Karthika Deepam July 3rd episode:దీప ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించిన నర్సింహ.. హాస్పిటల్ పాలైన శౌర్య!
ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ ని రమ్మని చెప్తుంది శౌర్య. అయితే ఫంక్షన్ కి వచ్చిన కార్తీక్ కి అక్కడ నర్సింహ కనిపించడంతో గొడవలవుతాయని దీపకి కనిపించడు. తర్వాత తన పెళ్లి విషయం మాట్లాడేటందుకు తను పేరెంట్స్ తో పాటు జ్యోత్స్న ని, దీప, శౌర్య లను కూడా రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. అదే రెస్టారెంట్ కి స్వప్న వాళ్ళు రావడంతో ఇబ్బంది పడతాడు శ్రీధర్.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 3వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 87వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
హోటల్లో జరిగిన సంఘటనల గురించి పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. ఈరోజు దీప లో ఒక కొత్త దీప ని చూశాను. మావయ్య, దీప, బావ ల మధ్య ఏదో జరుగుతుంది, నాకు అర్థమైన విషయం ఏమిటంటే నాకు, బావకి పెళ్లి జరగటం దీప కి ఇష్టం లేదు అంటుంది జ్యోత్స్న. దానికి కారణం వాళ్ళిద్దరికీ మధ్య ముందు నుంచి పరిచయం ఉండటమే, అది నీకు చెప్తే ఏమైపోతావో అని చెప్పలేదు కానీ నువ్వే తెలుసుకునేటట్లుగా ఉన్నావు అనుకుంటుంది పారిజాతం.

మౌనంగా ఉన్న పారిజాతంతో నీ అనుభవంతో ఏదైనా సలహా ఇస్తావని నీకు చెప్తే అలా కామ్ గా ఉన్నావేంటి అంటుంది జ్యోత్స్న. సలహా ఇవ్వటానికి ఏముంది నీకు మీ బావకి వీలయినంత తొందరగా ఎంగేజ్మెంట్ చేసేయాలి అంటుంది పారిజాతం. అంతకుముందే దీపని ఇక్కడి నుంచి పంపించేయాలి అంటుంది జ్యోత్స్న.అలా పంపించాలి అంటే ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు పారిజాతం, జ్యోత్స్న.
మరోవైపు హోటల్లో దీప మాట్లాడిన మాటలకు బాధపడుతూ ఉంటుంది కావేరి. నేను ఆ రెస్టారెంట్ తీసుకొని వెళ్లి తప్పు చేశాను అయినా ఆ దీప అలా మాట్లాడకుండా ఉండవలసింది. ఆ రెస్టారెంట్ మా బాస్ ది అక్కడ ఆమె పెత్తనం ఏమిటో అంటుంది స్వప్న. ఆ దీప ఎప్పుడూ అంతే, ఆ రోజు హోటల్లో కూడా నానా గొడవ చేసింది. మీ నాన్నగారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే నేనే రెండు తగిలించేదాన్ని అంటుంది కావేరి.

అక్కడ అందరి ముఖాలు ఎందుకో టెన్షన్ గా ఉన్నాయి, మనమందరం టేబుల్ దగ్గర కూర్చుంటే బాస్ వాళ్ళ నాన్నగారు మాత్రం అక్కడికి రానేలేదు, వాళ్ళ అందరి మధ్యలో ఏదో జరుగుతుంది అంటుంది స్వప్న. సరే అదేమీ ఆలోచించకు వెళ్లి రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. లేదు, ఒకసారి బాస్ వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటుంది స్వప్న.
మరోవైపు హోటల్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. నిజం బయటపడితే శ్రీధర్ గారిని వారి పిల్లలిద్దరూ అసహ్యించుకుంటారు, కాంచన గారు బ్రతకరు, కావేరి గారు కూతురుతో సహా నాలాగా రోడ్డున పడతారు అనుకుంటుంది. హాయిగా పడుకున్నా శౌర్య ని చూసి మీ అమ్మ నీకు ఎలాంటి కష్టాన్ని రానివ్వదు, ఎలాంటి చెడు దృష్టి నీ మీద పడనివ్వదు అనుకుంటుంది. తర్వాత పాలు తోడు పెట్టడానికి కిచెన్ లోకి వెళుతుంది దీప.
అప్పుడే నర్సింహ వచ్చి శౌర్య ని ఎత్తుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అతడిని అడ్డుకుంటుంది దీప. నువ్వు ఎలాగూ నా కూతుర్ని ఇవ్వవు అందుకే నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు నర్సింహ. అతని దగ్గర నుంచి పాపని లాక్కునే ప్రయత్నం చేస్తుంది దీప. ఈ పెనుగులాటలో మెలకువ వచ్చిన శౌర్య నర్సింహను చూసి భయపడుతుంది.బూచాడు అంటూ భయంతో దీప వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. శౌర్య ని లాక్కొనే ప్రయత్నం చేస్తాడు నర్సింహ.

అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని నర్సింహ ని బెదిరిస్తుంది దీప. నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నరసింహ. ఈ గొడవకి భయపడిన శౌర్య కళ్ళు తిరిగి పడిపోతుంది. భయంతో ఏడుస్తుంది దీప.ఈ హడావిడి కి అక్కడికి వచ్చిన జ్యోత్స్న ఏం జరిగింది అనుకుంటుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. తర్వాత దీప పాపని హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. అక్కడ కార్తీక్, కార్తీక్ అని కలవరిస్తుంది శౌర్య. డాక్టర్ పాప ఎవరినో కలవరిస్తున్నట్లుగా ఉంది ముందు అతనిని పిలిపించండి, పాప కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు.
నర్స్ కూడా చెప్పడంతో కార్తీక్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది దీప. కంగారుగా హాస్పిటల్ కి వచ్చిన కార్తీక్ శౌర్య ని పలకరిస్తాడు. కార్తీక్ గొంతు విని కళ్ళు తెరిచిన శౌర్య బూచాడు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని జాలిగా రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను భయపడకు కళ్ళు మూసుకొని పడుకో అని ధైర్యం చెప్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











