Karthika Deepam August 28th episode: తల్లితోనే చాలెంజ్ చేసిన నర్సింహ.. కార్తీక్ ని టెన్షన్ పెట్టిన అనసూయ!

యాక్సిడెంట్ జరిగింది దాసు కొడుక్కి అని తెలిసి షాక్ అవుతుంది పారిజాతం. స్వప్న ప్రేమ విషయం తెలుసుకుంటారు దీప, కార్తీక్. అస్తమానం కార్తీక్ కి ఫోన్ చేస్తున్న శౌర్యతో ఆయనని ఇబ్బంది పెట్టవద్దు అని మందలిస్తుంది దీప. ఫోన్ ఆపకపోవడంతో ఆ మాటలు విన్న కార్తీక్ శౌర్యని తన నుంచి దూరం చేయవద్దు అని దీపతో చెప్తాడు. కూలి పని చేసుకుంటూ తన కంటపడిన అనసూయని తన ఇంటికి వచ్చేలా ఒప్పిస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 28 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 134వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

టాబ్లెట్స్ కోసం వెళ్లిన అనసూయ షాపు వాడి ద్వారా పాపకి గుండె జబ్బు అని తెలుసుకుని బాధపడుతుంది. ఆ విషయం దీపకే తెలియదని కూడా గ్రహిస్తుంది అలా ఆలోచిస్తూ వస్తున్న అనసూయకి నర్సింహ ఎదురుపడతాడు. నీకోసం ఊరు వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇక్కడే కనబడ్డావు,చూస్తుంటే నువ్వు నీ కోడలు ఇంట్లోకే చేరినట్లు ఉన్నావు అంటాడు నర్సింహా అవును అయితే నీకేంటి బాధ అంటుంది అనసూయ.

Karthika Deepam Serial 2 Season August 28th 2024 Episode 135 Here is full details

సరేగాని ఊర్లో ఇల్లు ఉంది కదా దానిని అమ్మేసి ఆ శోభ మొఖాన కొట్టాలి నీకు రెండు లక్షలు ఇస్తాను అంటాడు నర్సింహ. అది నా తమ్ముడు ఇల్లు దీపకే చెందాలి అంటుంది అనసూయ. నువ్వు నీ కోడలు ఆ ఇంటిని చెరి సగం చేసుకోవాలనుకుంటున్నారేమో ఆ సగం నేనే ఇస్తాను పద ఇల్లు అమ్మేద్దాం అంటాడు నర్సింహ. అందుకు ఒప్పుకోదు అనసూయ. నువ్వు ఇలాగే చేస్తే ఎప్పుడో ఒకరోజు శౌర్య ని ఎత్తుకుపోతాను అంటాడు నర్సింహ. వెంటనే అతని చంప పగులుతుంది. షాక్ ఆవుతారు అనసూయ, నరసింహ.

చూసేసరికి అక్కడ కార్తీక్ ఉంటాడు, పాప జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిస్తాడు, మా గొడవల్లో నువ్వు దూరతావ్ ఏంటి అంటాడు నర్సింహ. వాళ్ళే నిన్ను వద్దనుకున్నారు ఇంకా మీ గొడవ అంటావేంటి అంటాడు కార్తీక్. ఇల్లు దీపకే చెందాలి అన్న అనసూయతో మీరు ఎవరి ఎండ చూసుకొని రెచ్చిపోతున్నారో నాకు అర్థమైంది, నువ్వు ఎలా ఇంటిని నీ కోడలికి అంట కడతావో నేను చూస్తాను అని తల్లితో చాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ.

తర్వాత అనసూయ దీప దగ్గరకి వచ్చిందని తెలుసుకొని ఆనందపడతాడు కార్తీక్. అప్పుడు శౌర్య ఆరోగ్యం గురించి అనసూయ కార్తీక్ ని అడుగుతుంది. కార్తీక్ జరిగినదంతా చెప్తాడు. ఈ విషయం దీపకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది అనసూయ. రండి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ అనసూయని తనతో పాటు తీసుకువెళ్తాడు కార్తీక్. మరోవైపు కాశి, స్వప్న ఓకే స్కూటీ మీద వెళుతూ ఉంటారు. స్కూటీ డ్రైవ్ చేస్తూ నన్ను డిశ్చార్జ్ చేయడానికి వచ్చినందుకు థాంక్స్ అంటాడు కాశి.

