Karthika Deepam July 4th episode: సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. కోలుకోలేని షాక్ లో దీప, జ్యోత్స్న!
ఫాదర్స్ డే ఫంక్షన్ కి వచ్చిన కార్తీక్ కి అక్కడ నర్సింహ కనిపించడంతో గొడవలవుతాయని దీపకి కనిపించడు. తర్వాత తన పెళ్లి విషయం మాట్లాడేటందుకు తను పేరెంట్స్ తో పాటు జ్యోత్స్న ని, దీప, శౌర్య లను కూడా రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. అదే రెస్టారెంట్ కి స్వప్న వాళ్ళు రావడంతో ఇబ్బంది పడతాడు శ్రీధర్. నర్సింహ తన కూతుర్ని దొంగతనంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు, వాడి దగ్గర నుంచి కూతుర్ని కాపాడుకుంటుంది దీప. ఆ గొడవకి కంగారుపడిన శౌర్య స్పృహ తప్పి పడిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 4వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 88వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్య పడుకున్న తర్వాత బూచాడంటే వాడే కదా అంటాడు కార్తీక్. అవును అంటుంది దీప. ఏం జరిగింది అంటాడు కార్తీక్. జరిగింది చెప్తుంది దీప. వాడిని ఊరికే వదలకూడదు అంటూ కోపంతో రగిలిపోతాడు కార్తీక్. ఇప్పుడు నా కూతుర్ని రక్షించుకోవడం నాకు ముఖ్యం, వాడి సంగతి వదిలేయండి అంటుంది దీప. శౌర్య
కోలుకున్న తర్వాత వాడికి గట్టిగా ఉంటుంది, చూడండి పాప ఎంతగా భయపడిందో అంటూ పాపని ప్రేమగా నిమురుతాడు కార్తీక్.

మరోవైపు జ్యోత్స్న జరిగింది తలుచుకుంటూ ఎందుకు కన్న తండ్రికి తన బిడ్డని దీప ఇవ్వటం లేదు, తనకి ఇక్కడినుంచి వెళ్ళటం ఇష్టం లేదా అని అనుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు పాపని హాస్పిటల్కి తీసుకువెళ్లి ఉంటుంది బావ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు అనుకుంటూ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న.కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత కోపంతో రగిలిపోతుంది. మరోవైపు దీప కార్తీక్ తో మాట్లాడుతూ మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్లి బ్రెడ్, పాలు తీసుకు వస్తాను అంటుంది.
నేను వెళ్లి తీసుకు వస్తాను అంటాడు కార్తీక్. పాప దగ్గర మీ అవసరం లేకపోయినట్లయితే నేను మిమ్మల్ని పిలిచేదాన్నే కాదు, కానీ తను నిద్రలో కూడా మిమ్మల్నే కలవరిస్తుంది. అందుకే మిమ్మల్ని పాపకి దూరంగా ఉండమని చెప్పాను అంటుంది దీప.నేను రావటం మీకు ఇష్టం లేదా అంటాడు కార్తీక్. నాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అంటూ బ్రెడ్ తీసుకురావడానికి వెళ్తుంది దీప. అక్కడ నర్సింహ కనిపించి నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను, ఒంట్లో బాగోలేని పాప నీ పేరు కలవరించాలి లేదంటే మా అమ్మ పేరు కలవరించాలి అంతేగాని ఆ కార్తీక్ పేరు కలవరిస్తుందేంటి అని అసహ్యంగా మాట్లాడుతాడు.

ఇక్కడనుంచి వెళ్ళిపో నా కూతురు పరిస్థితి బాగోలేదు అని గట్టిగా మాట్లాడుతుంది దీప. ఆ మాటలకి కార్తీక్ బయటకు వస్తాడు. నర్సింహ మీద కోప్పడతాడు. దీప కూడా నర్సింహ మీద కోప్పడుతుంది. కావాలంటే మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటుంది. నీ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు, నేను అడిగినదానికి సమాధానం చెప్పు నేను వెళ్ళిపోతాను అంటాడు నర్సింహా. ఏం జరిగింది అంటాడు కార్తీక్.
సార్ కి నిజం చెప్పలేదా అంటూ జరిగిందంతా చెప్తాడు నర్సింహ. దీప ఇన్నాళ్లు టెన్షన్ గా ఉండడానికి కారణం ఇదా అనుకుంటాడు కార్తీక్. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకపోవడంతో నా కూతురు నేను తెచ్చుకుంటాను అంటూ శౌర్య దగ్గరికి వెళ్ళబోతాడు నర్సింహ. ఆగు, పాప నీ కూతురు కాదు నా కూతురు, తన కన్న తండ్రిని నేను అంటాడు కార్తీక్. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప, నర్సింహాలతోపాటు చాటుగా వింటున్న జ్యోత్స్న షాక్ అవుతుంది.

నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు నీ పని తర్వాత చెప్తాను అంటూ నర్సింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న కూడా కార్తీక్ వాళ్ళకి కనిపించకుండా ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. దీప కోపంతో కార్తీక్ ని ఏదో అనాలనుకుంటుంది కానీ శౌర్య వచ్చి పిలవటంతో ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. మరోవైపు కారులో వెళ్తున్న జ్యోత్స్న ఫ్రస్టేషన్ కి గురవుతూ ఉంటుంది. నిజంగా శౌర్య నీ కూతురా, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది బావ. ఇప్పుడు నేను ఏమైపోవాలి అంటూ కార్లోనే ఏడుస్తుంది.
మరోవైపు కూతురికి బ్రెడ్ తినిపిస్తూ పైన మాట్లాడుకున్న మాటలు అన్ని శౌర్య విందేమో అని కంగారుపడుతుంది దీప. కానీ ఏమీ వినలేదని శౌర్య మాటల్లో అర్థం చేసుకుంటుంది. తర్వాత కూతుర్ని పడుకోబెట్టి కత్తెర తీసుకొని కార్తీక్ దగ్గరికి వస్తుంది దీప. నువ్వు నా బిడ్డకు తండ్రిగా అంటూ కోపంగా కార్తీక్ పై కత్తిరితో దాడి చేయబోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











