Karthika Deepam August 31st episode: సుమిత్రపై దాసు ఫైర్.. కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న స్వప్న!
శౌర్య గుండెజబ్బు గురించి మందుల షాపు వాడి ద్వారా తెలుసుకున్న అనసూయ బాధపడుతుంది. దారిలో కనిపించిన నర్సింహ ఇల్లు తన పేరు మీద రాయమని తల్లి తో గొడవ పడతాడు. కార్తీక్ అతని చెంప పగలగొట్టి అనసూయని అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తాడు. దాసు పారిజాతం కొడుకని తెలిసి షాక్ అవుతుంది దీప. తర్వాత దాసు పారిజాతం కొడుకుని తెలిసినా కార్తీక్ కూడా షాక్ అవుతాడు. రాఖీ కట్టిన జ్యోత్స్నకి కాశి డబ్బులు ఇవ్వబోతే అతడిని అవమానించేలాగా మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 31 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 137వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
అతని పేరు శ్రీకాంత్, అతను మా ఆఫీసులోనే పనిచేస్తాడు అంతేకాదు ఇల్లరికం కూడా వస్తాడు అని అతని డీటెయిల్స్ అన్ని చెప్తాడు శ్రీధర్. తన ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసిందని గ్రహిస్తుంది స్వప్న, తల్లి తనని చీట్ చేసినందుకు ఆమెని కోపంగా చూస్తుంది. తర్వాత నేను అతనితో మాట్లాడాలి అని తండ్రితో చెప్పడంతో పర్మిషన్ ఇస్తాడు శ్రీధర్. బయటికి వెళ్ళిన తర్వాత తన ప్రేమ విషయం శ్రీకాంత్ కి చెప్తుంది స్వప్న.

అప్పుడు శ్రీకాంత్ మాట్లాడుతూ నువ్వు అతడిని ప్రేమిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, శ్రీధర్ సార్ నాకు అన్ని చెప్పారు, పదా లోపల మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శ్రీకాంత్. అతని మాటలకి షాక్ అవుతుంది స్వప్న, వెంటనే ఈ విషయం కాశీకి చెప్పాలి అనుకొని అతనికి ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మరింత కంగారు పడుతుంది. మరోవైపు స్వప్న ప్రేమ వ్యవహారం, కాశి తన బంధువు అవటం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.

అంతలో అక్కడికి వచ్చిన శౌర్య తో ఆమె టాబ్లెట్ల గురించి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి కాశీ వస్తాడు. నీ పేరు మీద ఏదో ఊరు ఉంది, నా పుస్తకంలో అంటుంది శౌర్య. నా పేరు మీద పుణ్యక్షేత్రం ఉంది అంటాడు కాశీ. నిన్ను ఏమని పిలవాలి అంటుంది శౌర్య. మీ అమ్మ నాకు రాఖీ కట్టింది కాబట్టి మామయ్య అని పిలు అంటాడు కాశీ. భలే బాగుంది ఇప్పుడే ఈ విషయం ముద్దుల తాతకి చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాశీ చెప్పొద్దు అని చెప్పిన మాట ఆమె వినిపించుకోదు.
తర్వాత మీరు నాకు బావ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మిమ్మల్ని అలా పిలవడం మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అని కార్తీక్ ని అడుగుతాడు కాశి. నేనెవరో తెలియకపోయినా హాస్పిటల్ బిల్లు కట్టారు నిజంగా మీరు గ్రేట్. మీరు అన్నయ్య లాంటి వారు అని తన పెళ్లికి సపోర్ట్ చేస్తారని స్వప్న చెప్తూ ఉండేది ఇప్పుడు అటువైపు నుంచే కాదు ఇటువైపు నుంచి కూడా మీరే సపోర్ట్ చేయాలి అంటాడు కాశీ. అంటే ఈ విషయం ఇంట్లో చెప్పలేదా అంటాడు కార్తీక్. లేదు అంటాడు కాశీ.

