Karthika Deepam August 27th episode: భర్తకి చుక్కలు చూపిస్తున్న శోభ.. దీప ఇంటికి చేరిన అనసూయ!
పారిజాతం నీ ప్రవర్తనతో మీ బావని దూరం చేసుకుంటున్నావు అని మనవరాలిని మందలిస్తుంది. యాక్సిడెంట్ జరిగింది దాసు కొడుక్కి అని తెలిసి షాక్ అవుతుంది పారిజాతం. స్వప్న ప్రేమ విషయం తెలుసుకుంటారు దీప, కార్తీక్. అస్తమానం కార్తీక్ కి ఫోన్ చేస్తున్న శౌర్యతో ఆయనని ఇబ్బంది పెట్టవద్దు అని మందలిస్తుంది దీప. ఫోన్ ఆపకపోవడంతో ఆ మాటలు విన్న కార్తీక్ శౌర్యని తన నుంచి దూరం చేయవద్దు అని దీపతో చెప్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 27 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 133వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కాంచన కొడుకుతో మాట్లాడుతూ ఎవరా అమ్మాయి ఏదైనా ప్రేమ కథ అని అడుగుతుంది. లేదు, నేను చిన్నప్పుడు కోనేట్లో పడిపోతే కాపాడిన అమ్మాయిది ఈ చైన్ అంటాడు కార్తీక్. దానిని ఎందుకు దాచుకున్నావ్ అంటుంది కాంచన. నా ప్రాణాలు కాపాడిన తన రుణం ఎప్పటికైనా తీర్చు కోవాలి. నాకు సాయం చేసినట్లే నేను కూడా తనకి సహాయం చేయాలి అంటాడు కార్తీక్. అంత మంచి మనసు ఉన్న అమ్మాయి జీవితం బాగానే ఉంటుంది కాంచన. బాగోకపోతే, ఆమె కూడా దీప లాంటి పరిస్థితులలో ఉంటే అని అనుమానంగా అంటాడు కార్తీక్.

అందరి జీవితం అలా ఎందుకు ఉంటుంది నర్సింహా లాంటి చెడ్డ భర్తలు ఉన్నట్టే మీ నాన్న లాంటి మంచి భర్తలు కూడా ఉంటారు అంటుంది కాంచన. నిజం తెలిస్తే నువ్వే నాన్నని ఎక్కువగా అసహ్యించుకుంటావు అనుకుంటాడు కార్తీక్. మరోవైపు పనిమీద బయటికి వచ్చిన దీపకి మట్టి మోస్తూ కనిపిస్తుంది అనసూయ. ఆమె దగ్గరికి వెళ్లి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటుంది. జరిగింది చెప్తుంది అనసూయ. నేను అందుకే చెప్పాను నాతో పాటు వచ్చేయమని కానీ నువ్వే వినలేదు నిన్ను ఈ పరిస్థితులలో నేను చూడలేను నాతో పాటు వచ్చేయ్ అంటుంది దీప.
ఆత్మ అభిమానంతో ముందు అనసూయ రాలేను అంటుంది కానీ దీప ఆప్యాయతకి కరిగిపోయి పని పూర్తయ్యాక ఇంటికి వస్తానని చెప్పి దీపని పంపించేస్తుంది. మరోవైపు శోభ నర్సింహ కి ఒక లిస్టు చేతిలో పెట్టి ముందు ఆ డబ్బులు నాకు కట్టండి అంటుంది. ఏంటిది అని అడుగుతాడు నర్సింహ. ఇన్నాళ్లు మీ అమ్మని మేపిన ఖర్చు, నిన్ను మేపిన ఖర్చు కోర్టుకైన ఖర్చు అంతా కలిపి ఐదు లక్షలు అయింది ముందు ఆ డబ్బు కట్టు అంటుంది శోభ. ఖర్చుపెట్టిన డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు అంటాడు నర్సింహ.

