Karthika Deepam June 6th episode: కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప.. నరసింహను మళ్లీ రెచ్చగొట్టిన శోభ!

స్కూల్లో శౌర్య కనిపించకపోవడంతో కంగారుపడుతుంది దీప. కార్తీక్, జ్యోత్స్న తో కలిసి పాపని వెతుకుతుంది. పాప ఇంటి దగ్గరే ఉందని పారిజాతం చెప్పడంతో అందరూ ఇంటికి వస్తారు. పాప కనిపించకపోవటానికి కారణం నర్సింహా అని తెలుసుకొని అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 64వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తల్లితో పిజ్జా తిన్నాను అని చెప్తుంది శౌర్య. అదేమిటి? అమ్మమ్మ ఇచ్చిందా అని అడుగుతుంది దీప. కాదు, నాకు ఆకలి వేస్తే కార్తీక్ బయటకు తీసుకెళ్ళి తినిపించాడు చాలా బాగుంది నాకు రోజు పెడతావా అని అడుగుతుంది శౌర్య. దాని పేరు ఇప్పుడే వింటున్నాను అంటుంది దీప. తర్వాత శౌర్య ని బట్టలు మార్చుకొని స్నానం చేయమని చెప్పి లోపలికి పంపిస్తుంది దీప.తర్వాత కార్తీక్ తో మాట్లాడుతూ మీరు అదేదో తినిపించారు కదా దాని ఖరీదు ఎంత అని అడుగుతుంది దీప.

Karthika Deepam Serial 2 Season 6th

650 అంటాడు కార్తీక్. అది ఈరోజు కావాలని అడుగుతుంది, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెచ్చేది అంటుంది దీప. అది అడిగింది కదా అని రోజు పెడతారా ఏంటి, మేం మాత్రం రోజు తింటామా.. అలాంటివి రోజు తినకూడదు అదే విషయం తనకి చెప్పండి అంటాడు కార్తీక్. దానికి కొత్త రుచులు అలవాటు చేయకండి అనే చెప్తుంది దీప. సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య కార్తీక్ కి థాంక్స్ చెప్పావా అని అడుగుతుంది. లేదు అంటుంది దీప.

చెప్పు లేదంటే మాట్లాడను అని శౌర్య అనడంతో కార్తీక్ దగ్గరికి వెళ్లి థాంక్స్ చెప్తుంది దీప. ఇలాగే ఏదో ఒక రోజు క్షమించాను అనే మాట కూడా మీ నోటి నుంచి రావాలని ఆశిస్తున్నాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పారిజాతం చూసి కార్తీక్ మీద కోపంతో రగిలిపోతుంది. మరోవైపు దీప చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటారు నర్సింహ ఫ్యామిలీ. అది అంతలా రెచ్చిపోయిందంటే నువ్వు ఏం చేసావు అని కొడుకుని అడుగుతుంది అనసూయ.

Karthika Deepam 2 Serial 6th June 2024 Episode Number 64 Here is full story

దాని కూతురు ఆలస్యంగా ఇంటికి రావడానికి కారణం నేనే అని అబద్ధం చెప్పాను అంటాడు నర్సింహా. నువ్వు అబద్దం చెప్తేనే ఇంత చేసిందంటే నిజంగా ఆ పని చేస్తే ఇంకేం చేస్తుందో దాని జోలికి పోవద్దు అని చెప్పాను కదా అంటూ కొడుకుని కోప్పడుతుంది అనసూయ. ఎందుకు పోకూడదు దీప ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే వరకు దానిని వదలకూడదు అని రెచ్చగొడుతుంది శోభ. వదిలిపెట్టేది లేదు అంటాడు నర్సింహ.

మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన పారిజాతం గోముగా మాట్లాడుతూ రేపు నా పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయొద్దు కానీ నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి అంటుంది. విషయం తెలియకుండా మాట ఇవ్వను అంటాడు శివ నారాయణ. అయినా అతనిని ఒప్పించి అతని దగ్గర మాట తీసుకుంటుంది పారిజాతం. అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ్ నీ కోరిక ఏదైనా సరే తీరుస్తాను అంటూ మాట ఇస్తాడు. ఆనందంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది పారిజాతం.

Karthika Deepam 2 Serial 6th June 2024 Episode Number 64 Here is full story

మరోవైపు కూతురిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దీప. ఇంకెప్పుడూ తను లేకుండా స్కూల్ నుంచి బయటికి రాకూడదని, ఎవరితోనూ బయటికి వెళ్ళకూడదని శౌర్య దగ్గర మాట తీసుకుంటుంది దీప. మరోవైపు ఇంకా ఇంటికి రాని కొడుకు మీద కోప్పడుతూ ఉంటుంది కాంచన.నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆ దీప కి సెకండ్ క్లాస్ చదువుతున్న కూతురు ఉంది అంటాడు శ్రీధర్. మరి పిన్ని అంతలా చెప్తుంది అంటుంది కాంచన.

Karthika Deepam 2 Serial 6th June 2024 Episode Number 64 Here is full story

అంతలోనే అక్కడికి వచ్చిన కార్తీక్ తల్లిదండ్రులను పలకరిస్తాడు. ఇప్పటివరకు ఎందుకు భోజనం చేయలేదు అని తల్లిని మెల్లగా మందలిస్తాడు. నేను లేకపోతే అమ్మ భోజనం చేయదు అని ఎన్ని పనులు ఉన్నా 9:30 కల్లా ఇంటికి వచ్చేవాడివి కానీ ఇప్పుడు మాత్రం ఆ అవుట్ హౌస్ లో అంటూ ఆగిపోతుంది కాంచన. ఎందుకలా ఆలోచిస్తున్నావు అని తల్లిపై చిరు కోపం ప్రదర్శిస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X