Karthika Deepam June 5th episode: అత్తకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర..భద్రకాళిలా మారిన దీప!
బావని ఎలాగైనా బుట్టలో వేసుకో అని జ్యోత్స్న కి సలహా ఇస్తుంది పారిజాతం. స్కూల్లో శౌర్య కనిపించకపోవడంతో కంగారుపడుతుంది దీప. కార్తీక్ జ్యోత్స్న తో కలిసి పాపని వెతుకుతుంది. పాప ఇంటి దగ్గరే ఉందని పారిజాతం చెప్పడంతో అందరూ ఇంటికి వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 5 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 63వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కోపంతో రగిలిపోతున్న జ్యోత్స్న నాకు బావ దక్కటం లేదు దీనంతటికీ కారణం ఆ దీప అంటుంది. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది సుమిత్ర. నా మనసు విరిగిపోయింది మమ్మీ అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. పారిజాతం కూడా అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటే నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు దాని మనసు విరి చేస్తున్నారు అంటుంది సుమిత్ర. నేనేం చేశాను పాడైపోతున్న నీ కూతురు జీవితాన్ని చక్కదిద్దాలి అనుకుంటున్నాను అంటుంది పారిజాతం. నా కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలుసు, దయచేసి మీరు నా కూతురికి దూరంగా ఉండండి.

ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. వ్యవహారం వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చిందన్నమాట చూస్తూ ఉండు ఆ దీప వల్లే నీ కూతురు జీవితంలో సంతోషం లేకుండా పోతుంది అనుకుంటూ కోపంతో రగిలిపోతుంది పారిజాతం. మరోవైపు నర్సింహ ఇంటి గేటు తన్నుకొని మరి లోపలికి వస్తుంది దీప. నీకు సిగ్గు లేదా వద్దన్నా మళ్లీ మళ్లీ వస్తున్నావు అంటూ గుమ్మం దగ్గరే అడ్డుకుంటుంది శోభ. ఆమె చెంప పగలగొట్టి మరి లోపలికి వెళ్లిన దీప కత్తిపేట తీసుకొని నేరుగా నర్సింహ పీక మీద పెడుతుంది. ఆ చర్యకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు.
అనసూయ కంగారుగా నా కొడుకు పీక మీద కత్తి పెడుతున్నావు తెగిపోతుంది అంటుంది. తెగాలనే పెట్టాను అంటుంది దీప. నర్సింహ తో మాట్లాడుతూ నాకు అన్యాయం చేశావు అయినా మాట్లాడలేదు, నా గురించి నీచంగా మాట్లాడావు అయినా భరించాను, అందుకని నా కూతురు జోలికి వచ్చినా ఊరుకుంటానని అనుకున్నావేమో నేను నా కూతురు కోసమే బ్రతుకుతున్నాను దాని జోలికి వచ్చావంటే నరికి పారేస్తాను అని భర్త జుట్టు పట్టుకుని మరీ వార్నింగ్ ఇస్తుంది దీప.

ఆ తర్వాత అనసూయ వైపు తిరిగి మొన్న పోలీస్ స్టేషన్లో ఏమన్నావు మా నాన్న చేసిన తప్పేమిటి అని నిలదీస్తుంది దీప. నిజం చెప్పనని తమ్ముడు మీద ఒట్టేసుకున్నాను అనుకుంటూ ఏమీ లేదు నీ మీద కోపంతో అలా అన్నాను అంటుంది అనసూయ. వదిలేసుకున్న మనిషి మీద కోపం ఎందుకు అత్తయ్య, కోపాన్ని కూడా వదిలేసుకోండి అంటుంది. మళ్లీ నా కూతురు జోలికి రావద్దు అంటూ అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు కాంచన భర్తతో మాట్లాడుతూ నాకు ఎందుకు అబద్దం చెప్పారు అని అడుగుతుంది. కంగారు పడిపోతాడు శ్రీధర్, కావేరి గురించే అనుకుంటాడు. కానీ బయటికి మాత్రం దేని గురించి అని అడుగుతాడు. ఇందాక కార్తిక్ ఏడి అని అడిగితే కోడల్ని తీసుకుని బయటికి వెళ్లాడు అని చెప్పారు కానీ వదినకి ఫోన్ చేశాను కోడలు ఇంట్లోనే ఉందట కానీ కార్తీక్ మాత్రం లేదంట అని చెప్తుంది కాంచన. మరి కార్తీక్ కి ఫోన్ చేసావా అంటాడు శ్రీధర్.

ఇందాక చేశాను కలవలేదు అంటూ మళ్ళీ చేస్తుంది కాంచన. అరగంటలో వస్తాను శౌర్యకి తోడుగా ఉన్నాను అంటాడు కార్తీక్. అదే విషయం భర్తకి చెప్తుంది కాంచన. వీడెందుకు ఆమె విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బయట వ్యక్తి లా ఆలోచిస్తే ఇది అంత చిన్న విషయం కాదు అంటాడు శ్రీధర్. అయితే దీపకి విడాకులు ఇప్పించండి అంటుంది కాంచన. వాళ్ళ సంగతి మనకెందుకు అంటాడు శ్రీధర్, నువ్వెందుకు ఆమె మీద అంత జాలి చూపిస్తున్నావు అని అడుగుతాడు.
భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్న మగవాడిని ఎప్పటికీ క్షమించను, అందుకే దీప మీద నాకు జాలి, నా కొడుకు కూడా అందుకే దీప మీద జాలి చూపిస్తున్నాడు అని కోపంగా మాట్లాడుతుంది కాంచన. నువ్వు ఎందుకు అంత ఆవేశపడుతున్నావు అంటూ ఆమె చేత జ్యూస్ తాగించి కూల్ చేస్తాడు శ్రీధర్. మరోవైపు శౌర్య కి పిజ్జా తినిపించి తీసుకొస్తాడు కార్తీక్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దీప వస్తుంది. వస్తూనే కార్తీక్ మీద ఫైర్ అయిపోతుంది.

పాప ఎప్పుడో మధ్యాహ్నం అనగా అన్నం తింది,ఆకలేస్తూ ఉండి ఉంటుంది మీరు దాన్ని అలాగే కూర్చోబెట్టేసారా అంటూ కేకలు వేస్తుంది. గది తాళం తీస్తూ రా భోజనం పెడతాను అని శౌర్య తో అంటుంది దీప. నేను తినేసాను అంటుంది శౌర్య. ఎక్కడ తిన్నావు అమ్మమ్మ పెట్టిందా అని అడుగుతుంది దీప. లేదు, కార్తీక్ బయటికి తీసుకెళ్ళి పిజ్జా తినిపించాడు అంటుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











