Karthika Deepam August 26th: శౌర్యని తన నుంచి విడదీయొద్దంటున్న కార్తీక్.. తల్లి కాళ్లు పట్టుకొని బ్రతిమాలుతున్
దాసు కొడుకు కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది దీప. తన కొడుకు కాశీని చూడటానికి హాస్పిటల్ కి వచ్చిన దాసు కార్తీక్ తన మేనల్లుడని గ్రహిస్తాడు, దీపని మెచ్చుకుంటూ, జ్యోత్స్న ప్రవర్తనకి బాధపడతాడు. పారిజాతం నీ ప్రవర్తనతో మీ బావని దూరం చేసుకుంటున్నావు అని మనవరాలిని మందలిస్తుంది. యాక్సిడెంట్ జరిగింది దాసు కొడుక్కి అని తెలిసి షాక్ అవుతుంది పారిజాతం. స్వప్న ప్రేమ విషయం తెలుసుకుంటారు దీప, కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 26 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 132వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నన్ను ఇష్టపడిన వాళ్లు కూడా నీ వలన నన్ను తిడుతున్నారు థాంక్స్ అంటుంది జ్యోత్స్న. మన మాట తీరుని బట్టి అవతలివాళ్ళ ప్రవర్తన ఉంటుంది అంటుంది దీప. ఎవరి దగ్గరో మంచి అనిపించుకోవడం కోసం నువ్వే ఆక్సిడెంట్ వీడియో తీయించి పోస్ట్ చేయించావేమో అనిపిస్తుంది అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి కోపగించుకున్న దీప నాకు అంత అవసరం లేదు అయినా ఎదుటి వాళ్ళ మనసుని అభిమానంతో గెలుచుకోవాలి అహంకారంతో కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్ను నా బావ నుంచి ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అనుకుంటుంది జ్యోత్స్న.

మరోవైపు స్వప్న ఫోను చూసి ఆమె ఎవరితోనో ప్రేమలో పడిందని గ్రహిస్తుంది కావేరి. అప్పుడే స్వప్న రావడంతో ఆమెని నిలదీస్తుంది. తన ప్రేమ విషయం చెప్తుంది స్వప్న. ఆమె చెంప పగలగొట్టి ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడే విషయం మీ నాన్నకి చెప్తాను అంటుంది కావేరి. తల్లి కాళ్లు పట్టుకొని చెప్పొద్దు అని ఏడుస్తుంది స్వప్న. శాంతించిన కావేరి కూతురిని పక్కన పెట్టుకొని కాశీ గురించిన వివరాలని కూతురు ద్వారా తెలుసుకుంటుంది.
కాశీ జీవితంలో నువ్వు కాకుండా మరెవరైనా ఉన్నారా అని అడుగుతున్న తల్లితో అలా అడుగుతున్నావ్ ఏంటి అంటుంది స్వప్న. నా జీవితం లా నీ జీవితం కాకూడదు అని మనసులో అనుకున్న కావేరి మగవాళ్ళని అంత తొందరగా నమ్మటానికి లేదు అంటుంది. నాన్నకి అప్పుడే చెప్పొద్దు అని బ్రతిమాలుతున్న స్వప్నని చూస్తూ ముందు అతని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి, నాలాగా నీ జీవితం కాకూడదు,నువ్వు గొప్పగా బ్రతకాలి అనుకుంటుంది కావేరి. మరోవైపు కార్తీక్ కి ఫోన్ చేసి టాబ్లెట్ విషయం చెప్తుంది శౌర్య.

ఇంకా ఏవేవో మాట్లాడుతున్న శౌర్య దగ్గర ఫోన్ తీసుకొని పక్కన పడేసి ఎందుకు ఆయనని అస్తమాను విసిగిస్తావు, ఆయనకి బోలెడన్ని పనులు ఉంటాయి అని కోప్పడుతుంది. ఆ మాటలు అన్నీ కార్తీక్ వింటాడు. తర్వాత ఫోన్ కట్ చేయలేదు అన్న విషయం గ్రహించిన శౌర్య ఫోన్ కట్ చేసేస్తుంది తర్వాత కార్తీక్ దీప కి ఫోన్ చేసి మీరన్న మాటలు నేను విన్నాను, తను ఫోన్ చేస్తే నేను విసుక్కుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు.
నాతో అంత స్వచ్ఛంగా మాట్లాడే స్నేహితులు ఎవరూ లేరు, దయచేసి శౌర్యని నా నుంచి దూరం చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఫైల్ కబోర్డ్ లో పెడుతుంటే ఒక చైన్ కిందికి జారిపోతుంది. అది చిన్నప్పుడు తనని కోనేరులో కాపాడిన పాప గొలుసు. చైన్ వైపు చూస్తూ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది నీకు మాత్రమే, ఎప్పటికైనా మీరు రుణం తీర్చుకుంటాను అనుకుంటాడు కార్తీక్. అదే సమయంలో దీప అనవసరంగా మాట్లాడేసాను..

కార్తీక్ బాబు ఏమనుకుంటున్నారో అనుకుంటూ దేవుడి దగ్గర డబ్బా చూస్తూ ఇప్పటికే మీరు నాకు చాలా సాయం చేశారు, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అనుకుంటుంది. మరోవైపు సప్న గురించి ఆలోచిస్తున్న కార్తీక్ ఇప్పుడు నీ పెళ్లి చేయాలంటే నీ తల్లిదండ్రులతో మాట్లాడాలి, అప్పుడు నీ తండ్రి విషయం బయటపడుతుంది. అప్పుడు ఆ విషయం నా తల్లికి తెలుస్తుంది, తను భరించలేదు అనుకుంటాడు. అంతలోనే కాంచన అక్కడికి వచ్చి బేబీ అని ఎవరిని పిలుస్తారు అని కొడుకుని అడుగుతుంది.

బెస్ట్ ఫ్రెండ్స్ ని, ప్రేమించిన వాళ్ళని, ఈమధ్య మొగుడు పెళ్ళాలు కూడా అలాగే పిలుచుకుంటున్నారు అయినా ఎందుకు అడిగావు అని అంటాడు కార్తీక్. శ్రీధర్ ఫోన్ విషయం చెప్తుంది కాంచన. విషయం అర్థం చేసుకుంటాడు కార్తీక్. నాన్నని అనుమానిస్తున్నావా అని అడుగుతాడు. మీ నాన్న చాలా మంచివాడు కానీ అవతలి వాళ్ళు ఏమైనా మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నారు ఏమో అంటుంది కాంచన.

నాన్న కి మనం తప్ప వేరే లోకం లేదు అని తల్లిని మభ్యపెట్టిన కార్తీక్ కావాలంటే నువ్వు కూడా మీ ఆయనని బేబీ అని పిలువు అంటాడు నాకు అలాంటి పిలుపు లేని అక్కర్లేదు నువ్వే పిలుచుకో అంటుంది కాంచన ఎవరిని అంటాడు కార్తీక్. ఇందాక కార్తీక్ కబోర్డ్ లో పెట్టిన చైన్ అది దానిని చూపిస్తూ వీళ్ళని అంటూ ఈ చైన్ ఎవరిది, జ్యోత్స్న ఇలాంటివి వేసుకోదు కదా అని అడుగుతుంది కాంచన. చిన్నప్పుడు నేను కోనేరులో పడిపోతే ఒక పాప కాపాడింది కదా ఈ చైన్ తనదే, ఎలా వచ్చిందో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చింది అంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











