Karthika Deepam June 24th episode: పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దీప.. విషం తాగి చనిపోతానంటున్న కాంచన!

కార్తీక్ శౌర్య మీద చూపిస్తున్న అభిమానం విషయంలో జ్యోత్స్న ని హెచ్చరిస్తుంది శ్రీవాణి. కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న దీప హోటల్ దగ్గరికి వెళ్లి ఆమెని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాధపెడుతుంది. శోభ కి పిల్లలు పుట్టరని తెలిసిన అనసూయ దీప కూతుర్ని తెచ్చుకోమని కొడుక్కి సలహా ఇస్తుంది. రోడ్డుమీద మరొక స్త్రీ తో శ్రీధర్ ని చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు నర్సింహ దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకి చేయమని అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 24 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 79వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

జ్యోత్స్న పారిజాతం తో మాట్లాడుతూ మన ఇంట్లో మనకే మెజారిటీ లేదు అలాంటిది మనమేదో ఊడబోడి చేసినట్లు మాట్లాడుకోవడం అనవసరం అంటుంది. అంతలోనే ఇంటి ముందు ఆగిన కారులోంచి కార్తీక్ దిగడం చూసి నీకోసమే మనవడు వచ్చినట్లు ఉన్నాడు అంటుంది పారిజాతం. వెనక సీట్లోంచి దీప దిగడం చూసిన జ్యోత్స్న ఇప్పుడు అర్థమైందా ఎవరికోసం వచ్చాడో అంటుంది. కార్ లోంచి దిగిన దీప మందుల కవర్ కింద పడిపోవటంతో తీసి కార్తీక్ కి ఇస్తుంది. ఇన్ని మందులు కొన్నారేంటి అని అడుగుతుంది.

Karthika Deepam 2 Serial 24th June 2424 Episode Number 78 Here is full story

అమ్మకి బాగోలేదు, నాన్న కూడా ఊర్లో లేరు అని చెప్తాడు కార్తీక్ అత్త వాళ్ళకి చెప్పకండి కంగారు పడతారు అని కూడా చెప్తాడు. ఆ తరువాత అంత పరధ్యానంగా నడుస్తున్నారు, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడుగుతాడు కార్తీక్. నిజం చెప్పటం ఇష్టం లేక నాన్నగారు ఇంట్లో లేరు అన్నారు కదా అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళండి అంటుంది దీప. కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే దీప తన గదికి వెళ్ళిపోతుంది.

ఇదంతా చూస్తున్న పారిజాతం, జ్యోత్స్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరిని కలవకుండా ఆపలేం గ్రానీ అంటుంది జ్యోత్స్న. వెళ్లి ఆ దీపని కడిగిపారేయ్ అంటుంది పారిజాతం. డైరెక్ట్ గా వెళ్లి అడగకూడదు, మాటలని ఎప్పుడు వాడుకోవాలో అప్పుడే వాడుకోవాలి,బావతో నా పెళ్లి జరగదేమో అని నువ్వు భయపడుతున్నావు కానీ ప్రపంచం సర్వ నాశనం అయిపోయినా బావ పెళ్లి నాతోనే జరుగుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న.

పూర్తిగా నా మనవరాలు నాలాగే మారిపోయింది అని గర్వపడుతుంది పారిజాతం. మరోవైపు వంట చేస్తున్న దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, అతను నిజం చెప్పాలనుకున్న నేను చెప్పనివ్వలేదు అయినా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు, ఆయనని ఎన్ని మాటలు అన్నాను అని కన్నీరు పెట్టుకుంటుంది.

Karthika Deepam 2 Serial 24th June 2424 Episode Number 78 Here is full story

నేను ఎన్ని మాటలు అంటున్నా భరిస్తూ నేను మీ శ్రేయోభిలాషిని అంటు నాకు మంచి చేయాలని చూస్తున్నా ఆ మనిషిని ఎలాగైనా క్షమాపణ అడగాలి అంటూ పశ్చాత్తాపం తో కుమిలిపోతుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య ఎవరిని క్షమాపణ అడగాలి అని అడుగుతుంది. కూతుర్ని దగ్గరికి తీసుకొని ఈరోజు నాకేమైనా అయితే నువ్వు ఏమైపోయే దానివి, నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో, నిన్ను ఎప్పటికీ ఆ నర్సింహ కి ఇవ్వను వాడి మీద కూడా నీ మీద పడనివ్వను అని ఏడుస్తూ అనుకుంటుంది దీప.

మరోవైపు తల్లికి సేవలు చేస్తూ ఉంటాడు కార్తీక్, అప్పుడే రెస్టారెంట్ కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేయటంతో తల్లికి విషయం చెప్పి నువ్వు వంట చేయొద్దు నేను వచ్చేటప్పుడు రెస్టారెంట్ నుంచి ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలాగో వంట చేయనివ్వరు వీడు అలాగే అంటాడు కానీ నేను వంట చేస్తాను అనుకుంటుంది కాంచన. మరోవైపు కారులో కావేరితో వెళ్తున్న శ్రీధర్ ని చూసి అతడిని తిట్టుకుంటుంది దీప.

భర్త గురించి నిజం తెలిస్తే ఆవిడ ఏమైపోతారో ఒంట్లో బాగోలేదు అన్నారు ఎలా ఉన్నారో ? ఏమిటో అనుకుంటుంది. మరోవైపు వంట చేయటానికి ఇబ్బంది పడుతున్న కాంచన దగ్గరికి వచ్చి వంటలో హెల్ప్ చేస్తుంది దీప. నాకు ఒంట్లో బాగోలేదని నీకు ఎలా తెలుసు అంటుంది కాంచన. కార్తీక్ బాబు చెప్పారు అంటుంది దీప. నేను వంట చేస్తాను నీకు ఎందుకు శ్రమ అంటుంది కాంచన. కార్తీక్ బాబు మాకు చేసిన సాయం ముందు ఇదెంత అంటూ శ్రీధర్ ఆలోచనలో పడుతుంది దీప.

Karthika Deepam 2 Serial 24th June 2424 Episode Number 78 Here is full story

అయితే కాంచన దీప ఆమె భర్త గురించి ఆలోచిస్తుంది అనుకుంటుంది. కానీ దీప శ్రీధర్ తో పాటు కాంచన గురించి ఆలోచిస్తుంది ఇలాంటి మంచి మనిషికి భర్త గురించి నిజం చెప్పకపోతే మోసం చేసినట్లు అవుతుంది ఎలాగైనా ఈమెకి నిజం చెప్పాలి అనుకుంటుంది. వంట పూర్తి చేసిన దీప కాంచనకి వడ్డిస్తూ శ్రీధర్ గురించి నిజం చెప్పాలనుకుంటుంది. నేరుగా చెప్పకుండా ఒక కథలాగా చెప్పి అలాంటి మనిషిని ఏం చేయాలి అంటుంది.

అలాంటి మనిషికి విడాకులు ఇచ్చేయాలి, నిజాయితీగా ప్రేమిస్తున్న ఇద్దరి భార్యలని మోసం చేస్తున్నాడు అంటే వాడు అసలు మనిషే కాదు బయటి వాళ్లు సంగతి ఏమోగానీ నాలాంటి భార్య అయితే భరించలేక ఇంత విషం మింగి చస్తుంది అంటుంది కాంచన. ఆ మాటలకి షాక్ అవుతుంది దీప. నేను అలాంటి భార్య నే కదమ్మా అంటుంది. నీకు ఉన్న ధైర్యం అందరికీ ఉండదు దీప అంటుంది కాంచన. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X