Karthika Deepam August 1st episode: దశరథ్ మాటలకు పారిజాతం షాక్.. సుమిత్ర దంపతుల కాళ్లు పట్టుకొన్న దీప!

నిశ్చితార్థం ఆగిపోయినందుకు జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఇంట్లో గొడవ గొడవ చేస్తుంది. మరోవైపు శౌర్య ఆరోగ్యం ప్రమాదంగా ఉందని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు డాక్టర్ ఆ విషయం దీపక్ చెప్పడు కార్తీక్. హాస్పిటల్ కి వచ్చి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ గొడవ చేస్తారు. దాంతో దీప ఇంటికి రాకుండా వేరే ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటుంది. విషయం సుమిత్ర కి చెప్పే హాస్పిటల్ కి రమ్మంటాడు కార్తీక్. దీప ని ఒప్పించి ఇంటికి తీసుకు వస్తుంది సుమిత్ర. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 1వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 112వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నిశ్చితార్థం మళ్ళీ జరుగుతుంది, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అంటుంది దీప. నా బాధ్యత కూడా మా మమ్మీ నీకు అప్పగించిందా అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. కూతురు మీద కోప్పడుతుంది సుమిత్ర. నిన్ను ఏమైనా అంటే మా మమ్మీ కి కోపం వస్తుంది ఈ ఇంట్లోంచి నేనైనా బయటికి పోతానేమో కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు, నువ్వు మా బావనే కాదు మా అమ్మని కూడా నాకు దూరం చేసేలా ఉన్నావు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానమ్మ అంటుంది దీప.

Karthika Deepam 2 Serial 31st June 2024 Episode Number 111 Here is full story

అదేమీ కాదు తను ఎందుకు అలా మాట్లాడుతుందో మనకు తెలిసిందే కదా, పైగా నిశ్చితార్థం ఆగిపోయిన బాధలో ఉంది తర్వాత తనే తెలుసుకుంటుంది నువ్వు ఇప్పుడు నీ కూతురు గురించి ఆలోచించు అని దీప కి సర్ది చెప్పి పంపిస్తుంది సుమిత్ర. మరోవైపు ఇంటికి లేటుగా వచ్చిన కొడుకు మీద కోప్పడతాడు శ్రీధర్. పాప ఎలా ఉంది అని అడగకుండా నేనేదో పాపం చేసినట్లు అలా మాట్లాడతావ్ ఏంటి అంటాడు కార్తీక్. నిశ్చితార్థం ఆగిపోయినందుకు మీ అమ్మ తల పట్టుకొని పడిపోయింది నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటాడు శ్రీధర్.

కార్తీక్ కంగారు పడతాడు, ఇప్పుడు బానే ఉంది అని చెప్తాడు శ్రీధర్ మీ ఇద్దరూ గొడవ పడకండి ఇప్పుడు నాకు బానే ఉంది కదా అంటుంది కాంచన. పాపని వీడే ఎందుకు తీసుకువెళ్లాలి వేరెవరికైనా అప్పగించవచ్చు కదా అంటాడు శ్రీధర్, అక్కడ అంత గొడవ జరుగుతుంటే ఆపడానికి ఎవరైనా ముందుకు వచ్చారా అంటాడు కార్తీక్. అదంతా కాదు మీరు నన్ను ఏదో అడగబోయి ఇంకేదో మాట్లాడుతున్నారు అసలు మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అది చెప్పండి అంటాడు కార్తిక్.

నీ మీద నమ్మకం లేకపోవడం ఏమిటి అంటుంది కాంచన. నమ్మకం ఉంటే ఇలా కళ్ళు తిరిగి పడిపోవు అత్త లాగా హాస్పిటల్ కి వచ్చే దానివి. ఒకటి గుర్తుంచుకో మీరు తలదించుకునే పని ఎప్పటికీ మీ కొడుకు చేయడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు నర్సింహ అనసూయతో మాట్లాడుతూ నా కూతుర్ని నాకు అప్పగించమని కోర్టులో కేసు వేయబోతున్నాను అని చెప్తాడు. అలా చేయకు దాని వెనుక డబ్బున్న వాళ్ళు ఉన్నారు అంతే కాకుండా కోర్టులు,కేసులు అంటే చాలా ఖర్చవుతుంది అంటుంది అనసూయ.

ఖర్చయినా పర్వాలేదు మా అమ్మని అడిగి కావాల్సిన డబ్బు తీసుకొస్తాను కానీ దాని బిడ్డని తెచ్చుకొని దాని పొగరు అణిస్తేనే నా కోపం తీరుతుంది అంటుంది శోభ. ఆ మాట మీదే వుండు అని భార్యతో చెప్పి బయటికి వెళ్లి వెళ్ళిపోతాడు నర్సింహ. డబ్బున్నోళ్లతోనే పదవి ఉన్న వాళ్ళతోనే పెట్టుకోకూడదు నువ్వు నీ తొందరపాటుతో మళ్ళీ ఏదో అనర్థం తీసుకువచ్చేలా ఉన్నావు అని కోడల్ని కోప్పడుతుంది అనసూయ. లాయర్ దగ్గరికి వెళ్లిన నర్సింహ దీపకి బిడ్డ కావాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చేలా చేస్తాడు.

అవి అందుకున్న దీప కోర్టు నోటీసులని తెలిసి వాటిలో ఏముందో అర్థం కాక సుమిత్ర గారిని అడుగుదాం అనుకుంటుంది. అదే సమయంలో సుమిత్ర భర్తతో మాట్లాడుతూ అత్తయ్య కొద్ది రోజులు ఇంట్లో లేకపోతేనే జ్యోత్స్న మన మాట వింటుంది ఆ మాట అత్తయ్యతో నేను చెప్పలేను అంటుంది. నేనే చెప్తాను పదా అంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు దశరథ్. వెనకే సుమిత్ర కూడా వస్తుంది. అప్పటికే పారిజాతం జ్యోత్స్న ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

నువ్వు దాని బాధని పోగొట్టవలసింది పోయి మరింత రెచ్చగొడుతున్నావా అసలు దానికి ఏం సమస్య ఉంది, అనుకోకుండా నిశ్చితార్థం ఆగిపోయింది అది మేం మళ్ళీ జరిపిస్తాము, అనవసరంగా లేనిపోనివి చెప్పి దాని మనసుని పాడు చేయకు, కొద్ది రోజులు మీ ఊరు వెళ్లి వస్తే మంచిది అంటాడు దశరథ్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కంగారుగా దీప అక్కడికి వచ్చి ఇవేమిటి అని పేపర్స్ చూపించి అడుగుతుంది. ఆ పేపర్స్ చదివిన సుమిత్ర నీ భర్త కూతురు కావాలని కోర్టులో కేసు వేశాడు అంటుంది.

నర్సింహ ఇంత తెలివైన పనిచేస్తాడు అనుకోలేదు ఇంక నీ కూతురు వాడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. నా కూతుర్ని ఎలాగైనా రక్షించండి అని సుమిత్ర కాళ్ళు, దశరథ్ కాళ్లు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది దీప. నువ్వేమీ కంగారు పడకు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు దశరథ్. నా కూతురు ఆ దుర్మార్గుడు దగ్గరికి వెళ్లడానికి వీల్లేదు ఎలా ఆయన నా కూతుర్ని కాపాడుకోవాలి అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X