నాలుగు వైపుల నుంచి 4 కత్తులు విసిరినట్లుగా ఉంది అని టెన్షన్ ఫీలైన కార్తీక్ మనం ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా బావ ఉన్నాడు ఇంక పెళ్లి జరిగిపోయినట్లే అని ధైర్యంగా ఫీల్ అవుతాడు కాశీ. మరోవైపు తనకోసం కాఫీ తీసుకువచ్చిన సుమిత్రతో నువ్వు ఎంత మంచి దానివి వదిన, కానీ నీ పెంపకం అంతగా బాగోలేదు రేపు కాంచన ఇంటికి కోడలుగా వెళితే అక్కడ కూడా ఇలా ఉంటే కుదరదు కదా అప్పుడు చెడ్డ పేరు నీకే అంటాడు దాసు.
తర్వాత నా మాటలు నిన్ను బాధ పెట్టినట్లు ఉన్నాయి అని సుమిత్రతో అంటాడు దాసు. నీ మనసుకు అనిపించింది చెప్పావు అందులో తప్పేముంది అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఈ మాటలు అన్ని చాటుగా వింటుంది పారిజాతం, వీడికి ఎందుకు ఇవన్నీ నోరు అదుపులో ఉంచుకోవచ్చు కదా అని కొడుకుని తిట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎవరూ చూడలేదు కదా అని తిరిగి చూసేసరికి అక్కడ శౌర్య ఉండటం గమనిస్తుంది.

శౌర్య పారిజాతం వైపు చూస్తూ చాటుగా ఎవరైనా మాట్లాడుకుంటే వినకూడదు కదా నువ్వెందుకు విన్నావు, వుండు నీ పని ముద్దుల తాతతో చెప్తాను అంటుంది శౌర్య. వద్దు అంటూ శౌర్య ని బ్రతిమాలుతుంది పారిజాతం. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ ఎందుకు తనని అంతలా బ్రతిమాలుతున్నావు, అసలు నువ్వు ఏం చేశావు అంటూ శౌర్య ద్వారా జరిగింది తెలుసుకొని పారిజాతానికి మరిన్ని చివాట్లు పెడతాడు శివ నారాయణ.

మరోవైపు కార్తీక్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తనకి పెళ్లి చేస్తానని మాట ఇమ్మని లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది స్వప్న. నీ ప్రాణాలు నువ్వు కాపాడుకో నీ పెళ్లి సంగతి నేను ఆలోచిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య అమ్మతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అనటంతో ఫోన్ డయల్ చేసేస్తాడు కార్తీక్. కానీ దీప లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ ఫోన్ కార్తీక్ కి ఇచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉంటుంది శౌర్య .

నాకు చికాగ్గా ఉంది కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న శౌర్య కి జ్యోత్స్న ఎదురుపడుతుంది. ఆమెని అడ్డుకొని కార్తీక్ కి ఒంటరితనం కావాలంట అని ఆమెని అడ్డుకుంటుంది. నా ఇంట్లో నన్ను అడ్డుకుంటావా అని ఆమెపై కోప్పడుతుంది జ్యోత్స్న. కార్తీక్ చిన్న పిల్లతో నీకేంటి అని జ్యోత్స్న ని కోప్పడి శౌర్య ని అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత కార్తీక్ తో తన గురించి పట్టించుకోవటం లేదని తనతో కాసేపు కూడా టైం స్పెండ్ చేయలేదని అంటుంది జ్యోత్స్న .
నాకు చికాకుగా ఉంది కాసేపు వదిలేయ్ అన్నా వినకుండా మాట్లాడుతున్న జ్యోత్స్న దగ్గరనుంచి వెళ్ళిపోతున్న కార్తీక్ తో అదే దీప అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది. అప్పుడే దీప ఫోన్ ఫోన్ చేయటంతో మాట్లాడుతాడు కార్తీక్. నాతో మాట్లాడటానికి చిరాకు గాని తనతో మాట్లాడటానికి మాత్రం ఏ చిరాకు ఉండదు అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. తర్వాత ఫోన్ తాను చేయలేదని శౌర్య చేసిందని చెప్తాడు కార్తీక్. పని పూర్తయిందని తెలుసుకున్న కార్తీక్ త్వరగా వచ్చేయండి మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు.
నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది దీప. ఏంటది అని అడుగుతాడు కార్తీక్ ఫోన్లో కాదు వచ్చాక చెప్తాను అంటుంది దీప. సరే అని ఫోన్ పెట్టేసిన కార్తీక్ దగ్గరికి వచ్చిన శౌర్య అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. అవును పని అయిపోయిందట వచ్చేస్తున్నారంట అని చెప్పిన కార్తీక్ పదా బయటికి వెళ్దాం రిలాక్స్డ్ గా ఉంటుంది అంటూ శౌర్య ని తీసుకొని బయటికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











