Karthika Deepam: కార్తీక్ ని క్షమాపణ కోరిన దీప.. పారిజాతానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శివ నారాయణ!
మరొక స్త్రీ తో శ్రీధర్ ని చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు నర్సింహ దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకిచ్చేయమని అడుగుతాడు. కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. అక్కడ శ్రీధర్ గురించి కాంచనతో నిజం చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 26 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 81వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ కి క్షమాపణ చెప్తుంది దీప. అది నా డ్యూటీ కదా అంటాడు కార్తీక్. లేదు బాబు మా నాన్న విషయంలో నేను పొరపాటు పడ్డాను, మీరు చెప్పే వరకు అదే నిజం అనుకుంటూ వచ్చాను ఇప్పుడు నిజం తెలుసుకున్నాను అందుకే క్షమాపణ కోరుకుంటున్నాను అంటుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అంతే చాలు, ఇన్నాళ్లు మోయలేని బరువు ఏదో మోస్తున్నట్లుగా అనిపించేది ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది అంటాడు కార్తీక్.

తర్వాత దీప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జైల్లో నుంచి విడుదలైన ఖైదీ లాగా ఉంది నా పరిస్థితి అని ఆనందపడతాడు కార్తీక్. మరోవైపు తండ్రిని మీరు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటుంది స్వప్న. వ్యాపారం పని మీద ఉన్నప్పుడు అలా ఉండడం కుదరదు అంటాడు శ్రీధర్. కావేరి మాట్లాడుతూ స్వప్నకి పెళ్లి సంబంధాలు చూద్దాం అంటుంది. స్వప్న కి నిజం తెలిసేలోపు పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నట్లుగా ఉంది అనుకుంటాడు శ్రీధర్. కుదరదు, మీరు క్యాంపు లని బయటికి వెళ్లిపోతారు అప్పుడు నేనే అమ్మకు తోడు.

ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఒంటరి అయిపోతుంది అంటుంది స్వప్న. మీ అమ్మని నేను ఒంటరిగా వదిలేస్తాను అనుకున్నావా తను పక్కన ఉంటే నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అంటాడు శ్రీధర్. అంతలోనే కాంచన ఫోన్ చేస్తుంది. ఆఫీసులో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్. ఎందుకు అబద్దం చెప్పావు నాన్న అని అడుగుతుంది స్వప్న. అలా చెప్పకపోతే మీటింగులు అంటూ మన టైం వేస్ట్ చేస్తారు అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్.
ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు అని తల్లిని అడుగుతుంది స్వప్న. నిజం తెలిసిన కావేరి ఏవో పనులు ఉన్నాయని చెప్పారు కదా అని చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటుంది. ఏదో జరుగుతుంది, ముందు నాన్న కొబ్బరి బొండం ఇచ్చిన ఆవిడ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది స్వప్న. మరోవైపు దీప వంట చేసి భోజనం తినిపించాలి అనుకుంటే తల్లిని ఆటపట్టించాలనుకుంటుంది శౌర్య. అది గమనించిన దీప కూడా శౌర్య ని ఆట పట్టిస్తుంది. ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూతురికి భోజనం తినిపిస్తుంది దీప.

మరోవైపు కాంచన ఇంట్లో జరిగిందంతా కొడుక్కి కోడలికి చెప్తూ ఉంటాడు శివ నారాయణ. రెస్టారెంట్ పనులలో కార్తీక్ బిజీగా ఉన్నాడు వాడిని అడిగి ముహూర్తాల గురించి చెప్తానన్నది కాంచన అని చెప్తాడు. అలాగే మామయ్య, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు అంటుంది సుమిత్ర. అలా అని మరో ఐదేళ్లు పోయాక చేయండి అని కోపంగా అంటూ అక్కడికి వస్తుంది పారిజాతం. నిన్ను నోరు మూసుకొని ఉండమన్నాను కదా అని ఆమె మీద కోప్పడతాడు శివ నారాయణ.
ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, ఆ దీప కాంచన దగ్గరికి వెళ్లి సాయం చేయటం ఏమిటి, దాని వెనుక ఉద్దేశం ఏమిటి అంటుంది పారిజాతం. బంటుతో దీప బ్యాగ్ లో నక్లిస్ పెట్టించడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అంటూ పారిజాతం నోరుమూయిస్తాడు శివ నారాయణ. మనవడికి, మనవరాలికి ముందు పెళ్లి చేయండి ఆ తర్వాత నేను నోరు విప్పితే మీ చెప్పుతో కొట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం.

త్వరగా ఎంగేజ్మెంట్ చేసేద్దాం మావయ్య అప్పుడు అందరి ప్రశ్నలకి సమాధానాలు దొరికినట్లు అవుతుంది అంటుంది సుమిత్ర. మరోవైపు పని పూర్తి చేసుకుని వచ్చిన దీప శౌర్య పడుకోకుండా ఇంకా ఏదో పని చేస్తూ ఉండడం చూసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. సర్ప్రైజ్, కళ్లు మూసుకో అంటుంది శౌర్య. అప్పుడు శౌర్య కాగితంతో చేసిన మూడు బొమ్మలు టేబుల్ మీద
పెట్టి తల్లిని చూడమంటుంది.ఇది నువ్వు, నేను, నాన్న.
నువ్వు ఎలాగో నాన్నని తీసుకురావడం లేదు కదా అందుకే నేను తీసుకు వచ్చాను, రేపు ఫాదర్స్ డే అంటే నాన్నల పండుగ అందుకే ఇలా చేశాను అంటుంది. తండ్రి కోసం శౌర్య పడుతున్న తపన చూసి కంటనీరు పెట్టుకుంటుంది దీప. నీ తండ్రి నీకు నాకు చేసిన ద్రోహం గురించి తెలిస్తే ఎంత బాధ పడతావో అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











