Karthika Deepam August 24th episode: భార్యకి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్.. పారిజాతం ప్రవర్తనపై కార్తీక్ అనుమాన
యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాశీని రక్షించమని స్థానికులు అడిగితే పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. కానీ దీప అతడిని హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. తన కొడుకు కాశీని చూడటానికి హాస్పిటల్ కి వచ్చిన దాసు కార్తీక్ తన మేనల్లుడని గ్రహిస్తాడు, దీపని మెచ్చుకుంటూ, జ్యోత్స్న ప్రవర్తనకి బాధపడతాడు. పారిజాతం నీ ప్రవర్తనతో మీ బావని దూరం చేసుకుంటున్నావు అని మనవరాలిని మందలిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 24 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 132వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
యాక్సిడెంట్ అయిన వ్యక్తి తన కొడుకని దాసు చెప్పటంతో షాక్ అవుతుంది పారిజాతం. మరోవైపు దీప దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న ఒక్కదానివే ఉన్నావు, మీ కార్తీక్ బాబు కనిపించడం లేదు ఏమిటి అని వెటకారంగా అంటుంది. నువ్వు అందరితో బానే మాట్లాడుతావు కదా నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకిలా మాట్లాడుతావు అని అడుగుతుంది దీప. నువ్వు కూడా అందర్నీ సంతోషంగా ఉంచడానికి చూస్తావు కానీ నన్ను మాత్రం ఎందుకు డిస్టర్బ్ చేస్తావు.

నువ్వు మా బావ చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను అంటూ రాష్ గా కాశీ రూమ్ లోకి వెళుతుంది జ్యోత్స్న. ప్రశాంతంగా పడుకున్న ఉన్న కాశీ ని చూసి యాక్సిడెంట్ అతనికి అయింది కానీ డ్యామేజ్ నాకు జరిగింది వాడెవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరూ నన్ను అంటున్నారు అని కోపంగా మాట్లాడుతుంది. ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని అడుగుతుంది దీప. నీతో గొడవ పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా, అయినా ఈ రూమ్ లో సీసీ కెమెరాలు లేవు కదా మళ్లీ ఎవడో ఒకడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు.
అప్పుడు ఆ కామెంట్లు చదవలేక ఉరేసుకు చావాలి అంటుంది జ్యోత్స్న. అంతలోనే కార్తీక్ రావటంతో ఇతనికి ఎలా ఉంది చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అయ్యి చూడటానికి వచ్చాను అని ప్లేట్ మార్చేస్తుంది జ్యోత్స్న. జోత్స్న ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన దీప మంచితనం నటించకూడదు జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్ దగ్గర మంచిగా నటించి నా తరపున ఆ వ్యక్తికి సారీ చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి వచ్చినట్లుంది అంటాడు కార్తీక్. మరోవైపు తన మనవడిని గుర్తుపట్టలేనందుకు బాధపడుతుంది పారిజాతం. జ్యోత్స్న ని అలా పెంచారేంటి ప్రాణం కంటే కారు ఎక్కువా అంటాడు దాసు. దానిని అలా తయారు చేసింది నేనే అని తనని తాను తిట్టుకొని మనవడిని చూడ్డానికి వెళ్తుంది పారిజాతం. మధ్యలో కనిపించిన జ్యోత్స్న నువ్వెందుకు వాడిని చూడటం అని అంటే ఏదో సాకు చెప్పి కాశీ దగ్గరికి వెళుతుంది.
పారిజాతాన్ని చూసిన ఇంకా రాలేదు ఏంటో అనుకుంటున్నాను అంటాడు కార్తీక్.మనవడిని చూసి ఎమోషనల్ అవుతున్న పారిజాతంతో ఏదో నీ సొంత మనవడిని చూసినట్లు అంతగా ఎమోషనల్ అవుతున్నావేంటి, నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు అంటాడు కార్తీక్. అతనికి కూడా నిజం చెప్పలేక ఏదో సాకు చెప్తుంది పారిజాతం. తర్వాత దీప కాశీని జాగ్రత్తగా చూసుకుంటుందని తెలిసి ఆమెకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం.

ఆమె ప్రవర్తన వెనుక కారణం ఏదో ఉంది అని దీపతో అంటాడు కార్తీక్. తర్వాత తన కొడుకుని కలిసిన పారిజాతం మళ్ళీ వస్తాను అంటే రావద్దు అని తల్లితో చెప్పిన దాసు కూతురి ప్రవర్తన గురించి తల్లి దగ్గర బాధపడతాడు. తర్వాత లేటుగా వచ్చిన పారిజాతాన్ని ఎవరో అడ్రస్ లేనోన్ని ఇంతసేపు చూడటం ఏమిటి అని కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. వాడు అడ్రస్ లేని వాడు ఏంటి అని జోత్స్నని కోప్పడుతుంది పారిజాతం. గ్రానీ ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది జ్యోత్స్న.
మరోవైపు కూతురి గురించి శ్రీధర్ కి చెప్పాలనుకుని అతనికి ఫోన్ చేస్తుంది కావేరి. ఫోన్ కాంచన లిఫ్ట్ చేసిందని తెలియక బేబీ అంటూ ఏదో మాట్లాడేస్తుంది. బేబీ ఎవరు అని కాంచన అడిగేసరికి కంగారు పడిన కావేరి ఫోన్ పెట్టేస్తుంది. కాఫీ తీసుకొచ్చిన భర్తని బేబీ ఎవరు అని నిలదీస్తుంది కాంచన. ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీధర్, ఆమెని మభ్యపెట్టడానికి ఏవేవో చెప్తాడు. అతని మాటలు బయటికి నమ్మిన కాంచన లోపల మాత్రం ఈయన చెప్తున్నది నిజమేనా అని అనుమాన పడుతుంది.
మరోవైపు శౌర్య ని తీసుకెళ్లడానికి వచ్చిన దీప ని ఆ వ్యక్తిని కాపాడి చాలా మంచి పని చేశావు అని మెచ్చుకుంటుంది సుమిత్ర. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న దీప ఎప్పుడూ మంచి పనులే చేస్తుంది పాపం యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఎవరైనా ఉన్నారో లేదో, తీసుకువచ్చి మన ఔట్ హౌస్ లో పెట్టుకుందాము, దీపని మన ఇంట్లో పెట్టుకుందాము. అప్పుడు తనకి ఇంకా మంచి పేరు వస్తుంది, దీప మానవతావాది అని మా బావ లాంటి వాళ్ళు నీ చుట్టూ చేరి భజన చేస్తారు అంటుంది జ్యోత్స్న.

ఆ మాటలకి కూతుర్ని కోప్పడిన సుమిత్ర నువ్వు మారతావు అనుకుంటే రోజురోజుకీ విపరీతంగా తయారవుతున్నావు, పెళ్లయితేనే గాని నువ్వు దారిలోకి రావు అని కూతురు ప్రవర్తనకి విసిగిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. తర్వాత జ్యోత్స్న దీపతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అందరూ మనిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు, నాకు తెలిసి ఎవరి దృష్టిలోనూ మంచి అనిపించుకోవడానికి నువ్వే ఆ వీడియో తీయించామనిపిస్తుంది అంటుంది. ఆ మాటలకి కోపంగా చూస్తుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











