Karthika Deepam July 29th episode: సుమిత్రకు దీప క్షమాపణ.. శౌర్య ఆరోగ్యం గురించి కార్తీక్ ఆందోళన!
శౌర్య ని రేపే తీసుకువచ్చేద్దాం అని కొడుకుతో చెప్తుంది అనసూయ. నిశ్చితార్థానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. నిశ్చితార్థం రోజున కూతుర్ని తీసుకుపోవడానికి శివ నారాయణ ఇంటికి వస్తారు నర్సింహ, అనసూయ. అక్కడ నర్సింహ తన తండ్రి అని తెలుసుకున్న శౌర్య భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. నిశ్చితార్థం ఆగిపోయినందుకు జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 29వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 109వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్య కి ఏమి కాదని దీప కి ధైర్యం చెబుతుంది సుమిత్ర. మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని నాతో ఇలా మాట్లాడుతున్నారు కానీ నేను మీ మొహం చూడటానికి కూడా సిగ్గుపడుతున్నాను మీరు ఎంతో అభిమానంతో నిశ్చితార్థానికి రమ్మన్నారు కానీ నా వల్లే ఈ నిశ్చితార్థం ఆగిపోయింది అంటే చాలా బాధగా ఉంది జరిగిందానికి నన్ను క్షమించండి అంటుంది దీప.

ఈ నిశ్చితార్థం నీవల్ల ఆగిపోలేదని మీకు కూడా తెలుసు, జరిగినదాంట్లో నీ తప్పు ఏమీ లేదు,ఈరోజు కాకపోతే రేపు మరొక ముహూర్తం పెట్టించి నిశ్చితార్థం జరిపిస్తాము అంటుంది సుమిత్ర. మాటల్లో నర్సింహ వచ్చాడా అని అడుగుతుంది. రాలేదు అంటుంది దీప. వస్తాడు అంటుంది సుమిత్ర.
కంగారుపడుతుంది దీప. అంతమందిని ఉంటామని తెలిసికూడా పాపని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చాడు.
అంటే కచ్చితంగా ఇక్కడికి కూడా వస్తాడు అంటుంది సుమిత్ర. ఏం చేయమంటారమ్మ, బ్రతిమిలాడను, బెదిరించాను అయినా వినటం లేదు అంటుంది దీప. అయితే పాపని వాడికి ఇచ్చేయ్ అంటుంది సుమిత్ర. షాక్ అయిన దీప ఇవ్వలేను అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు విడాకులు ఇచ్చేసి నీ భర్త పీడ వదిలించుకో లేదంటే జీవితాంతం ఇలాగే భయంతో బ్రతకాల్సి వస్తుంది అంటుంది సుమిత్ర. విడాకులు ఇవ్వలేనమ్మ పాప ఆరోగ్యం కుదుటపడగానే దానిని తీసుకొని దూరంగా ఇక్కడినుంచి వెళ్ళిపోతాను అంటుంది దీప.

ఆ మాటలకి సుమిత్ర కోప్పడుతుంది పాప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే వచ్చి తీసుకు వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర . ఇప్పుడున్న పరిస్థితులలో కోర్టుల చుట్టూ ఎన్నాళ్ళని తిరగాలి అనుకుంటుంది దీప. కార్తీక్ బాబుతో డాక్టర్ ఏదో మాట్లాడాలన్నారు అసలు శౌర్య గురించి ఏం చెప్పారో అనుకుంటూ కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది. అదే సమయంలో కార్తీక్ తో మాట్లాడుతున్న డాక్టర్ పాప గుండె వీక్ గా ఉందని ఆమె భయపడే పనులు ఏవి చేయవద్దని చెప్తాడు డాక్టర్.
పాప నర్సింహ చూసి భయపడుతుంది, రౌడీని వాడికి దూరంగా ఉంచాలి అనుకుంటాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ హాస్పిటల్ కి వెళ్ళినందుకు నిశ్చితార్థం ఆగిపోయినందుకు కోపంతో రగిలిపోతూ నానా మాటలు అంటుంది పారిజాతం. ఆ మాటలకి భార్య మీద కోప్పడతాడు శివ నారాయణ. నిశ్చితార్థం ఆగిపోయినందుకు నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది అంటాడు. ఇప్పుడు పిన్నితో గొడవ అవసరమా నాన్న అంటుంది కాంచన. అంతలోనే సుమిత్ర రావటం చూసి శౌర్య ఆరోగ్య పరిస్థితి అడుగుతుంది. బాగానే ఉంది అని చెప్పింది సుమిత్ర.

కార్తీక్ ఏడి అని అడుగుతుంది పారిజాతం, హాస్పిటల్ లో ఉన్నాడు అంటుంది సుమిత్ర. కార్తీకే ఎందుకు ఉండాలి అంటుంది పారిజాతం. వాడు మంచివాడు కాబట్టి, శౌర్య అంటే ఇష్టం కాబట్టి అంటుంది సుమిత్ర. జ్యోత్స్న కి అంటే ఇంకా చిన్నతనం పోలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది మీరు కూడా అలా మాట్లాడతారు ఏమిటి అని అత్తగారిని కోప్పడి జ్యోత్స్న దగ్గరికి వెళుతుంది సుమిత్ర. మరోవైపు సుమిత్ర అన్నమాటలు ఆలోచిస్తూ ఉంటుంది దీప.
కార్తీక్ బాబు ఇంకా రాలేదు ఏంటి అనుకుంటూ బయటికి వెళుతుంది అక్కడ నర్సింహ ని చూసి కంగారుపడుతుంది దీప. వెంటనే పాప దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పటికే అక్కడ కార్తీక్ ఉంటాడు. నర్సింహ విషయం అతనికి చెప్తుంది దీప. కానీ కార్తీక్ అక్కడికి వెళ్ళేసరికి నర్సింహ అక్కడ ఉండడు. పాప దగ్గరికి వెళ్లిపోయాడు ఏమో అనుకొని కంగారుగా అక్కడికి వెళ్తారు కార్తీక్, దీప. అక్కడ నర్సింహ లేకపోవడం చూసి రిలాక్స్ అవుతారు.
నర్సింహ ఎట్టి పరిస్థితులలోనూ రౌడీ కంట పడకూడదు అంటాడు కార్తీక్, ఎందుకు అంటుంది దీప. శౌర్య ఆరోగ్య పరిస్థితి చెప్పాలనుకుని మళ్ళీ దీప తట్టుకోలేదని ఏమి చెప్పడు కార్తీక్. శౌర్య ఆరోగ్యం ఎలా ఉంది అని దీప అడిగితే బానే ఉంది అని చెప్తాడు. తన పరిస్థితి, తన కూతురు పరిస్థితి తలుచుకొని ఏడుస్తుంది దీప. తండ్రి గురించి శౌర్య తన మనసులో గుడి కట్టుకుంది ఇప్పుడు ఆ గుడి పునాదులతో సహా కూలిపోయింది.

తనకు తండ్రి ఎవరో తెలియకూడదని ఎన్నో అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నిజం తెలిసిన శౌర్య అమ్మ చెప్పినవన్నీ అబద్ధాలే అనుకుంటుంది అంటూ ఏడుస్తుంది దీప. అవన్నీ మర్చిపోండి ఇప్పుడు శౌర్య గురించి మాత్రమే ఆలోచించండి అంటాడు కార్తీక్. దీప శౌర్య దగ్గరికి వెళ్ళిన తరువాత నిజంగానే నర్సింహ వచ్చాడా లేదంటే దీప భ్రమ పడుతుందా, రానీ నన్ను దాటి శౌర్య ని ఎలా తీసుకువెళ్తాడో చూస్తాను అనుకుంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











