Karthika Deepam July 24th episode:టెన్షన్ భరించలేకపోతున్న జోత్స్న, పారిజాతం.. ఇంతకీ కార్తీక్ నిర్ణయం ఏమిటి?
దీప కూతుర్ని తీసుకుని మళ్ళీ సుమిత్ర ఇంటికి చేరుతుంది. దీపతో నాకు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు కార్తీక్. పెళ్ళికి అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది దీప. తండ్రి నిజస్వరూపం తెలుసుకుంటాడు కార్తీక్. ఈ విషయం దీపకి కూడా తెలుసు అని తెలుసుకొని తనతో ఎందుకు చెప్పలేదని దీపని నిలదీస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 24 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 105వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీపతో మాట్లాడుతున్న జ్యోత్స్న బావ నా ప్రాణం, బావతో గడపబోయే జీవితం గురించి చిన్నప్పటినుంచి కలలో కోటలు కట్టుకున్నాను ఇప్పుడు ఎవరో వచ్చి ఆ కోట కోడలు బద్దలు కొడతానంటే ఊరుకోను అని హెచ్చరిస్తుంది. నిన్ను ఎవరో తప్పుతోవ పట్టిస్తున్నారు జోత్స్న, నేను ఇక్కడికి వచ్చింది మీ పెళ్లి చూడడం కోసమే అంతేగాని మీ నిశ్చితార్థం ఆపటానికి కాదు అంటుంది దీప. అలా అయితే ఓకే కానీ ఎట్టి పరిస్థితులలోనైనా బావతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అని దీపతో చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది జ్యోత్స్న.

పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కార్తీక్ బాబు అంటున్నారు. ఏ పరిస్థితులలో అయినా ఈ పెళ్లి జరగకపోతే నింద నా మీదే పడుతుంది అనుకుంటుంది దీప. మరోవైపు కావేరి, శ్రీధర్,స్వప్న ల ఫోటో చూస్తూ తండ్రిని తిట్టుకుంటూ ఉంటాడు కార్తీక్. అంతలో తల్లి భోజనానికి పిలవడంతో కిందికి వస్తాడు.అప్పుడే శ్రీధర్ భార్యకి భోజనం కలిపి తినిపించబోతుంటాడు. అతని దగ్గర పళ్లెం లాక్కొని నేను తినిపిస్తానులెండి అంటాడు కార్తీక్.
ఎందుకు అంటాడు శ్రీధర్. ఇప్పటికే మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ అసూయ వేస్తుంది అందుకే అంటాడు కార్తీక్. వీడి ప్రవర్తన ఏమిటి తేడాగా ఉంది అని అనుమానపడతాడు శ్రీధర్. కార్తీక్ తల్లికి భోజనం తినిపిస్తుంటే నేను నీకు తినిపించినప్పుడు ఎంత ఆనందంగా ఉందో నువ్వు నాకు తినిపిస్తుంటే అంత ఆనందంగా ఉంది అని చెప్తుంది. మీ తల్లిని సంతోషంగా ఉంచే పనులు చేయండి అన్న దీప మాటలు కార్తీక్ కి గుర్తుకు వస్తాయి.

తరువాత కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని దీప, ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కార్తీక్ ఆలోచిస్తూ ఉంటారు. మరుసటి రోజు కార్తీక్ ని పిలిచిన కాంచన ఎల్లుండి జరగబోయే నిశ్చితార్థం గురించి మాట్లాడటానికి తాతయ్య రమ్మన్నాడు అంటుంది. ముందు మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు కార్తీక్ కానీ తల్లి ఎమోషన్ చూసి వాళ్లతో పాటు బయలుదేరడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు.
దీప నిశ్చితార్థం ఆపేస్తుందేమో అని కంగారుపడుతుంది పారిజాతం. అలా చేస్తే ఏం జరుగుతుందో తనకి క్లారిటీ ఇచ్చానులే అంటుంది జ్యోత్స్న. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కిందికి వచ్చేసరికి కింద సుమిత్ర వాళ్లు కూడా పెళ్లి కబుర్లే మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే మేళతాళాలు వినిపించడంతో ఏమిటా సౌండు అనుకుంటూ అందరూ బయటకు వస్తారు. కార్తీక్ తన తల్లిదండ్రులని తీసుకొని మేళతాళాలతో వస్తూ ఉంటాడు.

ఆ సౌండ్ కి శౌర్య కూడా బయటికి వచ్చి చూస్తుంది. కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి ఈ డప్పులు పెళ్ళా అని అడుగుతుంది, అవును అంటాడు కార్తీక్. ఏమిటి ఈ హడావుడి నిశ్చితార్థం ఎల్లుండి కదా అని అయోమయంగా అడుగుతారు శివ నారాయణ వాళ్ళు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం మీ అందరితోని చెప్పాలి పదండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అందరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్.
కానీ పారిజాతం జ్యోత్స్న మాత్రం బయటే ఉండిపోతారు. ఇప్పుడు శౌర్య నా కూతురని దీప నా భార్యని దీపం పెళ్లి చేసుకుంటానని చెప్తాడేమో అని టెన్షన్ పడిపోతుంది పారిజాతం. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా సొంత కధ రాసేస్తున్నావేంటి అసలుకే నేను టెన్షన్తో లోబీపీ వచ్చి పడిపోయేలాగా ఉన్నాను, అసలు ముందు లోపల ఏం జరుగుతుందో చూద్దాం పద అని లోపలికి వెళ్తారు.
తర్వాత కార్తీక్ తన నిర్ణయం చెప్పేముందు దీప కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి దీప ని తీసుకురమ్మని శౌర్య ని పంపిస్తాడు. ఆ మాటలకి పారిజాతం, జ్యోత్స్న మరింత టెన్షన్ పడుతారు. దీప ని తీసుకొని వస్తుంది శౌర్య. రమ్మన్నారంట అని కార్తీక్ తో అంటుంది. తననే కోపంగా చూస్తున్న జ్యోత్స్న ని చూసి కంగారు పడుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











