Karthika Deepam July 6th episode: జ్యోత్స్న కి అన్యాయం జరగనివ్వనంటున్న పారిజాతం.. దీప ప్రయాణం ఎటువైపు?
నర్సింహ తన కూతుర్ని దొంగతనంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు, వాడి దగ్గర నుంచి కూతుర్ని కాపాడుకుంటుంది దీప. ఆ గొడవకి కంగారుపడిన శౌర్య స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన శౌర్య ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు నర్సింహ. ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదు నేను అని చెప్పి షాకిస్తాడు. అందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప, జీవితంలో మాకు కనిపించొద్దు అంటూ కన్నీటితో వేడుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 90వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప తన ఇంటికి వచ్చి లైట్ వేసి బట్టలు బ్యాగ్ లో సర్దుకుంటూ ఉంటుంది. ఈ టైంలో దీప ఇంటికి ఎవరు వచ్చారు అనుకుంటుంది జ్యోత్స్న. అదే సమయంలో ఇంట్లో బట్టలు అన్ని సర్దేసుకున్న తర్వాత మీ డబ్బులు గడువు ముందే అందుతాయి అని చీటీ రాసి డబ్బుల డబ్బాలో పెట్టి బయటికి వచ్చేస్తుంది దీప. దీపని చూసి గొడవ పడాలి అనుకొని ఆమె దగ్గరికి రాబోతుంది జ్యోత్స్న.కానీ బట్టలు సర్దుకుని వెళ్ళిపోతున్న దీప ని చూసి ఆనందపడుతుంది, నేను చేయాలనుకున్న పని తనే చేస్తుంది అనుకుంటూ దీప ని జీవితంలో ఎప్పుడూ క్షమించను అనుకుంటుంది.

అదే సమయంలో బయటికి వచ్చేస్తున్న దీప సుమిత్ర వాళ్ళ ఇంటిని చూస్తూ క్షమించండి అమ్మ మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను, అలాంటి పరిస్థితి మీ మేనల్లుడు తీసుకువచ్చారు, నిజం తెలిసి రేపు మీరు నన్ను నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీప హాస్పిటల్ కి వచ్చే సమయానికి పాప తండ్రి గురించి కలవరిస్తుంది మీరు వచ్చేవరకు తనని ఉండమనవాల్సిందే అంటుంది నర్స్. ఇప్పటివరకు ఇక్కడ ఉన్నందుకు థాంక్స్ అని నర్స్ మాటలు కట్ చేసేస్తుంది దీప.
రేపు ఇదే మాటలు బయట వాళ్ళు అంటే ఎలా సమాధానం చెప్పటం అనుకుంటుంది తర్వాత కార్తీక్ ని కలవరిస్తున్న శౌర్య తల నిమురుతూ పక్కనే కూర్చుంటుంది. మరోవైపు పూలు కోస్తూ దీపతో మాట్లాడాలనుకుని ఆమె దగ్గరికి వెళుతుంది సుమిత్ర. కానీ అక్కడ ఇల్లు కాళీ చేసి ఉండటంచూసి కంగారు పడుతూ భర్తతో చెప్తుంది. చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం ఏమిటి పిన్ని ఏమైనా అందా అంటావా అంటాడు దశరథ్.

నేను ఎందుకు అంటాను అంటూ అక్కడికి వస్తుంది పారిజాతం. నువ్వు ఎవరినైనా ఏమైనా అంటావు అంటూ అక్కడికి వస్తాడు శివ నారాయణ. భర్తని కోప్పడుతుంది పారిజాతం. తర్వాత శివ నారాయణ మాట్లాడుతూ జ్యోత్స్న కనిపించడం లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు నీకేమైనా తెలుసా అని కోడల్ని అడుగుతాడు. తెలియదు అంటూ దీప కనిపించని విషయం మామగారికి చెప్తుంది సుమిత్ర. ఇద్దరు గురించి కంగారు పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. మరోవైపు శౌర్యని డిశ్చార్జ్ చేయడంతో బిల్లు కట్టడానికి వెళుతుంది దీప.
అక్కడ కార్తీక్ బిల్ కట్టేసాడని తెలుసుకొని నా కూతురి హాస్పిటల్ బిల్లు నేనే కట్టుకుంటాను అనుకుంటూ తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉన్న గాజులని, ఫోను హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి బిల్లు సెటిల్ చేయమంటుంది. సార్ కట్టేసారు అని వాళ్ళు చెప్తే ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేయండి, ఈ గాజులలో మిగిలిన అమౌంట్ కూడా ఆయనకే ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది దీప. భార్యాభర్తల గొడవలేమో అనుకుంటారు అక్కడి స్టాఫ్. మరోవైపు జాగింగ్ నుంచి ఇంటికి వచ్చిన జ్యోత్స్న ని దీప గురించి అడుగుతారు ఇంట్లో వాళ్ళు.

దీప నిన్న రాత్రే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు ఆపలేదు కనీసం మమ్మల్ని పిలవాల్సింది కదా అంటుంది సుమిత్ర. ఎందుకు ఆపాలి తను ఏమైనా మన ఇంటి మనిషా, లేదంటే పనిమనిషా. నిన్ను రక్షించింది, మన అవసరం కోసం ఇంట్లో ఉంది తర్వాత తన అవసరం కోసం ఉంది ఇప్పుడు తన పని అయిపోయింది వెళ్ళిపోయింది. అయినా దీప నువ్వు అనుకునే అంత మంచిది కాదు అంటూ హోటల్లో జరిగిన సంగతి అంతా చెప్తుంది జ్యోత్స్న.
దీప ఎందుకు అలా ప్రవర్తించిందో నువ్వు చెప్పు ఆ తర్వాత దీపని ఎందుకు ఆపలేదు అనేది నేను చెప్తాను అని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అందుకే చెప్పాను వాళ్ళిద్దరికీ త్వరగా ఎంగేజ్మెంట్ చేసేయమని కానీ నా మాట వినటం లేదు, నేనైతే నా మనవరాలకి అన్యాయం జరగనివ్వను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం.

అసలు దాని మనసుని పాడు చేసింది ఇదే అని పారిజాతం గురించి కొడుకు కోడలికి చెప్తాడు శివ నారాయణ. దీప గురించి కార్తీక్ కి తెలిసేమో కనుక్కోండి అని భర్తకి చెప్తుంది సుమిత్ర. కార్తీక్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు కార్తీక్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కంగారుగా హాస్పిటల్ కి వస్తాడు కార్తీక్. అక్కడ స్టాప్ పాప వెళ్ళిపోయిందని, మీరు బిల్ పే చేశారని చెప్పినా వినకుండా గాజులు, ఫోను ఇచ్చారు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతారు హాస్పటల్ స్టాప్.
ఆ గాజులు, ఫోను కార్తీక్ తీసుకుంటాడు. మరోవైపు బాబాయ్ దగ్గరికి వచ్చిన దీప ఇక మా ఇంట్లో నేను ఉండవలసిన అవసరం లేదు అందుకే వచ్చేసాను అంటుంది. ఎక్కడికో వెళ్లిపోవటం ఎందుకు నా దగ్గరే ఉండు అంటాడు బాబాయ్. వద్దు బాబాయ్ ఈ హోటల్ కి ఇప్పుడు పేరు వచ్చింది ఈ హోటల్ కి కూడా నా అవసరం లేదు అంటుంది దీప. అలా అనొద్దు అంటాడు బాబాయ్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











