Karthika Deepam July 26th episode: కోపంతో నర్సింహ కాలర్ పట్టుకున్న శివనారాయణ.. బూచోడే తన తండ్రి తెలిసి షాకైన
తన తండ్రి విషయం దీపకి కూడా తెలుసు అని తెలుసుకొని తనతో ఎందుకు చెప్పలేదని దీపని నిలదీస్తాడు కార్తీక్. మీకు తల్లిని దూరం చేయటం ఇష్టం లేక చెప్పలేదు మీ తల్లిని సంతోషపెట్టేందుకు ఈ పెళ్లి చేసుకోండి అని కార్తీక్ తో చెప్తుంది దీప. శౌర్య ని రేపే తీసుకువచ్చేద్దాం అని కొడుకుతో చెప్తుంది అనసూయ. నిశ్చితార్థానికి కార్తీక్ ఒప్పుకుంటాడు ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 26వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 107వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నిశ్చితార్థ వేడుకలు ప్రారంభమవుతాయి. జ్యోత్స్న ని, కార్తీక్ ని పక్క పక్కనే సోఫాలో కూర్చోబెడతారు. నా అనుభవమే గెలిచింది చూసావా అని మనవడికి మాత్రమే వినిపించేలా అంటుంది పారిజాతం. గెలవడం కోసమే ఇదంతా చేస్తున్నాను అంటాడు కార్తీక్. కొడుకుని పెళ్లి కొడుకు లా చూసి ఆనందపడుతుంది కాంచన. నా జీవితకాలపు కల నెరవేరుతుంది అంటుంది. పెళ్లికి ఒప్పుకొని రెండు కుటుంబాల సంతోషానికి కారణమయ్యారు అనుకొని దీప కూడా ఆనందపడుతుంది.

శౌర్య కార్తీక్ దగ్గర కూర్చుంటాను అంటూ కార్తీక్ దగ్గరికి వెళుతుంది. కానీ జ్యోత్స్న ఇదేమి గెట్ టుగెదర్ కాదు అందరం కలిసి కూర్చోవడానికి అని శౌర్య ని పంపించేస్తుంది. ఎటో చూస్తున్న కార్తీక్ ని చూస్తూ నువ్వు మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నావు కానీ మనసే ఎక్కడో ఉంది అంటుంది జ్యోత్స్న. కొన్ని పనులకి మనిషి ఉంటే సరిపోతుంది అంటాడు కార్తీక్. కానీ నాకు రెండు కావాలి, నీ పక్కనా నేనే ఉండాలి, నీ మనసులో కూడా నేనే ఉండాలి అంటుంది. ఇంతలో పంతులుగారు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పడంతో జ్యోత్స్న ఆనందపడుతుంది.
ఈ నిమిషం ఈ ప్రపంచంలో నా కన్నా ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండి ఉండరు చాలా ఆనందంగా ఉంది బావ అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సరిగ్గా తాంబూలాలు మార్చుకునే సమయానికి నర్సింహ అక్కడికి వస్తాడు అతడిని చూసి భయపడుతుంది శౌర్య . బూచాడు నన్ను ఎత్తుకొని వెళ్ళిపోవటానికి వచ్చినట్లు ఉన్నాడు అని పైకి వెళ్లి దాక్కుంటుంది. నర్సింహ వెనకే వచ్చిన అనసూయని చూసిన పారిజాతం వీళ్ళని కూడా నిశ్చితార్థానికి ఆహ్వానించావా అని సుమిత్ర అని అడుగుతుంది.

ఈరోజు కార్తీక్ బాబు నిశ్చితార్థమా అంటూ లోపలికి వస్తాడు నర్సింహ. మీరు అదృష్టవంతులు మీకు అన్ని ఎలా జరిగిపోతుంటాయి అంటాడు. మనం వచ్చిన పని చూసుకొని వెళ్దాం అంటుంది అనసూయ. మేము ఈ నిశ్చితార్థం ఆపటానికి రాలేదు నా కూతురు కోసం వచ్చాను తనని ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు నర్సింహ.
అది నాకున్న ఒకే ఒక బంధం అత్తయ్య అది దానిని తీసుకు వెళ్లొద్దు అని బ్రతిమాలుతుంది దీప. అది నా కొడుకు రక్తం నువ్వు ఎలా పోతావో పో కానీ నా మనవరాలు నా ఇంటికి వస్తుంది అంటుంది అనసూయ. అలా అన్నందుకు సుమిత్ర, శివ నారాయణ వాళ్ళు తల్లీ కొడుకులని మందలిస్తారు. మీరు మీ మనవడి మాటలని నిజం చేసేలాగా ఉన్నారు అంటాడు నర్సింహ. ఏమన్నాడు అంటాడు శివ నారాయణ

ఆ బిడ్డకు తండ్రి మీ మనవడేనంట ఉంటాడు నర్సింహ ఆ మాటలకి కోపంతో నర్సింహా కాలర్ పట్టుకుంటాడు శివ నారాయణ. అన్నాడో లేదో మీ మనవడినే అడగండి అంటాడు నర్సింహ. వాడు నిన్నే అంటున్నాడు ఏమి మాట్లాడవేంటి అంటుంది కాంచన. అన్నాను అంటాడు కార్తీక్. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. వాడేదో అంటే నువ్వు కూడా ఆ మాటలే పట్టుకుంటావేంటి వెళ్లి నీ బిడ్డని నువ్వు తెచ్చుకో అది నీ రక్తం అంటుంది అనసూయ.
పెద్దాయన ఆవేశపడ్డారని చెప్పాను కానీ లేదంటే నేను మాత్రం చెప్పేవాడినా,వెళ్లి నీ మనవరాన్ని తీసుకొని రా నన్ను చూస్తే బూచాడని పారిపోతుంది అంటాడు నర్సింహ. వద్దని వారిస్తుంది దీప. ఆమెని పట్టుకుంటాడు నర్సింహ. కార్తీక్ అడ్డుకోవడానికి ప్రయత్నించబోతే అతడిని జ్యోత్స్న ఆపేస్తుంది. ఇది వాళ్ళ కుటుంబ సమస్య మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలొద్దు అంటుంది.
దాంతో ఏం చేయలేక పోతాడు కార్తీక్. ఇక్కడ మా ఇంట్లో నిశ్చితార్థం జరుగుతున్నట్టు లేదు, మీ పంచాయతీ జరుగుతున్నట్లు ఉంది అని కోప్పడుతుంది పారిజాతం. అనసూయ మేడ మీదకు వెళ్లి శౌర్య ని వెతుకుతుంటే శౌర్య నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ బూచాడొచ్చాడు నన్ను తీసుకుపోతాడు అంటుంది. నేను మీ నాన్నని తీసుకు వచ్చాను కింద అమ్మ దగ్గర ఉన్నాడు అనడంతో పరుగున కిందికి వస్తుంది శౌర్య.

అక్కడ నర్సింహని చూసి మళ్లీ వెనక్కి వెళ్ళిపోబోతుంది. ఆమెని ఆపిన అనసూయ అతడు బూచాడు కాదు నా కొడుకు, మీ నాన్న కూడా వాడే అంటుంది. ఆ మాటలకి షాక్ అవుతుంది శౌర్య. ఆ బూచాడు మా నాన్న కాదు అంటూ తల్లిని వాటేసుకొని వాడు మా నాన్న కాదు కదమ్మ అని ధైన్యంగా అడుగుతుంది. వాడే మీ నాన్న అని ఆవేశంగా చెప్తుంది దీప. ఆ మాటలకి నిర్గాంత పోతుంది శౌర్య. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