అది చెప్పవలసింది బయట వాళ్లకి, కాబోయే పెళ్ళానికి కాదు అంటుంది స్వప్న. వాళ్లు అలా మాట్లాడుకుంటూ వెళ్లటాన్ని అటుగా వస్తున్న శ్రీధర్ కార్ లోంచి చూస్తాడు. ముందు స్వప్న ఎవరికో లిఫ్ట్ ఇచ్చింది అనుకుంటాడు కానీ హార్ట్ ఇచ్చింది అని అర్థం చేసుకున్న శ్రీధర్ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు, నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అనసూయని ఇంటిదగ్గర డ్రాప్ చేసిన కార్తీక్ పాప ఆరోగ్యం విషయం దీపతో చెప్పొద్దు ఆమె బ్రతుకుతున్నదే శౌర్య కోసం అంటాడు.

తన మీద మీకు ఎందుకు అంత ఆపేక్ష, సొంత మేనత్తని, అత్తగారిని నేనే తనమీద అంత అపేక్ష చూపించలేదు అంటుంది అనసూయ. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు అంటాడు కార్తీక్. అది ఏ జన్మలో పుణ్యం చేసుకుంది అందుకే మీలాంటి వాళ్ళ అండ దొరికింది అంటుంది అనసూయ. దీప మా అత్త ప్రాణాలు కాపాడిన దాని ముందు ఇదేమి ఎక్కువ కాదు అంటాడు కార్తీక్. అలా అనుకోవడం మీ గొప్పతనం అంటుంది అనసూయ. పాప విషయం మాత్రం దీపకి చెప్పకండి అంటాడు కార్తీక్.

ఏ విషయం చెప్పకూడదు అంటుంది దీప.ఆమె ని అక్కడ చూసి షాక్ అవుతారు అనసూయ, కార్తీక్. ఇంకే విషయం చంటి దాని విషయమే అంటుంది అనసూయ. చెప్పొద్దు అని అంత గట్టిగా చెప్పినా కూడా శౌర్య ఆరోగ్యం గురించి చెప్తారేంటి, అసలు ఈవిడ మనిషేనా అనుకుంటాడు కార్తీక్. కంగారుపడుతూ అనసూయని మాట్లాడనివ్వడు. తను ఏదో చెప్పాలంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటుంది దీప. చంటి దానికి మందులు తీసుకువస్తుంటే నర్సింహ కనపడ్డాడు ఇల్లు తన పేరు మీద రాసేయమంటున్నాడు అని జరిగిందంతా చెప్తుంది శౌర్య.

పాప గురించి చెప్తారేమో అనుకొని ఎంత టెన్షన్ పడ్డాను అనుకుంటాడు కార్తీక్. నర్సింహ వ్యవహారం చూస్తుంటే గొడవ చేసేలాగా ఉన్నాడు ఎందుకైనా మంచిది రేపు ఊరు వెళ్లి ఆ ఇంటిని దీప పేరు మీద రిజిస్టర్ చేయించేయండి అని సలహా ఇస్తాడు కార్తీక్. దీప వద్దని వారిస్తున్నా బాబు చెప్పింది కరెక్టే, ఇల్లు ఉంటే రేపు నీ కూతురు చదువుకు పనికొస్తుంది అంటుంది అనసూయ. అప్పుడే వచ్చిన శౌర్య కార్తీక్ ని పలకరిస్తుంది కార్తీక్ టాబ్లెట్లు గురించి మాట్లాడితే వేసేసుకున్నాను అని అబద్ధం చెప్తుంది. శౌర్యని ముద్దుగా మందలిస్తాడు కార్తీక్.

రేపు వస్తావా అని అడుగుతుంది శౌర్య. రేపు రాఖీ పండగ కదా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉంటాము అని శౌర్య కి చెప్పి అక్కడినుంచి వచ్చేస్తాడు కార్తీక్. ఇదంతా పైనుంచి చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది, బావ ఏంటి ఇంతలా మారిపోయాడు అనుకుంటుంది. కార్తీక్ సుమిత్ర ఇంటికి వెళ్లబోతుంటే అప్పటికే అక్కడ ఉన్న సుమిత్ర అనసూయ కి మంచి సలహా ఇచ్చావు అని చెప్తుంది. కాసేపు మాట్లాడిన తర్వాత రేపు త్వరగానే వచ్చేయండి అంటుంది సుమిత్ర.

అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న బావకు రావాలని ఉంటుంది కానీ కొన్ని బంధాలు రానివ్వవు అంటుంది. అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు అంటుంది సుమిత్ర. బావకి అర్థమైంది అంటుంది జ్యోత్స్న. కార్తీక్ కి అర్థమయినా ఆఫీస్ పేరు చెప్పి రానేమో అని తన భయం అని బయటికి చెప్తాడు. బాగానే కవర్ చేసావు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇలాంటి సమయంలో గ్రానీ ఉంటే బాగుండేది ఏదో ఒక సలహా ఇచ్చేది, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనుకుంటుంది జ్యోత్స్న తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X