Karthika Deepam August 5th episode: కోర్టులో నర్సింహ..దీపకు ధైర్యం చెప్పిన కార్తీక్

దీప ని ఒప్పించి ఇంటికి తీసుకు వస్తుంది సుమిత్ర. అప్పుడు కూడా జ్యోత్స్న గొడవ చేస్తుంది. కూతురు కావాలని దీపకి కోర్టు నోటీసులు పంపిస్తాడు నర్సింహ. తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని సుమిత్ర దంపతుల కాళ్లు పట్టుకుంటుంది దీప. లాయర్ దగ్గరికి వెళ్తున్న దీప కార్తీక్ నర్సింహ ట్రాప్ లో చిక్కుకుంటారు. తాగేసి కార్తీక్ ఇంటికి వచ్చిన నర్సింహ అతనితో గొడవ పెట్టుకుంటాడు. కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎవరికీ చెప్పకుండా కోర్టుకు వెళ్తారు పారిజాతం, జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 5 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 115వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

సుమిత్ర పూజ చేసుకుంటూ ఉంటే అక్కడికి శౌర్య వస్తుంది. శౌర్యని కూడా దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి తల్లి బిడ్డలని విడదీయొద్దు అని దేవుడుని కోరుకుంటుంది. తర్వాత కూతురి నిశ్చితార్థం కూడా జరిగేలా చూడమని దండం పెట్టుకుంటుంది సుమిత్ర. తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతుంది. మరోవైపు కోర్టులో వాదనలు ప్రారంభం అవుతాయి.

Karthika Deepam 2 Serial 5th August 2024

విష్ణువర్ధన్ నర్సింహ గురించి మాట్లాడుతూ అతను చాలా మంచి వ్యక్తి, కూతురు అంటే ప్రాణం పెట్టే వ్యక్తి, భర్త సంపాదన చాలక కూతురిని తీసుకొని భార్య వెళ్లిపోయింది, వేరే వ్యక్తి తో సంబంధం పెట్టుకుంది అంటాడు లాయర్. ఆ మాటలకి కోప్పడిన జ్యోతి నా క్లైంట్ గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటూ నర్సింహా ని క్రాస్ ఎగ్జామ్ చేయటానికి పర్మిషన్ కోరుతుంది. జడ్జ్ పర్మిషన్ గ్రాండ్ చేస్తాడు. అప్పుడు నర్సింహ దగ్గరికి వచ్చిన జ్యోతి మీ కూతురి పుట్టిన రోజు ఎప్పుడు అని అడుగుతుంది. చెప్పలేకపోతాడు నర్సింహ.

కూతురు అంటే అంత ప్రాణం ఉన్నవాడికి పుట్టినరోజు తెలిసి ఉండాలి కదా ఉంటుంది జ్యోతి. తింగరి వెధవకి చెప్పాను మర్చిపోయినట్లు ఉన్నాడు అని శోభతో అంటుంది అనసూయ. అప్పుడే నర్సింహకు తల్లి చెప్పిన డేట్ గుర్తొచ్చి చెప్తాడు. కూతురు పుట్టిన రోజుని కూడా అంతలా ఆలోచించి చెప్తున్నాడు అంటే కూతురు మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించవచ్చు అంటుంది జ్యోతి. కేసు ని తప్పుతోవ పట్టిస్తున్నారు అంటాడు విష్ణువర్ధన్ అలాగే దీప ని క్రాస్ ఎగ్జామ్స్ చేయడానికి పర్మిషన్ కూడా అడుగుతాడు.

పర్మిషన్ గ్రాంట్ చేస్తాడు జడ్జి. దీపని కొన్ని ప్రశ్నలు వేసిన విష్ణువర్ధన్ నీ భర్త పేరేమిటి అని అడుగుతాడు. సమాధానం చెప్పదు దీప. భర్త పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు, భర్త సంపాదన చాలక వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఉంటాడు విష్ణువర్ధన్. నా క్లైంట్ గురించి తప్పుగా మాట్లాడవద్దు, ఏ ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారు అని అభ్యంతరం చెప్తుంది జ్యోతి.

