Karthika Deepam August 6th episode: నేను కొట్టిన మాట నిజమే.. కోర్టులో దీప
సుమిత్ర ని హాస్పిటల్ కి రమ్మంటాడు కార్తీక్. దీప ని ఒప్పించి ఇంటికి తీసుకు వస్తుంది సుమిత్ర. అప్పుడు కూడా జ్యోత్స్న గొడవ చేస్తుంది. కూతురు కావాలని దీపకి కోర్టు నోటీసులు పంపిస్తాడు నర్సింహ. తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని సుమిత్ర దంపతుల కాళ్లు పట్టుకుంటుంది దీప. లాయర్ దగ్గరికి వెళ్తున్న దీప, కార్తీక్ నర్సింహ ట్రాప్ లో చిక్కుకుంటారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోర్టుకి వస్తారు పారిజాతం, జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 116వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఊర్లో వాళ్ళ అప్పులన్నీ ఆ పెద్దమనిషే కట్టాడు అంతేకాదు పాపకి హాస్పిటల్ బిల్లు కూడా అతనే కట్టాడు అని చెప్తాడు నర్సింహ. అంత డబ్బు ఏ పరిచయము లేకుండానే నీకు ఇచ్చాడా అని అడుగుతాడు లాయర్. నా బంగారు గాజులు జమ కట్టుకోమని ఇచ్చాను అంటుంది దీప. తన భర్త కూతురు గురించి పట్టించుకోకుండా వదిలేస్తే వేరే ఎవరో సహాయం చేస్తే దాన్ని ఎలా తప్పు పడతారు అని అబ్జెక్ట్ చేస్తుంది జ్యోతి. అప్పుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ నువ్వు నీ కూతురు స్కూల్ ఫీజు కోసం నీ భర్తని డబ్బులు అడిగావా, హాస్పటల్ ఫీజు కోసం డబ్బులు అడిగావా అని అడుగుతాడు. లేదు అంటుంది దీప.

ఇప్పుడు అర్థమైందా జడ్జిగారు తనకి తన భర్త అవసరం లేదు, తన అవసరాలు తీర్చేవారు వేరే ఉన్నారు అంటూ మొత్తంగా అతని దగ్గర ఎంత తీసుకున్నావు అని దీపని అడుగుతాడు లాయర్. మొత్తంగా ఆరు లక్షల తీసుకుంది అని చెప్తాడు నర్సింహ. ఏ సంబంధం లేకుండా ఏ నోటు లేకుండా అంత డబ్బు ఇచ్చాడా అని నిలదీస్తాడు లాయర్. మనవడు ఇంత డబ్బు తగలేస్తున్నాడా అని మనవరాలు తో చెప్పి షాక్ అవుతుంది పారిజాతం. నర్సింహ మాట్లాడుతూ దీపకి కార్తీక్ కి సంబంధం ఉందన్న మాట నిజం.
నా భార్య నా కూతుర్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో నేను వెళ్లి నా కూతుర్ని నాకు ఇచ్చేయ్ అని అడిగితే అది నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పి నా ముఖం మీద చెప్పాడు ఆ పెద్దమనిషి, అన్నాడో,లేదో కావాలంటే దీపనే అడగండి అంటాడు నర్సింహ. నరసింహ చెప్పేది నిజమేనా అని అడుగుతాడు లాయర్. నా కూతుర్ని కాపాడుకోవడానికి కార్తీక్ బాబు అలా చెప్పారు అంటుంది దీప. కారణాలు చెప్పొద్దమ్మా, అతను అన్నాడా లేదా అని మాత్రం చెప్పు అంటాడు లాయర్. అన్నాడు అని ఏడుస్తూ చెప్తుంది దీప.
ఇవన్నీ నాకు కార్తీక్ ముందే చెప్పలేదు, చెప్పి ఉంటే మేనేజ్ చేసేదాన్ని ఇప్పుడు దీపే ఒప్పుకుంటుంది నేనేం చేయగలను అనుకుంటుంది జ్యోతి. మీ ఇద్దరికీ సంబంధం ఉంది అని నేను నోటి మాటతో చెప్పటం లేదు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ నర్సింహ తీసిన ఫోటోలు జడ్జికి చూపిస్తాడు లాయర్. తర్వాత దీపకి కూడా చూపించి హాస్పిటల్ లో అంత దగ్గరగా ఉండవలసిన అవసరం ఏముంది, అంటూ అసహ్యంగా మాట్లాడుతాడు లాయర్. దీప ఆ మాటలు భరించలేక స్పృహ కోల్పోతుంది. కార్తీక్, లాయర్ జ్యోతి ఇద్దరు కంగారుగా వస్తారు.
కార్తీక్ దీప మొహం మీద నీళ్లు కొట్టి ఆమెకి మెలకువ వచ్చేలాగా చేస్తాడు. జ్యోతి ఎలా ఉంది అని అడిగితే దీప బాగానే ఉంది అని చెప్తుంది. అప్పుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ దీప ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పింది కాబట్టి నా వాదన కొనసాగిస్తాను అంటాడు. అందుకు పర్మిషన్ ఇస్తాడు జడ్జి. కోర్టులో జరిగింది కాబట్టి చెప్తున్నాను కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయిన దీప భర్త ఎదురుగానే ఉన్నాడు, అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళు వచ్చే లోపల కార్తీక్ వచ్చి దీపకి సపర్యలు చేశాడు,
దీపకి మెలకువ వచ్చేవరకు కంగారు పడిపోయాడు ఇదంతా చూస్తూ కూడా నా క్లైంట్ ఏమి చేయలేకపోయాడు. దీప కి కార్తిక్ కి సంబంధం ఉంది అన్న దానికి ఇంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఏముంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని కూతుర్ని నిరాదరణ చేస్తున్న దీప దగ్గర నుంచి నా క్లైంట్ కి తన కూతుర్ని అప్పగించాల్సిందిగా కోరుతున్నాను అంటూ తన వాదన ముగిస్తాడు లాయర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











