Karthika Deepam June 3rd episode: కనిపించకుండా పోయిన శౌర్య.. దీపని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న అనసూయ!

దీప హోటల్ దగ్గరికి వచ్చి నానా రచ్చ చేస్తాడు నర్సింహ.పాటల పోటీ కోసం శౌర్య కి పాట నేర్పిస్తుంది దీప. బావని ఎలాగైనా బుట్టలో వేసుకో అని జ్యోత్స్న కి సలహా ఇస్తుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 1వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 61వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కార్తీక్ ఆఫీస్ కి వచ్చిన జ్యోత్స్న ని ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతాడు కార్తీక్. ఊరికే వచ్చాను రాకూడదా అంటుంది జ్యోత్స్న. మీలాంటి వాళ్ళు మా ఆఫీస్ కి ఊరికే వస్తారని ఎలా అనుకుంటాను అంటాడు కార్తీక్. అదేంటి మీరు మేము అని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న. వరుసకి బావ మరదలు అయినా బిజినెస్ లో మీరు టాప్ లో ఉన్నారు నేను ఇంకా ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 3rd June

మేము టాప్ లో ఉంటే నువ్వు కూడా టాప్ లో ఉన్నట్టే బావ అంటూ మన రెస్టారెంట్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు అంట అందుకే నీకు పార్టీ ఇద్దామని వచ్చాను. పదా..ఊరి బయట ఉన్న దాబా లో పరోట బాగుంటుంది తిందాము అంటుంది జ్యోత్స్న.కార్తీక్ కి ఇష్టం లేకపోయినా జ్యోత్స్న ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెతో బయలుదేరుతాడు.

మరోవైపు స్కూల్ కి వచ్చిన దీపకి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో వాచ్మెన్ ని అడుగుతుంది. మీటింగ్ ఉందని స్కూల్ని గంటన్నర ముందే వదిలేశారు, పిల్లలందరూ వెళ్లిపోయారు అంటాడు వాచ్మెన్. రోజు నా కూతుర్ని నేనే తీసుకు వెళ్తాను తను నాకోసం వెయిట్ చేస్తూ లోపల ఉండి ఉంటుంది అంటుంది దీప. లోపల ఎవరూ లేరమ్మ, ఏదో క్యాబ్ వచ్చింది..

Karthika Deepam 2 Serial 3rd June 2024 Episode Number 61 Here is full story

నాకు పని ఉందని నేను లోపలికి వెళ్లి వచ్చేటప్పటికి తను లేదు, అంటే ఆ క్యాబ్లో వెళ్ళిపోయి ఉంటుంది అంటాడు వాచ్మెన్. వెంటనే దీప నర్సింహని అనుమానిస్తుంది. అనసూయ ఇంటికి వెళ్లి శౌర్య గురించి అడుగుతుంది. నా మొగుడిని జైల్లో పెట్టించడానికి మరొక కొత్త నాటకం మొదలు పెట్టావా అంటుంది శోభ. నా కొడుక్కి నీ కూతుర్ని తీసుకురావాల్సిన అవసరం లేదు.

అయినా నిన్నే వద్దు అనుకుంటున్నాము ఇంకా నీ కూతురు మాకెందుకు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి రావద్దు అంటుంది అనసూయ. గత రెండు రోజుల నుంచి నర్సింహ చేసిన గొడవ గురించి చెప్పి తనే నా బిడ్డను తీసుకొని వచ్చి ఉంటాడు అంటుంది దీప. సూర్యాపేటకి కిరాయికి వెళ్లిన నా మొగుడు నీకు కూతుర్ని ఎలా తీసుకువస్తాడు, ఎక్కడికో పోయి ఉంటుంది వీళ్ళు వెతుక్కో అంటుంది శోభ.

Karthika Deepam 2 Serial 3rd June 2024 Episode Number 61 Here is full story

అనసూయ కూడా ఇంట్లోంచి బయటికి పో అంటూ కసురుకుంటుంది. ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది దీప. మరోవైపు తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నా భార్యని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను అంటాడు శివ నారాయణ. మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవటం నేర్చుకోండి అంటుంది పారిజాతం. అంత మంచి పని ఏం చేశావు అని వెటకారంగా అడుగుతాడు శివ నారాయణ.

ఎడమొఖం,పెడ ముఖంగా ఉన్న మనవడు మనవరాలిని కలిపే ప్రయత్నం చేశాను, ఏం చేయాలో మనవరాలికి చెప్పాను అంటుంది పారిజాతం. నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావో నాకు తెలుసు, అందుకే మనవరాలికి కాస్త దూరంగా ఉండు లేదంటే నిజంగానే హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ నారాయణ. భర్తని తిట్టుకుంటుంది పారిజాతం, ఎప్పటికైనా మనవరాలి పెళ్ళి మనవడితో చేయటమే నా ధ్యేయం అనుకుంటుంది.

Karthika Deepam 2 Serial 3rd June 2024 Episode Number 61 Here is full story

మరోవైపు కారులో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు కార్తీక్, జోత్స్న. నువ్వు అంత చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటున్నావ్ ఎందుకు అలా ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి. ఐదో తరగతి చదువుకున్న దీపని చూడు ఈ సిటీ తెలియకపోయినా తన కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తుంది అంటాడు కార్తీక్. బావ కారాపు అంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial 3rd June 2024 Episode Number 61 Here is full story

దీప ని పొగిడానని కోపం వచ్చిందా అంటాడు కార్తీక్.కాదు అంటూ ముందుకు చూపిస్తుంది జ్యోత్స్న. అక్కడ ఏడుస్తూ కూర్చున్న దీప ని చూస్తాడు కార్తీక్. కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. శౌర్య సంగతి అంతా చెప్తుంది దీప. ఆమెకి ధైర్యం చెప్పి దీపని కారులో ఎక్కించుకొని శౌర్య ని వెతికే పనిలో పడతాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపం తో రగిలిపోతుంది. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X