Karthika Deepam July 25th episode: కార్తీక్ షాక్‌తో స్పృహ కోల్పోయిన పారిజాతం.. శౌర్య కోరిక విని దీప ఎమోషనల్!
పెళ్ళికి కార్తీక్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది దీప. తండ్రి నిజస్వరూపం తెలుసుకుంటాడు కార్తీక్. ఈ విషయం దీపకి కూడా తెలుసు అని తెలుసుకొని తనతో ఎందుకు చెప్పలేదని దీపని నిలదీస్తాడు. మీకు తల్లిని దూరం చేయటం ఇష్టం లేక చెప్పలేదు మీ తల్లిని సంతోషపెట్టేందుకు ఈ పెళ్లి చేసుకోండి అని కార్తీక్ తో చెప్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 25వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 106వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ ఏం చెప్తాడో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. జ్యోత్స్న అయితే బావ దీప గురించి చెప్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అనుకుంటూ ఎవరికీ కనిపించకుండా కత్తి పట్టుకుంటుంది. నేను మాట్లాడబోయేది జరిగిపోయిన పెళ్లి గురించి అంటాడు కార్తీక్. దాంతో ఇంట్లో వాళ్ళందరూ మరింత టెన్షన్ పడతారు. జరిగిపోయింది ఎవరికి అని అడగకండి ఎందుకంటే పెళ్లిళ్లు స్వర్గంలో అవుతాయి ఎక్కడ కేవలం నిర్ణయాలు మాత్రమే అవుతాయి.

ఆ ప్రకారం చూసుకుంటే నాకు జ్యోత్స్న కి ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటాడు కార్తీక్. ఆ మాటలకి జ్యోత్స్న ఆనందపడిపోతుంది నేను బావని తప్పుగా అర్థం చేసుకున్నానా లేదంటే నేను ఇచ్చిన వార్నింగ్ వర్క్ అవుట్ అయిందా అనుకుంటుంది. పారిజాతం అయితే కార్తీక్ ఇచ్చిన షాక్ కి ఏకంగా స్పృహ కోల్పోతుంది. కార్తీక్ ఆమెని లేవదీస్తే నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని మనవడిని పట్టుకుని తెగ ఆనంద పడిపోతుంది. దీప కూడా ఆనంద పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
పెళ్లి ఫిక్స్ అయింది కదా షాపింగ్ చేద్దాం అంటుంది శౌర్య అక్కర్లేదు నా ఫ్రెండ్ కి షాప్ ఉంది మనకి కావలసినవన్నీ తీసుకుని అతను ఇంటికి వస్తాడు అతనితో మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న కి బట్టలు పెడుతుంది కాంచన. ఆనందంతో అత్తమామల కాళ్ళకి నమస్కారం చేస్తుంది జ్యోత్స్న. పెద్దవాళ్లు తనని ఆటపట్టిస్తుంటే సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు శోభ అత్తగారితో కావాలనే గొడవ పెట్టుకుంటుంది.
అప్పుడే వచ్చిన నర్సింహ ఇంట్లో ఉండేది ఇద్దరు కానీ ఎప్పుడూ గొడవలే అంటాడు. దాని మాటలు వెనక అర్థం వేరే ఉంది పిల్లని తీసుకు వస్తానని చెప్పారు కదా ఇంకా తీసుకురాలేదేమిటి అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది అంటుంది అనసూయ. మనసులో మాట భలే కనిపెట్టారు అత్తయ్య అంటుంది శోభ. లేకపోతే నీకు అత్తని ఎలా అవుతాను అంటూ రేపు మంచి రోజు వెళ్లి శౌర్య ని తీసుకొని వచ్చేద్దాము రేపు కిరాయి ఏదీ ఒప్పుకోవద్దు అని కొడుకుతో చెప్తుంది అనసూయ.

మరోవైపు తన ఫ్రెండ్ తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన కార్తీక్ ని పిలిచి అతనికి అభినందనలు చెప్తుంది దీప. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టెన్షన్ పడ్డాను సరైన నిర్ణయం తీసుకుని అందరికీ సంతోషాన్ని ఇచ్చారు అంటుంది. ఇదంతా మీ వల్లే దీప, మన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం జీవించడంలో ఆనందం ఉంటుంది అని మిమ్మల్ని చూసే తెలుసుకున్నాను. మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తే ఏ నుయ్యో,గొయ్యో చూసుకోకుండా కూతురు కోసం బ్రతుకుతున్నారు, అలాగే నేను కూడా మా అమ్మ కోసం బ్రతకాలి అనుకున్నాను.
నిజం తెలిసిన వెంటనే నాన్నని నిలదీయాలనిపించింది కానీ మా అమ్మ కోసం ఆలోచించి ఆగిపోయాను. జ్యోత్స్న ప్రేమలో నిజం ఉంది ఆమెలో మా అమ్మ కనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకమీదట మీరు ఎవరితోనూ మాటలు పడవలసిన అవసరం లేదు అంటాడు. ఈ నిజం ఎప్పటికీ మీ అమ్మగారికి తెలియకుండా ఉంటుందా అంటుంది దీప. ముందు ఈ పెళ్లి జరగనివ్వండి తర్వాత మా నాన్నగారి విషయం ఆలోచిద్దాం అంటాడు కార్తీక్.

ఆ రాత్రి కూతురికి భోజనం తినిపిస్తూ ఉంటే కార్తీక్ గురించి పదేపదే మాట్లాడుతుంది శౌర్య. నీకు నేను ఒక్కదాన్ని సరిపోనా, పదేపదే కార్తీక్ గురించి మాట్లాడొద్దు అతనికి త్వరలోనే పెళ్లి అయిపోతుంది అంటుంది దీప. అయితే ఏమైంది, నాకు నాన్న ఉండి ఉంటే బాగుండేది కదా అంటూ తల్లి ఊళ్లో తలపెట్టుకొని పడుకొని నాన్న ఒళ్ళో ఇలాగే పడుకోవాలని ఉంది కార్తీక్ అలాగే ఉంటాడమ్మా అంటుంది శౌర్య. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది దీప. నువ్వు కార్తీక్ లో నీ తండ్రిని చూసుకుంటున్నావని అర్థమైంది.
కానీ నీ చొరవని భరించలేని జ్యోత్స్న భర్తను తీసుకొని దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి అని బాధపడుతుంది. మరోవైపు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఒక సంఘటన జీవితాన్ని మార్చేస్తుందో అనుకుంటూ మా నాన్న రెండో పెళ్లి గురించి నాకు తెలియక పోయి ఉండి ఉంటే ఈపాటికి నిర్ణయాలు వేరే లాగా ఉండేవి ఇప్పుడు నాకు రేపు నిశ్చితార్థం, దానిని ఎవరు ఆపలేరు ఆపవలసిన అవసరం కూడా లేదు అనుకుంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











