Karthika Deepam June 4th episode: తప్పు చేశానంటున్న దీప.. ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న జ్యోత్స్న!

పాటల పోటీ కోసం శౌర్య కి పాట నేర్పిస్తుంది దీప. బావని ఎలాగైనా బుట్టలో వేసుకో అని జ్యోత్స్న కి సలహా ఇస్తుంది పారిజాతం. స్కూల్లో శౌర్య కనిపించకపోవడంతో కంగారుపడుతుంది దీప. కార్తీక్ జ్యోత్స్న తో కలిసి పాపని వెతుకుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 4 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 62వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శౌర్య ని వెతుకుతున్న దీప వాళ్లకి పాప కనిపించకపోవడంతో కంగారు పడతారు. ఏడుస్తున్న దీపతో కావాలంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు కార్తీక్. పోలీస్ కంప్లైంట్ వద్దు, ఇప్పటికే నేను ఒక కేసులో సాక్షిని వాళ్లు నన్ను అనుమానంగా చూస్తారు, మళ్లీ ఇదో కొత్త డ్రామానా అంటారు అంటుంది దీప. సరే కంప్లైంట్ వద్దు మనమే వెతుకుదాం అని దీపతో చెప్పి జ్యోత్స్న తో మంచినీళ్లు ఇమ్మని చెప్తాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 4th June 2024 Episode Number 62 Here is full story

జ్యోత్స్న దీప కి మంచినీళ్లు ఇస్తే పాప దొరికే వరకు మంచినీళ్లు తాగను అంటూ పాపని వెతిక డానికి వెళుతుంది దీప. ఇటు కార్తీక్ కూడా పాపని వెతికే పనిలో పడతాడు ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. మరోవైపు భర్తతో మాట్లాడుతున్న కాంచన మీలో గత రెండు రోజులుగా ఏదో మార్పు కనిపిస్తుంది నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటుంది.

నేను చెప్పాలనుకున్నది వింటే నీ గుండె ఆగిపోతుంది అని మనసులో అనుకుంటాడు శ్రీధర్. బయటికి మాత్రం నేను ఒక వారం రోజులు బయటకు వెళ్తాను నువ్వు బెంగ పెట్టుకోకుండా మీ అన్నయ్య దగ్గర ఉండు అంటాడు. బెంగ పెట్టుకోకుండా ఎలా ఉంటాను అయినా నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్తారు అంటుంది కాంచన. నిజం చెప్పలేక ఇబ్బంది పడిన శ్రీధర్ ఎప్పుడైనా వెళ్తే కంగారు పడొద్దు అని చెప్తున్నాను అంటాడు.

Karthika Deepam 2 Serial 4th June 2024 Episode Number 62 Here is full story

మనసులో కార్తీక్ కి త్వరగా పెళ్ళి చేసి కావేరి విషయం కాంచనకి చెప్పాలి,బయట వాళ్ల ద్వారా ఈ విషయం కాంచనకు తెలిస్తే బాగోదు అనుకుంటాడు. మరోవైపు కారులో కూర్చొని ఏడుస్తున్న దీపకి ధైర్యం చెబుతూ ఉంటాడు కార్తీక్. నేను ఈ ఊరు వచ్చి తప్పు చేశాను, వచ్చిన దగ్గరనుంచి అవమానాలే, అన్ని భరించాను కానీ ఈరోజు నా కూతురు కూడా కనిపించకుండా పోయింది అని బాధపడుతుంది దీప.

కంగారు పడకండి మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి భయమైతే మా పాప మిస్సయిందని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు కార్తీక్. ఆ మాటలకి మరింత కోపంతో పగిలిపోతుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం మనవరాలికి ఫోన్ చేసి ఏ ధాబా లో ఉన్నారు, ఏంటి స్పెషల్స్ అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది జ్యోత్స్న. శౌర్య తప్పిపోవడం ఏమిటి తను ఇక్కడే ఉంది అంటూ ఫోటో పంపిస్తుంది పారిజాతం.

అదే విషయం జ్యోత్స్న కార్తీక్ కి చెప్పటంతో కార్తీక్, దీప చాలా సంతోషపడతారు. అప్పుడు జ్యోత్స్న మాట్లాడుతూ మేము బయటికి వెళ్ళాలి పాప దొరికింది కదా నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళు అంటుంది. అందుకు సరే అంటుంది దీప, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అంటుంది. కానీ కార్తీక్ మాత్రం దీప కి ఇప్పటివరకు తోడు ఉండి ఇప్పుడు ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు, నాకు కూడా శౌర్య ని చూడాలనిపిస్తుంది, అందరం కలిసే వెళ్దాం అంటూ దీప ని తీసుకుని ఇంటికి వస్తాడు.

Karthika Deepam 2 Serial 4th June 2024 Episode Number 62 Here is full story

శౌర్య ని చూస్తూనే దీప పరిగెత్తుకొని వెళ్లి హత్తుకుంటుంది. ఇంటికి ఎలా వచ్చావని అడుగుతుంది. నీకోసం చాలా సేపు వెయిట్ చేశాను,ఇంతలో అక్కడికి ఒక క్యాబ్ వచ్చింది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనడంతో కార్ ఎక్కి వచ్చేసాను అని చెప్తుంది శౌర్య. అప్పుడే నర్సింహ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. నాకు తెలిసి నా పెళ్ళాం నీ పక్కనే ఉండి ఉంటుంది ఫోన్ ఇవ్వు అంటాడు. ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అంటాడు కార్తీక్. మీ ఇంటికి ముందుకు వచ్చి గట్టిగా అరుస్తాను అని బెదిరిస్తాడు నర్సింహ.

అప్పుడు కార్తీక్ దీపకి ఫోన్ ఇస్తాడు నర్సింహ మాట్లాడుతూ బాగా టెన్షన్ పడినట్లుగా ఉన్నావు, పాపని తీసుకువచ్చింది నా ఫ్రెండే, నేనే వాడిని లేటుగా ఇంటిదగ్గర దింపమని చెప్పాను. నా టార్చర్ ఇలాగే ఉంటుంది ఇక మీదట నీకు చుక్కలు చూపిస్తాను. నీ కూతుర్ని కూడా నీకు దూరం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు నర్సింహ. ఫోన్ పెట్టేసిన దీప కాస్త శౌర్య ను చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కోపంగా బయటికి వెళ్లిపోతుంది.

Karthika Deepam 2 Serial 4th June 2024

ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది, కార్తీక్ పిలిచిన పట్టించుకోదు. అందరికీ పెళ్లయ్యాక పిల్లల బాధ్యతలు వస్తాయి కానీ నీకు ఇప్పటి నుంచే బాధ్యతలు వచ్చేసాయి అని కార్తీక్ తో వెటకారంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం. ఇంట్లోకి వెళ్లి జోత్స్న తో మాట్లాడుతూ అసలు దీనంతటికి కారణం ఆ దీప అని చెప్తుంది.

ఆ దీప ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే గాని నా సమస్య తీరదు అంటుంది జ్యోత్స్న. అందుకు మీ అమ్మ ఒప్పుకోవాలి కదా అసలు దీనంతటికీ కారణం మీ అమ్మే అంటుంది పారిజాతం. ఆ మాటలు విన్న సుమిత్ర పారిజాతంపై కోప్పడుతుంది. జ్యోత్స్న సుమిత్ర మీద కోప్పడుతుంది, గ్రానీ అన్న దాంట్లో తప్పేముంది బావతో కలిసి కప్పు కాఫీ తాగాలన్నా కూడా కుదరడం లేదు అని కోపంగా అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X