Karthika Deepam August 30th episode: కాశీని అవమానించిన జ్యోత్స్న.. కూతురికి సూపర్ షాక్ ఇచ్చిన శ్రీధర్!
కూలి పని చేసుకుంటూ తన కంటపడిన అనసూయని తన ఇంటికి వచ్చేలా ఒప్పిస్తుంది దీప. శౌర్య గుండెజబ్బు గురించి మందుల షాపు వాడి ద్వారా తెలుసుకున్న అనసూయ బాధపడుతుంది. దారిలో కనిపించిన నర్సింహ ఇల్లు తన పేరు మీద రాయమని తల్లి తో గొడవ పడతాడు. కార్తీక్ అతని చెంప పగలగొట్టి అనసూయని అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తాడు. దాసు పారిజాతం కొడుకని తెలిసి షాక్ అవుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 30 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 136వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రాఖీ కట్టటానికి అన్ని సిద్ధం చేస్తారు సుమిత్ర, పారిజాతం. హడావిడి పడుతున్న పారిజాతాన్ని చూసి మనవడు వస్తున్నాడు అని పిన్ని తెగ హడావిడి పడిపోతుంది అంటాడు దశరధ్. అప్పుడే దాసు, కాశీ వస్తారు. వాళ్లని పలకరించి ఆనందంగా లోపలికి తీసుకువస్తుంది పారిజాతం. కాశీకి ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది. కాశీ ని చూస్తూ వీడికి రాఖీ కట్టవలసి వస్తుంది అంటేనే తెలుస్తుంది నాకు ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో బావ కోసం తప్పడం లేదు అనుకుంటుంది జ్యోత్స్న.

అప్పుడే కార్తీక్, కాంచన వస్తారు. అన్నయ్య రాలేదేంటి అంటుంది సుమిత్ర. ఆఫీసులో పని ఉంది అని కాంచన చెప్పటంతో సొంత చెల్లెలిని కాదు కాబట్టే కదా అంత అశ్రద్ధ అంటుంది సుమిత్ర. అలాంటిదేమీ లేదత్త అంటాడు కార్తీక్. తర్వాత దాసు వాళ్ళని చూసి మీరేమిటి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు కాంచన దాసుని పలకరించి వాళ్లని కార్తీక్ కి పరిచయం చేస్తుంది.
హాస్పిటల్లోనే నాకెందుకు చెప్పలేదు పారు అంటాడు కార్తీక్. అప్పటికే నువ్వు జ్యోత్స్న మీద కోపంగా ఉన్నావు అందుకే చెప్పలేదు అంటుంది పారిజాతం. అప్పుడు కాశి, స్వప్న ల పెళ్లి గురించి తలుచుకుని తన తల్లికి ఎక్కడ నిజం తెలుసుకోవతుందో అని బాధపడతాడు కార్తీక్. అంతలోనే అక్కడికి శివ నారాయణ వస్తాడు, కాశీకి తాత గారిని పరిచయం చేసి ఆశీర్వచనం తీసుకోమంటాడు దాసు.
అలాంటివేమీ అక్కర్లేదు త్వరగా రాఖీ కట్టించుకుని బయలుదేరితే మంచిది అని చిరాగ్గా మాట్లాడుతాడు శివ నారాయణ. ఆ మాటలుకి భర్తని మనసులోనేతిట్టుకుంటుంది పారిజాతం. తర్వాత కాశి కి రాఖీ కట్టి ప్రయత్నంలో అతని చేతికి మరొక రాఖి ఉండటం చూసి ఎవరు కట్టారు అని అడుగుతుంది. దీపక్క కట్టింది అని చెప్తాడు కాశీ. ముందు నా చేత కట్టించుకోవాలి కదా, అయినా నేను రాఖీ కట్టాలంటే ముందు నువ్వు ఆ రాఖీ విప్పై అంటుంది జ్యోత్స్న.
అలా చేయకూడదు అని సుమిత్ర, పారిజాతం వాళ్లు మందలించడంతో తప్పక కాశీకి రాఖీ కడుతుంది జ్యోత్స్న. తర్వాత దశరద్ కి రాఖీ కడుతుంది కాంచన. అదే సమయంలో కాశీ జ్యోత్స్న కి 500 బహుమానంగా ఇవ్వబోతే నాకు గిఫ్ట్ ఇచ్చే అంత రేంజ్ నీకు లేదు వెళ్లి ఆ దీపకే ఇవ్వు అని అవమానకరంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతున్న దాసుకి రాఖీ కట్టడానికి పిలుస్తుంది కాంచన. దాసు భయంగా శివ నారాయణ వైపు చూస్తాడు.
శివ నారాయణ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో నాన్న ఒప్పుకున్నట్లే అని దాసు ని ఒప్పించి అతనికి రాఖీ కడుతుంది కాంచన. చెల్లెలి చేత రాఖీ కట్టించుకుంటూ ఇక్కడ అందరూ మంచివాళ్లే నా కూతురుకే ఆ మంచితనం రాలేదు అనుకుంటాడు దాసు. మరోవైపు కార్తీక్ బాబుకి ఇప్పటికే నిజం తెలిసిపోయి ఉంటుంది అనుకుంటుంది దీప. అప్పుడే అనసూయ ఆమె చేతిలో పేపర్లు పెట్టి ఇల్లు నీ పేరు మీద రాసేశాను అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెడుతుంది.
డబ్బు ఎక్కడిది అంటుంది దీప. అప్పులు తీర్చాలి అని నీ దగ్గర డబ్బులు లాక్కునేదాన్ని కదా ఆ డబ్బులే ఇవి, నేను ఏ అప్పులు తీర్చలేదు నా అవసరాలు తీర్చుకోగా మిగిలిన డబ్బుని జమ చేశాను తీసుకో అంటుంది. నీ దగ్గరే ఉంచు అంటుంది దీప. ఇప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు నీ కూతురు ఆరోగ్యం అసలే బాగోలేదు ఈ డబ్బులు ఉంచు అంటుంది అనసూయ. నా కూతురు ఆరోగ్యానికి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది దీప.
నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అనుకొని ఆమె కి నిజం చెప్పకుండా మన ఇద్దరి బ్రతుకులాగా దాని బ్రతుకు ఉండకూడదు దాని భవిష్యత్తు మీద దృష్టి పెట్టు అని చెప్తుంది అనసూయ. నువ్వు నా కూతురు గురించి ఆలోచిస్తున్నావు నేను కార్తీక్ బాబుకి వచ్చే సమస్య గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటుంది దీప. మరోవైపు ఫంక్షన్ కి వెళ్ళాలి అని చెప్పి గ్రాండ్ గా కూతుర్ని రెడీ చేస్తుంది కావేరి . ఫంక్షన్ ఎవరిది అని అడుగుతుంది స్వప్న.
ముందు రెడీ అవ్వు చెప్తాను అంటుంది కాంచన. ఇంతలో శ్రీధర్ ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు, శ్రీధర్ వాళ్లని డిసైడ్ చేసుకొని తర్వాత రెడీ అయ్యారా అని కావేరి వాళ్ళ దగ్గరికి వస్తాడు. కావేరి రెడీ అని చెప్తుంది. కూతుర్ని తీసుకుని కిందికి వచ్చి పెళ్ళికొడుకుని పరిచయం చేసి అతని వివరాలు చెప్తాడు శ్రీధర్. అతని పర్సనల్ విషయాలు నాకెందుకు అంటుంది స్వప్న. నీ కాబోయే భర్త గురించి నీకు తెలియాలి కదా అంటాడు శ్రీధర్. ఆ మాటలకి షాక్ అవుతుంది స్వప్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











