా అంటాడు శ్రీధర్. షాపింగ్ కా అంటాడు కార్తీక్.

ఆ మాటలకి షాక్ అవుతాడు శ్రీధర్. వీడేమిటి తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. ఇప్పుడు నేను సమస్యల్లో ఉన్నాను నా సమస్య తీరిన తర్వాత అప్పుడు మీ గురించి ఆలోచిస్తాను అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీడిని చూస్తే అనుమానం గా ఉంది దీప నిజం చెప్పేసిందా అనుకుంటాడు శ్రీధర్. మరోవైపు జ్యోత్స్న దీప మాట్లాడుతూ నువ్వు ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావు,మళ్ళీ ఎందుకు వచ్చావు అని నిలదీస్తుంది.

మీ నిశ్చితార్థం అని సుమిత్ర గారు చెప్తే వచ్చాను అంటుంది దీప. అమ్మ కోసం వచ్చావా, బావ కోసం వచ్చావా అని నిలదీస్తుంది జ్యోత్స్న. ఆ మాటలకి కోప్పడుతుంది దీప. మా బావ అంటే నాకు పంచప్రాణాలు అతని కోసం నేను ఇక్కడ నుంచి దూకేయమన్నా దూకేస్తాను అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X