Karthika Deepam July 2nd episode: భయంతో వణికి పోతున్న శ్రీధర్.. నిజం చెప్పమంటూ దీపని నిలదీసిన కార్తీక్!

శ్రీధర్ గురించి కాంచనతో చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. ఫాదర్స్ డే రోజు ఇంటికి వచ్చిన శౌర్యని బాధ పెట్టి పంపిస్తుంది పారిజాతం. ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ ని రమ్మని చెప్తుంది శౌర్య. అయితే ఫంక్షన్ కి వచ్చిన కార్తీక్ కి అక్కడ నర్సింహ కనిపించడంతో గొడవలవుతాయని దీపకి కనిపించడు. తర్వాత తన పెళ్లి విషయం మాట్లాడేటందుకు తను పేరెంట్స్ తో పాటు జ్యోత్స్న ని, దీప, శౌర్య లను కూడా రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 2వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 86వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

స్వప్న వాళ్ళు రావడం గమనించిన దీప శ్రీధర్ ని హెచ్చరిస్తుంది. శ్రీధర్ సప్న వాళ్ళని చూసి టెన్షన్ పడతాడు. ఈరోజు ఎలా అయినా నిజం తెలిసిపోతుంది అనుకుంటుంది దీప. కాంచన మాట్లాడుతూ పెళ్లి విషయం మాట్లాడుతున్నాను కదా అదేదో మాట్లాడు అంటుంది. కార్తీక్ టాపిక్ మొదలు పెట్టే లోపు నేను ఇప్పుడే వస్తాను అంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్.

Karthika Deepam 2 Serial 2nd July 2024 Episode Number 86 Here is full story

కార్తీక్ పెళ్లి గురించి మాట్లాడబోతూ ఉంటే మీ నాన్నగారు లేకుండా ఏమిటి వచ్చాక మాట్లాడుదువులే అంటుంది. అంతలోనే స్వప్న వాళ్ళు రావడం పరిచయాలు చేసుకోవడం అన్ని అయిపోతాయి. బయట వాళ్ళ లాగా ఒకరిని ఒకళ్ళు పరిచయాలు చేసుకుంటున్నారు వాళ్లు నాలాగా మోసపోయిన ఇద్దరు ఆడవాళ్లు అనుకుంటుంది దీప. దీప చేయి కడుక్కుని వస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది వాష్ బేసిన్ అటు ఉంటే దీప ఏమిటి ఇటు వెళ్తుంది ఏదో జరుగుతుంది అనుకుంటుంది జ్యోత్స.

బయటికి వచ్చిన దీప శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది. దీపని చూసిన శ్రీధర్ నీకు ఎలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు నువ్వు జాగ్రత్త చెప్పకపోతే ఈరోజు అందరికీ దొరికిపోయేవాడిని అంటాడు. నేను మీ గురించి ఆలోచించలేదు, కాంచన గురించి ఆలోచించాను ఆవిడకి నిజం తెలిస్తే బ్రతకదు, ఆవిడ నమ్మకాన్ని ఎలాగో నిలబెట్టాలేకపోయారు కనీసం ఆవిడ ప్రాణాన్ని అయినా నిలబెట్టండి.

Karthika Deepam 2 Serial 2nd July 2024 Episode Number 86 Here is full story

నిజం చెప్పటానికి ఇది సరైన సమయం కాదు కానీ ఎప్పటికైనా నిజం చెప్పి తీరాలి అని శ్రీధర్ తో మాట్లాడుతూ ఉంటుంది దీప. అప్పుడే జ్యోత్స్న బయటికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఏదో జరుగుతుంది అని అనుమాన పడుతుంది. ఇంతలో కాంచన మీ నాన్నగారు ఇంకా రాలేదు ఏంటి పాపం స్వప్న వాళ్ళకి ఏ పరిచయం చేయాలనుకున్నాం కదా అంటుంది. వస్తారులే అమ్మ అంటాడు కార్తీక్. జ్యోత్స్న వచ్చి వాళ్లతో జాయిన్ అవుతుంది. తర్వాత దీప కూడా పచ్చి భోజనానికి కూర్చుంటుంది.

సార్ ఎవరితోనో మాట్లాడుతున్నారు అని చెప్తుంది. ఎంత అబద్ధం చెప్తున్నావు దీప అనుకుంటుంది జ్యోత్స్న. కావేరి లేచి మేము ఇంక బయలుదేరుతాము మీ నాన్నగారిని మళ్ళీ కలుస్తాము అంటుంది కావేరి. కాసేపు ఉండండి నాన్నగారు వచ్చేస్తారు అంటాడు కార్తీక్. వాళ్లకి పని ఉంటుందేమో బాబు వెళ్ళనివ్వండి అంటుంది దీప. ఆ మాటలకి కోపం తెచ్చుకుంటుంది కావేరి. మేమేమీ ఇక్కడికి ఉండిపోవాలని రాలేదు అంటూ స్వప్న తీసుకుని సీరియస్ గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

అలా ఎందుకు మాట్లాడావు అని దీపని కోప్పడుతుంది కాంచన. దీపకి మా పెళ్ళి జరగడం ఇష్టం లేదు అందుకే మావయ్యని ఇక్కడ కూర్చునివ్వలేదు, బావని అసలు ఆ టాపిక్ మాట్లాడనివ్వడం లేదు అని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు. నాన్నగారు వచ్చేసారు కదా ఇప్పుడు పెళ్లి విషయం మాట్లాడు అంటుంది కాంచన ఇప్పుడు వీళ్లు ఉన్న మూడ్ లో మాట్లడలేను అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 2nd July 2024 Episode Number 86 Here is full story

ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాము అని శౌర్య కి ఐస్ క్రీమ్ తినిపించడం కోసం తీసుకొని వెళ్ళిపోతాడు. భోజనం చేసిన దీప బయటికి వస్తుంది ఆమెతో కార్తీక్ మాట్లాడుతూ ఇప్పుడు నిజం చెప్పండి అని అడుగుతాడు. దేని గురించి అని అడుగుతుంది దీప. చేతులు కడుక్కుంటానని బయటకు వచ్చిన మీరు చెయ్యి కడుక్కోకుండానే లోపలికి వచ్చారు ఏం జరిగింది అని నిలదీస్తాడు.

కార్తీక్ బాబుకి నిజం చెప్పాలి, ఆయన అయినా తల్లి ప్రాణాలని కాపాడుకుంటారు అనుకొని నిజం చెప్పాలనుకుంటుంది. అంతలోనే శౌర్య రావటంతో ఏమీ లేదు బాబు అని చెప్పి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది దీప. దీప ఏదో చెప్పాలనుకుంటుంది దేని గురించో భయపడుతుంది అది తన గురించా నా గురించా అని ఆలోచనలో పడతాడు కార్తీక్. నెక్స్ట్ సీన్ లో జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. దీపకి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు అంటుంది జ్యోత్స్న.

నువ్వు తనని ఈ ఇంట్లోకి తీసుకు వచ్చినప్పటి నుంచి ఇదేదో తేడా గానే ఉంది జాగ్రత్త పడాలి అని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే వినిపించుకోలేదు అంటుంది పారిజాతం. అప్పుడంతా ఒక లెక్క బావ శౌర్య కోసమే దీపకి దగ్గరవుతున్నాడు అనుకున్నాను కానీ ఈరోజు రెస్టారెంట్లో దీప ప్రవర్తన చూస్తే నాకు కొత్త దీప కనిపించింది. ఆమె ప్రవర్తన చూస్తే బావ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనిపించింది అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X