Karthika Deepam June 27th episode: దీప ని చూసి భయపడుతున్న పారిజాతం.. శౌర్య మాటలకి షాకైన జ్యోత్స్న!

రోడ్డుమీద మరొక స్త్రీ తో శ్రీధర్ ని చూసిన స్వప్నకి మొదటిసారి తండ్రి మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు నర్సింహ దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకిచ్చేయమని అడుగుతాడు. కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. అక్కడ శ్రీధర్ గురించి కాంచనతో చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. మరోవైపు ఫోన్ వస్తే కంగారుపడిన తండ్రి మీద మరింత అనుమానం పెంచుకుంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 27 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 82వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తను చేసిన కాగితం బొమ్మ ని తండ్రిగా భావించి దానితో మాట్లాడుతూ ఉంటుంది శౌర్య. నీ తండ్రి ఎలాంటివాడో, వాడు మనకు చేసిన ద్రోహం ఏమిటో తెలిస్తే అతనిని అసహ్యించుకుంటావు, తండ్రి ప్రేమ లేని నీకు నేనే తల్లిని తండ్రిని అని మనసులో అనుకొని కన్నీరు పెట్టుకుంటుంది దీప. మరోవైపు పారిజాతం జ్యోత్స్న తో మాట్లాడుతూ మీ బావ ఆ దీప ని ఏకంగా తన ఇంటికే రప్పించుకుంటున్నాడు. మీ అత్తకి ఒంట్లో బాగోలేదని మీ బావ నీకు చెప్పలేదు కానీ దీపకి చెప్పాడు.

Karthika Deepam 2 Serial 27th June 2024 Episode Number 82 Shaurya invites Karthik to the school function

నిన్ను సాయం చేయమని అడగలేదు కానీ ఆ దీపని అడిగాడు అని జ్యోత్స్న ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నీ మాటలకి నాకు పిచ్చి పట్టేలా ఉంది, అయినా అక్కడికి వెళ్లావు కదా ఏం చేశావు అని అడుగుతుంది జ్యోత్స్న. రుచికరమైన భోజనం చేశాను పెరుగే పెద్దగా బాలేదు అంటుంది పారిజాతం. ఇలాంటి టైంలో జోక్స్ వేయాలని ఎలా అనిపిస్తుంది అని పారిజాతంపై కోప్పడుతుంది జ్యోత్స్న.

మరేం చేయమంటావ్, ఇన్నాళ్లు ఆ దీప ని చూస్తే కోపం వచ్చేది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఎక్కడ నీ కన్నా ముందే ఆ ఇంటికి వెళ్లి పాలు పొంగించేస్తుందో అని అందుకే వెళ్లి ఆ దీపని నిలదీయు అంటుంది పారిజాతం. అక్కరలేదు అంటుంది జ్యోత్స్న. అలా అంటావేంటి అంటుంది పారిజాతం. కొన్ని ప్రశ్నలకు నోటితోనే కాదు గ్రానీ చేతలతో కూడా సమాధానం చెప్పవచ్చు, చూస్తూ ఉండు అంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial 27th June 2024 Episode Number 82 Shaurya invites Karthik to the school function

మరోవైపు కాంచన కార్తీక్ తో మాట్లాడుతూ మీ పెళ్లి విషయం మాట్లాడటానికి నిన్న తాతయ్య వాళ్ళు వచ్చారు అంటుంది. నువ్వేమన్నావు అంటాడు కార్తీక్. నిన్ను అడిగి చెప్తాను అన్నాను అసలు జ్యోత్స్న విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అంటుంది కాంచన. తన మనసులో మాట చెప్పాలనుకునే లోపు శౌర్య ఫోన్ చేసి స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అదే విషయం తల్లితో చెప్తాడు కార్తీక్.

నువ్వు వెళ్లడం అవసరమా అంటుంది కాంచన. చిన్న పిల్లని బాధ పెట్టడం ఎందుకు అంటాడు కార్తీక్. నిజమే అంటుంది కాంచన. నన్ను అర్థం చేసుకున్న దానివి నువ్వు మాత్రమే అమ్మ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్. నీ అభిప్రాయం ఏమిటో త్వరగా చెప్పు మాకు అసలే చాలా పనులు ఉంటాయి ఈ తరం గుర్తుంచుకునేలాగా మీ పెళ్లి చేయాలి అంటుంది కాంచన. మరోవైపు సుమిత్ర వాళ్ళ ఇంటికి దీపతో పాటు చాక్లెట్స్ తీసుకొని వస్తుంది శౌర్య.

Karthika Deepam 2 Serial 27th June 2024 Episode Number 82 Shaurya invites Karthik to the school function

ఏమిటి హడావుడి అంటాడు దశరథ్. ఈరోజు ఫాదర్స్ డే వెళ్లి ముద్దుల తాతకి చాక్లెట్స్ ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు అంటుంది శౌర్య. నువ్వు చెప్పే వరకు నాకు గుర్తులేదు అంటూ తండ్రికి చాక్లెట్ ఇచ్చి విషెస్ చెప్తాడు దశరధ్. జ్యోత్స్న చేతిలో చాక్లెట్ పెట్టి నువ్వు కూడా తాతయ్యకి ఫాదర్స్ డే చెప్పు అంటుంది. తప్పకుండా చెప్తాను నేను ఫాదర్స్ డే మర్చిపోయాను నువ్వు గుర్తు చేసే నన్ను సిగ్గుపడేలా చేశావు అని శౌర్యతో చెప్తుంది జ్యోత్స్న.

తర్వాత తండ్రికి ఫాదర్స్ డే విషెస్ చెప్తుంది. మరి నువ్వు మీ నాన్నకి ఫాదర్స్ డే విషెస్ చెప్పావా అని అడుగుతుంది పారిజాతం. ఆ మాటలకి చిన్న పోతుంది శౌర్య. పారిజాతాన్ని కోప్పడతాడు శివ నారాయణ. నేను అన్న దాంట్లో తప్పేముంది పాపం తండ్రి కోసం ఇంతగా తపన పడుతున్న దానికి తండ్రి కనిపించకపోవడం బాధగా ఉంది అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం.

పద మనకి స్కూల్ కి టైం అవుతుంది అని కూతుర్ని తొందర పెడుతుంది దీప. పారిజాతం మాటలకి అప్పటికే చిరాకు మీద ఉన్న శివ నారాయణ కూడా మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఫంక్షన్ కి ఇద్దరే హ్యాపీగా వెళ్లి రండి అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం.మేము ఇద్దరం కాదు ముగ్గురం అంటుంది శౌర్య.ఆ మాటలకి ఇంట్లో వాళ్ళతో పాటు దీప కూడా షాక్ అవుతుంది. కార్తీక్ ని ఫోన్ చేసి ఫంక్షన్ కి రమ్మన్నాను అంటుంది శౌర్య.

Karthika Deepam 2 Serial 27th June 2024 Episode Number 82 Shaurya invites Karthik to the school function

ఎందుకు రమ్మన్నావు అని కోప్పడుతుంది దీప. దీప వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత పారిజాతం దీపే పాప చేత ఫోన్ చేయించి ఉంటుంది అంటుంది.ఆ మాటలకి శివ నారాయణ కోప్పడతాడు, సుమిత్ర కూడా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న మాట్లాడుతూ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు జరగవలసిన దాని గురించి మాట్లాడుకోవాలి బావ ఫంక్షన్ కి వెళ్తాడంటావా అని పారిజాతంతో అంటుంది.

మరోవైపు కారులో వెళ్తున్న నర్సింహ దీప నా మాటల్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లుంది ఎలాగైనా నేనే పాప తండ్రిని అని చెప్పేయాలి అనుకుంటాడు. మరోవైపు ఫంక్షన్ లో ఫ్రంట్ రోలో కూర్చుంటారు దీప, శౌర్య. జ్యోత్స్న వాళ్ళ పక్కన కూర్చుంటూ ఇప్పుడు పాపకి గార్డియన్ ని నేను కాబట్టి నేను ఒక్కదాన్నే వచ్చాను ఇంకెవరూ రారు అని వెటకారంగా అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X