Karthika Deepam August 2nd episode:నర్సింహ కుట్రలో ఇరుక్కున్న దీప..కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న శ్రీధర్!

శౌర్య ఆరోగ్యం ప్రమాదంగా ఉందని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు డాక్టర్ ఆ విషయం దీపక్ చెప్పడు కార్తీక్. హాస్పిటల్ కి వచ్చి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ గొడవ చేస్తారు. దాంతో దీప ఇంటికి రాకుండా వేరే ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటుంది. విషయం సుమిత్ర కి చెప్పే హాస్పిటల్ కి రమ్మంటాడు కార్తీక్. దీప ని ఒప్పించి ఇంటికి తీసుకు వస్తుంది సుమిత్ర. అప్పుడు కూడా జ్యోత్స్న గొడవ చేస్తుంది. కూతురు కావాలని దీపకి కోర్టు నోటీసులు పంపిస్తాడు నర్సింహ ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 2వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 113వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తుంది దీప. వెంటనే కార్తీక్ గుర్తుకు రావటంతో అతనికి ఫోన్ చేస్తుంది. కార్తీక్ అప్పుడే ఇంటికి వస్తాడు దాంతో కంగారుగా పేపర్స్ తీసుకెళ్లి కార్తీక్ కి చూపిస్తుంది. అప్పుడే దశరధ్ దంపతులు కూడా అక్కడికి వస్తారు మీ అందరూ చదువుకున్న వాళ్లే కదా దయచేసి నా కూతుర్ని నాకు దూరం కానీయకుండా చూడండి ఈ ఒక్క సాయం చేయండి అని బ్రతిమాలుతుంది దీప.

Karthika Deepam 2 Serial 31st June 2024 Episode Number 113 Here is full story

బిడ్డ కావాలని కోర్టులో కేసు వేశాడు నర్సింహ అని చెప్తుంది సుమిత్ర. పేపర్స్ చూసిన కార్తీక్ ఈ విషయం రౌడీ కి తెలియదు కదా అంటాడు, లేదు అంటుంది దీప. ఇవేవీ దానికి తెలియనివ్వకండి అంటాడు కార్తీక్. ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అంటాడు దశరద్. తెలియకూడదు, తెలిస్తే దాని గుండె అంటూ మధ్యలోనే ఆగిపోతాడు.

ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతారు. ఏమీ లేదు చిన్నపిల్ల కదా పరిస్థితులని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అని మాట మార్చేస్తాడు కార్తీక్. లాయర్ దగ్గరికి వెళ్తున్న కార్తీక్ తో దీప ని కూడా వెళ్ళమంటుంది సుమిత్ర. పాప ఒక్కతే ఉంది అని దీప అంటే నేను చూసుకుంటాను అంటుంది సుమిత్ర. మరోవైపు శ్రీధర్ ఆవేశపడుతూ కాంచనని పిలుస్తాడు. పద దీప దగ్గరికి వెళ్దాం అని అంటాడు. ఏమైంది అంటుంది కాంచన. జ్యోత్స్న ఏడుస్తుంది.

Karthika Deepam 2 Serial 31st June 2024 Episode Number 113 Here is full story

దీప ఉండగా తన నిశ్చితార్థం జరగదని భయపడుతుంది అందుకే దీప దగ్గరికి వెళ్లి తనని ఇక్కడి నుంచి పంపించేద్దాం, సింగపూర్ లో మా ఫ్రెండ్ హోటల్లోకుక్ గా పెడదాం అంటాడు శ్రీధర్. కార్తీక్ ఒప్పుకుంటాడా అని అడుగుతుంది కాంచన. వాడేమైనా దీప భర్తా ఆపడానికి అని ఆవేశంగా ఉంటాడు శ్రీధర్. వదినతో నేను మాట్లాడతాను వాడు నా మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాడు మన పెంపకాన్ని మనమే నమ్మకపోతే ఎలా అంటుంది కాంచన.

నీ కొడుకు మీద నీకు అనుమానం లేదా అంటాడు శ్రీధర్. నా కొడుకు మీద ఎప్పుడూ అనుమానం లేదు కానీ మంచితనంతో ఎక్కడ చిక్కుల్లో పడతాడో అని భయం అంతే, మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపిద్దాము అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని భర్తని శాంతింప చేస్తుంది కాంచన. మరోవైపు కార్తీక్ కారులో ఉన్న దీపని పిలిచి ఆపుతాడు ఒక వ్యక్తి. దీప కారు ఆపమని అతని దగ్గరికి వెళ్లి మీరేంటి బాబాయ్ ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది.

భర్త అప్పు తీరుస్తానని ఇక్కడికి వచ్చి కనిపించకుండా పోయావు, మీ అత్త కూడా కనిపించలేదు ఇప్పుడు మా అప్పు ఎవరు కడతారు అని మర్యాద లేకుండా మాట్లాడుతారు ఊరి వాళ్ళు. అది గమనించిన కార్తీక్ అప్పుల వాళ్ళ అప్పు తీర్చేస్తాడు. వేరే దారి లేక ఒప్పుకున్నాను లేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు అంటుంది దీప. మీకు ఇంకా అర్థం కావడం లేదా మీరు ఈ కారులో వెళ్తున్నారని వాళ్ళకి ఎలా తెలుసు, కోర్టు నోటీసులు ఇవన్నీ చూస్తుంటే నర్సింహ ఇదంతా చేశాడనిపిస్తుంది.

వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అంటాడు కార్తీక్. నిజంగానే ఇదంతా నర్సింహా యే చేస్తాడు, ఊర్లో వాళ్ళని పిలిపించి దీప దగ్గరికి పంపిస్తాడు. ఊర్లో మనుషులు దీపని అప్పడగడం కార్తీక్ అప్పు తీర్చడం వీడియో తీస్తాడు. దీప పడిపోబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు అది కూడా వీడియో తీస్తాడు నర్సింహ. దీప వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సరిగ్గా దొరికారు, నాకు కావాల్సిన ఆధారాలు దొరికాయి అని నవ్వుకుంటాడు నర్సింహ.

Karthika Deepam 2 Serial 31st June 2024 Episode Number 113 Here is full story

మరోవైపు శౌర్య తను వేసిన డ్రాయింగ్ నుంచి నాన్న అనే పేరుని చించేస్తుంది. అప్పుడే దీప వంటగదిలో పాలు కలుపుతూ పాప కోసమే నర్సింహ ఇదంతా చేస్తున్నాడు నేను చచ్చినా పాప ని వాడి దగ్గరికి పంపించను అనుకుంటుంది దీప తర్వాత పాలు, బ్రెడ్ తీసుకుని కూతురు దగ్గరికి వెళ్ళి చిరిగి పోయిన డ్రాయింగ్ ని చూసిన దీపతో నాన్నగా అతను వద్దమ్మా అని జాలిగా అంటుంది. తండ్రిని అంత అందంగా ఊహించుకుంది.

అలాంటిది తండ్రి అంటేనే భయపడిపోయే స్థితికి తీసుకు వచ్చావు అని కూతుర్ని చూసి జాలి పడుతుంది దీప. తర్వాత కార్తీక్ పేరు చెప్పి కూతురితో పాలు తాగిస్తుంది. రేపు నేను బయటకు వెళ్తాను వచ్చేటప్పటికి లేటవుతుంది నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండు అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది శౌర్య. కోర్టు వాయిదాకి వెళ్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X