Karthika Deepam July 27th episode: కోపంతో రగిలిపోతున్న జ్యోత్స్న.. హాస్పిటల్ పాలైన శౌర్య!

మీకు తల్లిని దూరం చేయటం ఇష్టం లేక మీ నాన్నగారి రెండో పెళ్లి విషయం చెప్పలేదు, మీ తల్లిని సంతోషపెట్టేందుకు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోండి అని కార్తీక్ తో చెప్తుంది దీప. శౌర్య ని రేపే తీసుకువచ్చేద్దాం అని కొడుకుతో చెప్తుంది అనసూయ. నిశ్చితార్థానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. నిశ్చితార్థం రోజున కూతుర్ని తీసుకుపోవడానికి శివ నారాయణ ఇంటికి వస్తారు నర్సింహ, అనసూయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 27వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 108వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నర్సింహ నీ తండ్రి అని దీప చెప్పటంతో నిర్గాంత పోయిన శౌర్య నాన్నగా బూచాడు వద్దు అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. కంగారుపడిన కార్తీక్ పాప దగ్గరికి వెళ్లాలనుకుంటే ఆపేస్తుంది జ్యోత్స్న. నేనే తండ్రిని చెప్పేసావ్ కదా ఇక నేను నా కూతుర్ని తీసుకుపోతాను అని స్పృహలో లేని పాపని ఎత్తుకుంటాడు నర్సింహ. అనసూయ అది కళ్ళు తిరిగి పడిపోయింది రా అంటుంది.

Karthika Deepam 2 Serial 27th July 2024 Episode Number 108 Here is full story

ఏదైతేనేమి మనం తీసుకోవడానికి కదా వచ్చాం కదా తీసుకుపోదాం అంటూ శౌర్య ని ఎత్తుకొని బయటికి వచ్చేస్తాడు నర్సింహ. అడ్డు వచ్చిన దీప ని తోసేస్తాడు. ఇదంతా చూస్తున్న కార్తీక్ ఇక ఆగలేక జ్యోత్స్న చేయి విదిలించుకొని బయటికి వచ్చేస్తాడు. నర్సింహ దగ్గర పాపని లాక్కొని నువ్వు ఇలాంటి పని చేస్తావనే ఆరోజు పాపనా కూతురు అని అబద్ధం చెప్పాను అయినా నువ్వు మారలేదు అంటూ నర్సింహా ని కోప్పడి కంగారుగా శౌర్య ని తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరుతాడు.

దీప కూడా వెంట బయలుదేరుతుంది. తింగర వెధవ, ఏం పని చేయడానికి వచ్చావు ఏం చేశావు అంటూ కొడుకుని మందలించి అక్కడి నుంచి వచ్చేస్తుంది అనసూయ. వెనకే నర్సింహ కూడా వెళ్ళిపోతాడు. అప్పటికే నిశ్చితార్థం ఆగిపోయిన షాక్ లో ఉంటుంది జ్యోత్స్న.కుటుంబ సభ్యులందరూ లోపలికి వెళ్లేసరికి మరింత కోపంతో రగిలిపోతుంది.

Karthika Deepam 2 Serial 27th July 2024 Episode Number 108 Here is full story

పూలు పళ్ళు చిందరవందర చేసేస్తుంది, ఆమెను ఆపాలని చూస్తుంది సుమిత్ర. ఆమెపై కోప్పడుతుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా ఎవరో బయట వాళ్ల కోసం నా నిశ్చితార్థం ఆగిపోవడం ఏమిటి, నా నిశ్చితార్థం ఆగిపోయిన బాధ గ్రానీ మొహంలో తప్ప మీ ఎవరి మొహంలోనూ కనిపించడం లేదు, బావ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు ఆపలేదు అసలు మీరు నా తల్లిదండ్రులేనా అంటూ కేకలు వేస్తుంది.

మీ అందరికీ నాకన్నా దీప ఎక్కువైపోయింది తను వెళ్లిపోయినప్పుడు అందరు మొహాల్లోనూ బాధని చూసాను, ఎవరు పిలిచారో తెలియదు కానీ ఊడిపడింది తను వచ్చేసరికి మీ అందరి మొహాల్లోనూ దీపావళి వెలుగులు కనిపించాయి అంటుంది. కాంచన వైపు తిరిగి బాధపడొద్దు అత్త నిశ్చితార్థం ఆగిపోలేదు కేవలం పోస్ట్ పోన్ అయింది అంతే, ఎప్పటికైనా బావే నా భర్త అని ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. జరిగిన సంఘటనకి కాంచన డిస్టర్బ్ అవుతుంది. భర్త ఆమెను ఓదార్చి టాబ్లెట్ తీసుకురమ్మని సుమిత్రతో చెప్తాడు.

Karthika Deepam 2 Serial 27th July 2024 Episode Number 108 Here is full story

టాబ్లెట్ వేసుకున్న కాంచన కాస్త స్థిమిత పడిన తరువాత కార్తీక్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మనమని చెప్పండి అని భర్తతో చెప్తుంది. శ్రీధర్ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు, కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు. వీడికి మనుషులే కాదు ఫోన్ కాల్స్ కూడా అక్కర్లేదు వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు కాంచన అని చెప్తాడు. మరోవైపు శౌర్యకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ చాలా టెస్ట్లు చేయిస్తాడు దీప దగ్గరికి వచ్చి పాపవి ముందు రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా, పాపకి ఇంతకుముందు ఇలా జరిగిందా అని అడుగుతాడు.

దీప వున్నాయి అని చెప్పటంతో తీసుకొని రమ్మని చెప్తాడు డాక్టర్. అవి తీసుకురావడానికి వెళ్తాడు కార్తీక్. టెస్టులు చేయించిన తర్వాత రూమ్ కి వచ్చిన శౌర్య కార్తీక్ కనిపించడం లేదు ఏమిటి మరి రాడా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు నువ్వు పడుకో అంటుంది దీప. అప్పుడే సుమిత్ర వచ్చి శౌర్య ని పలకరిస్తుంది. నువ్వు ఆడుకుంటేనే బాగుంటుంది, ఇలా మంచం మీద పడుకుంటే బాగోదు త్వరగా ఇంటికి వచ్చేయ్ అంటుంది. నేను ఆ ఇంటికి రాను, వస్తే మళ్లీ బూచాడు వచ్చి నన్ను తీసుకుపోతాడు అంటుంది శౌర్య.

అంతలోనే కార్తీక్ రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు. డాక్టర్ కూడా అప్పుడే వచ్చి పేషెంట్ కి రెస్ట్ నివ్వండి అని చెప్పటంతో సుమిత్ర వెళ్ళిపోతుంది. కార్తీక్ దీప ని కూడా వెళ్ళిపోమంటాడు. తర్వాత డాక్టర్ కార్తీక్ తో మాట్లాడుతూ మీరు తర్వాత నన్ను కలవండి మాట్లాడాలి అంటాడు. డాక్టర్ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు శౌర్య కి ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X