అతని జేబులో కారు తాళాలు తీసుకుని మా అమ్మ కారుకి తీసుకున్న ఫైనాన్స్ 10 లక్షలు. ఈ ఐదు లక్షలు ఇచ్చేవరకు నేను నీకు కారు గానీ బైక్ గానీ ఇచ్చేది లేదు అంటుంది. డబ్బులు కోసం మొగుణ్ణి ఇంత నీచంగా మాట్లాడతావా అంటాడు నర్సింహ. ముందు డబ్బులు చేతిలో పెట్టి అప్పుడు మాట్లాడు అంటుంది శోభ. ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకువస్తాను మా అమ్మ కూడా అక్కడే ఉంది కదా అంటాడు నర్సింహ. ఆ ఇల్లు దీప ది కదా అంటుంది శోభ. అవన్నీ నీకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ.
ఆ ఇల్లు అమ్మడానికి దీప, మీ అమ్మ ఒప్పుకోరు ఎలా డబ్బులు తెస్తావో చూస్తాను అనుకుంటుంది శోభ. మరోవైపు ఈ ప్రేమ, పెళ్లి కంటే ముందు నువ్వు జీవితంలో స్థిరపడు మంచి ఉద్యోగం చూసుకో అని స్వప్నతో అంటాడు కార్తీక్. అలాగే మీ ప్రేమ విషయం మీ నాన్నకి తెలిసిందా అని కూడా అడుగుతాడు. అమ్మకి తెలుసు కానీ నాన్నకి తెలిసినా ఒప్పుకుంటాడు అనుకోవడం లేదు అంటుంది స్వప్న. మీ నాన్నకి నువ్వంటే ఇష్టమే కదా, ఇంట్లో సరిగా ఉండటం లేదా అంటాడు కార్తీక్.

లేదు ఎందుకో ఎప్పుడూ భయపడుతున్నట్లుగా బ్రతుకుతాడు, మా అమ్మ కూడా అంతే నాన్నని నిలదీయదు, మా డాడీ మమ్మీని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది అంటుంది స్వప్న. తరువాత దీపకి, కార్తీక్ కి కృతజ్ఞతలు చెప్తుంది. ఎందుకు అని కార్తీక్ అంటే తను కాశీ ప్రాణాలు కాపాడితే నువ్వు హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేసావు చూస్తుంటే మా పెళ్ళికూడా మీ చేతుల మీదుగానే జరిగేలా ఉంది అంటుంది స్వప్న. సరేగాని ముందు జాబు వెతుక్కో, లేదంటే బిజినెస్ చేస్తాను అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెల్లెలికి ధైర్యం చెప్పి ముందు కాశీని ఇంటిదగ్గర డ్రాప్ చేయు అని చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
మరోవైపు ఇంటి ముందు ఆడుకుంటున్న స్వప్న బూచాడు అనుకుంటూ కంగారుగా తల్లి దగ్గరికి వెళుతుంది. కంగారుపడిన దీప బయటికి వచ్చేసరికి అక్కడ అనసూయ ఉంటుంది. వచ్చింది మీ నానమ్మ అని శౌర్యతో చెప్తుంది దీప. నానమ్మ బూచాడిని కూడా తీసుకువస్తుంది కదా అంటుంది శౌర్య. అలాంటిదేమీ లేదు అని చెప్పటంతో అనసూయ దగ్గరికి వస్తుంది శౌర్య. అప్పుడే అక్కడ పువ్వులు ఏరుకుంటున్న సుమిత్ర దగ్గరికి వెళ్లి అనసూయ ని తమతో పాటు ఉండడానికి పర్మిషన్ అడుగుతుంది దీప. ఆ మనిషి ఎవరో తెలియనప్పుడే ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను.
అలాంటిది నీకు ఎంత సాయం చేశాక ఇప్పుడు ఎందుకు వద్దంటాను అంటూ అనసూయ దగ్గరికి వచ్చి ఇప్పుడు వాళ్లతో పాటు మీరు కూడా మాకు ఆత్మీయులే మీరు ఇక్కడే ఉండొచ్చు అంటుంది సుమిత్ర. నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకున్నాను కానీ నా మేనకోడలు నన్ను వదులుకోలేకపోయింది అలా అని నేను తన మీద పడి తినను, తన కష్టాల్లో తోడుంటాను మీ ఇంట్లో కూడా ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి అంటుంది అనసూయ. సరే,జరిగింది మర్చిపోయి హాయిగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర.

ఇంట్లోకి వెళ్లి కూర్చున్న అనసూయ మనవరాలు తో బాగా చదువుకోమని చెప్తుంది. తర్వాత టాబ్లెట్లు ఇస్తే వేసుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తాను అంటుంది శౌర్య. సరే అని టాబ్లెట్ బాక్స్ ఓపెన్ చేసేసరికి టాబ్లెట్లు అయిపోయి ఉంటాయి. అదే విషయం శౌర్య తో చెప్తుంది. కవర్ నాకు ఇవ్వు నేను వెళ్లి టాబ్లెట్లు తీసుకు వస్తాను అంటుంది అనసూయ. దీప డబ్బులు ఇవ్వబోతే నా దగ్గర ఉన్నాయి అంటూ వెళ్ళిపోతుంది అనసూయ . ఆమెలో వచ్చిన మార్పు కి ఆనందపడుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