Karthika Deepam 2 Serial 5th August 2024 Episode Number 115 Here is full story

ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతాము అంటాడు లాయర్. నువ్వు నీ భార్య మీద ఇలాంటి అభియోగం మోపటానికి కారణం ఏమిటి అని నర్సింహని అడుగుతాడు విష్ణువర్ధన్. నా భార్య నన్ను వద్దనుకుంది కానీ నేను నా కూతుర్ని కావాలనుకున్నాను వెళ్లి అడిగితే నా చెంప పగలగొట్టింది అంటాడు నర్సింహా. అతను అబద్ధం చెప్తున్నాడు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. నువ్వు అతడిని కొట్టిన మాట నిజమా, కాదా అంటాడు లాయర్.

కొట్టిన మాట నిజమే కానీ అందుకు కారణాలు వేరే వున్నాయి అంటుంది దీప. ఏదైనా చేసింది తప్పే కదా, కారణాలు ఉన్నా నీ భర్త ఎప్పుడు నిన్ను కొట్టలేదు కదా దీనిని బట్టి నా క్లైంట్ ఆడవారికి ఎంత గౌరవం ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు అంటాడు లాయర్. నర్సింహ మాట్లాడుతూ దీప నా దగ్గరికి రాదని అర్థమైంది కారణం ఏమిటని ఆరా తీస్తే అప్పుడు అర్థమైంది తను వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అంటూ కార్తీక్ ని చూపిస్తాడు నర్సింహ.

అతని మాటలకి కోపంతో రగిలిపోయిన దీప ఆవేశంగా అతని దగ్గరికి వెళ్లబోతుంది. జ్యోతి ఆమెని ఆపి అలా చేయకూడదు అని వారిస్తుంది. ఇదంతా చూస్తున్న పారిజాతం మనం అనుకున్న దానికన్నా సీన్ రసవత్తరంగా ఉంది అని అనందంగా అంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ దీపకి చుక్కలు కనిపిస్తున్నాయి, పాపం బావ లోపల ఎంత బాధ పడుతున్నాడో ఏంటో అని వెటకారంగా జాలి చూపిస్తున్నట్లు అంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial 5th August 2024 Episode Number 115 Here is full story

మళ్లీ లాయర్ మాట్లాడుతూ అతనికి దీపకి సంబంధం ఉందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని నర్సింహ అని అడుగుతాడు. పాపకి తండ్రిని నేనైతే స్కూల్ ఫామ్ లో తండ్రిగా అతని పేరు రాసుకున్నాడు ఇప్పటికీ ఆ పేరు అలాగే ఉంది అంటాడు నర్సింహ. అంతేకాదు పాపకి స్కూల్ ఫీజు కూడా అతనే కట్టాడు అంటాడు నర్సింహా. ఆ డబ్బులు నేను దీపకి అప్పుగా ఇచ్చాను అంటాడు కార్తీక్. బోన్ లో లేకుండా అలా మాట్లాడకూడదు అని కార్తీక్ ని వారిస్తాడు లాయర్.

ఆ డబ్బు అప్పు గా తీసుకున్నాను అని దీప చెప్తుంది. నోటు ఏమైనా ఉందా అని అడుగుతాడు లాయర్. లేదు అంటుంది దీప. ఏ నోటూ లేకుండానే అంత పెద్ద అమౌంట్ ఇచ్చారంటేనే అర్థం అవుతుంది అంటాడు లాయర్. మళ్లీ నర్సింహ మాట్లాడుతూ అంతేకాదు ఊర్లో ఉన్న వాళ్ళ అప్పులన్నీ ఆ పెద్దమనిషే తీర్చాడు అని చెప్తాడు నర్సింహ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X