Karthika Deepam 2 June 29th episode: అడ్డంగా బుక్కైన కావేరి దంపతులు.. నడిరోడ్డుపై దీపకు నర్సింహ వార్నింగ్!
నర్సింహ దీప దగ్గరికి వెళ్లి కూతుర్ని తనకిచ్చేయమని అడుగుతాడు. కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. అక్కడ శ్రీధర్ గురించి కాంచనతో చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. ఫాదర్స్ డే రోజు ఇంటికి వచ్చిన శౌర్యని బాధ పెట్టి పంపిస్తుంది పారిజాతం. ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ ని రమ్మని చెప్తుంది శౌర్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 29 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 84వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీపని స్టేజ్ మీదే అభినందించి ఆమెని మొదట్లో తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమాపణ అడుగుతాడు ప్రిన్సిపల్. మరోవైపు శ్రీధర్ కావేరి మీద కోప్పడుతూ ఉంటాడు, స్వప్నకి నిజం తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా ఎందుకు అలా ఫోన్ చేయిస్తావు అంటాడు. ఏం నిజం అంటుంది స్వప్న. స్వప్నని అక్కడ చూసిన కావేరి దంపతులు షాక్ అవుతారు. అంతా వినేసిందేమో అనుకుంటారు. అప్పుడు స్వప్న నాకు తెలియకూడని ఆ నిజం ఏమిటి అని తండ్రిని నిలదీస్తుంది.

నీకు మంచి సంబంధం చూశాను,ఆ విషయమే మీ అమ్మతో మాట్లాడుతుంటే ముందు కోచింగ్ అవ్వనివ్వండి అప్పుడు పెళ్లి విషయం మాట్లాడుదాం అంటుంది అంటాడు శ్రీధర్. మనసులోనే తండ్రి ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతుంది స్వప్న. నేనే ఓవరాక్షన్ చేశాను క్షమించండి అని తండ్రిని అడుగుతుంది. పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. నేను ఇలా మాట్లాడటం తప్పు కదా మమ్మీ, నాన్న బాధపడి ఉంటారు కదా అంటుంది స్వప్న.

నిజం తెలిస్తే నువ్వు ఎంత బాధ పడతావో అనుకుంటుంది కావేరి. మరోవైపు రోడ్డుమీద వెళ్లిపోతున్న దీపని ఆపి పాప తండ్రి గురించి అంతలా చెప్తుంటే నువ్వు నా గురించి చెప్పేసావేమో అనుకున్నాను, స్టేజ్ మీదకి కూడా వద్దాం అనుకున్నాను కానీ అప్పుడే తెలిసింది నువ్వు దాన్ని ఎలా పెంచావో అంటూ తాను స్కూల్ ఫంక్షన్ కి వచ్చిన విషయం చెప్తాడు నర్సింహ. దానికి నువ్వే తండ్రివి అని తెలిస్తే నాన్న అనే పిలుపుని అసహ్యించుకుంటుంది అంటుంది దీప.
అయితే ఆ కార్తీక్ నే తండ్రి అని చెప్పు అంటాడు నర్సింహ. ఆ మాటలకి కోప్పడుతుంది దీప. నన్ను నన్ను గానే ఉండనీ, ఇలా ఎక్కడపడితే అక్కడ గొడవలకి దిగేలాగా చెయ్యొద్దు అంటుంది దీప. కిరాయి మానుకొని నీ చుట్టూ తిరగడం నాక్కూడా ఇబ్బందిగానే ఉంది అందుకే నా కూతుర్ని నాకు ఇచ్చేయ్ అంటాడు నర్సింహ. నాకు మిగిలిన ఒకే ఒక బంధం అది అంటుంది దీప. అయితే అది నాకు పుట్టలేదు అని చెప్పు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను.

కానీ ఏదో ఒక విషయం తొందరగా చెప్పు ఎందుకంటే నన్ను ఇంట్లో బ్రతకనివ్వడం లేదు. పాప జాగ్రత్త, ఎందుకంటే బూచాడొచ్చి ఎత్తుకొని పోగలడు,బూచాడు మంచోడు కాదు అని దీపని హెచ్చరించి వెళ్లిపోతాడు నర్సింహ. ఏం చేయాలో అర్థం కాని దీప కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు పెళ్లి విషయంపై క్లారిటీ ఇమ్మని అడుగుతాడు శ్రీధర్. అత్తయ్య వాళ్ళు బానే ఉన్నారు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటాడు కార్తీక్.
నీ మీద పడుతున్న నిందలు ఎక్కడ నిజమవుతాయో అని మాట్లాడుతూ మధ్యలోనే ఆపేస్తాడు శ్రీధర్. ఆ మాటలకి షాక్ అయిన కార్తీక్ ఈరోజు నా పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తాను కానీ ఇక్కడ కాదు, మీకు ట్రీట్ ఇస్తాను మనం రెస్టారెంట్ లో మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. రెస్టారెంట్లో మాట్లాడుకున్నప్పుడు కార్తీక్ ని వచ్చే ముహూర్తానికి పెళ్లికి కూడాఒప్పించేయండి అని భర్తతో చెప్తుంది కాంచన. సరే అంటాడు శ్రీధర్. మరోవైపు మూడిగా కూర్చుంటుంది శౌర్య.
ఎందుకు అలా ఉన్నావు అంటుంది దీప. శౌర్య పాప అలిగింది అంటుంది శౌర్య. నన్ను చిన్న పిల్లని చేసి అందరూ ఏడిపిస్తున్నారు అంటుంది. నువ్వు కార్తీక్ బాబు గురించి మాట్లాడుకున్నామని నాకు అర్థమైంది అనుకుంటుంది దీప. రేపు స్కూల్ కి వెళ్ళను అంటుంది శౌర్య. అప్పుడే నర్సింహ మాటలు గుర్తొచ్చి ఒక వారం రోజులు పాటు స్కూల్ కి వెళ్లొద్దు, చెప్పకుండా అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్లొద్దు అంటుంది దీప.
ఎందుకు స్కూల్ కి వెళ్లొద్దు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్. కార్తీక్ బాబుకి నిజం తెలియకూడదు తెలిస్తే పోలీస్ కేసు అదీ అంటారు అనుకున్న దీప మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను అంటుంది. మనకంటూ ఏమి మిగలని చోటికి మనిషి వెళ్ళినా ఉపయోగం ఉండదు అంటాడు కార్తీక్. తర్వాత శౌర్యతో మాట్లాడబోతే అలిగి పక్కకి వెళ్ళిపోతుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











