Karthika Deepam June 7th episode: కోడల్ని చూసి భయంతో పరుగులు తీసిన అనసూయ..దీప నిజస్వరూపం తెలుసుకుని షాకైన కార్

కార్తీక్, జ్యోత్స్న తో కలిసి పాపని వెతుకుతుంది. పాప ఇంటి దగ్గరే ఉందని పారిజాతం చెప్పడంతో అందరూ ఇంటికి వస్తారు. పాప కనిపించకపోవటానికి కారణం నర్సింహా అని తెలుసుకొని అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. శౌర్య కి పిజ్జా తినిపించిన కార్తీక్ తో పాపకి కొత్త కొత్త రుచులు అలవాటు చేయవద్దు అని చెప్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 7 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 65వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఇంటికి వచ్చిన కార్తీక్ ని ఇంతకుముందు ఎన్ని పనులు ఉన్నా నేను లేకపోతే అమ్మ భోజనం చేయదు అని 9:30 కల్లా వచ్చేసేవాడివి కానీ ఇప్పుడు ఆ అవుట్ హౌస్ లో అంటూ ఆగిపోతుంది కాంచన. అలా ఆలోచిస్తున్నావేంటి అంటాడు కార్తీక్. నేను నిన్ను అదే అడుగుతున్నాను నువ్వు చేస్తున్నది ఏమిటి, నువ్వు చేస్తున్నది చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుంది అంటుంది కాంచన.నన్ను అత్త కూడా ఇలా అడగలేదు తను చూస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసు కానీ నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అనుమానించుకు నాకు బాధగా ఉంటుంది అని తల్లికి నచ్చజెప్పి భోజనానికి తీసుకువెళ్తాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 6th June 2024

ఆ తర్వాత దీప తన పని మీద బయటకి వెళుతుంది అప్పుడే అనసూయ సరుకుల కోసం బయటికి వస్తుంది. దీపని చూసి భయంతో పరుగులు తీస్తుంది. అదే సమయంలో చూసుకోకుండా కార్తీక్ ని గుద్దేస్తుంది. ఏం జరిగింది అని అడుగుతాడు కార్తీక్. రాత్రి జరిగిందంతా చెప్తుంది అనసూయ. కార్తీక్ ఆశ్చర్యపోతాడు, మీరు దీప గురించే మాట్లాడుతున్నారా, ఏమైనా అంటే ఏడుస్తూ కూర్చునే దీప గురించేనా అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు.

అవును ఆ దీప గురించే చెప్తున్నాను అంటూ అక్కడి నుంచి భయంతో పారిపోతుంది అనసూయ. దీప లో ఈ కోణం కూడా ఉందా అనుకుంటూ ఆశ్చర్యపోతాడు కార్తీక్. మరోవైపు ఇంట్లో అందరూ పారిజాతానికి బర్త్డే విషెస్ చెప్తారు, మీరు మావయ్యని ఏదో కోరిక కోరారు అంట కదా అది ఏమిటో తెలుసుకోవాలని ఉంది ఏమిటది అంటుంది సుమిత్ర. చెప్తానులే, బర్త్డే పార్టీ అవ్వని అంటుంది పారిజాతం. ఈరోజు మీ బర్త్ డే స్పెషల్ అని దీపని పాయసం చేయడానికి రమ్మన్నాను అంటుంది.

దీప ఏం చేసినా మమ్మీకి స్పెషలే అనుకుంటుంది జ్యోత్స్న. అంతలోనే అక్కడికి వచ్చిన దీపతో పాయసం చేయమని చెప్తుంది సుమిత్ర. దశరథ్ వాళ్లు శౌర్య తో ఆడుకుంటూ ఉంటారు. అది చూసి భరించలేక పోతారు జ్యోత్స్న, పారిజాతం. దాని వంటని మెచ్చుకుంటున్న మీరే దాని వంట తింటే భయపడేలాగా చేస్తాను అనుకుంటుంది పారిజాతం. మరోవైపు బయటకు వెళ్తున్న శ్రీధర్ ని మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు అంటుంది కాంచన.

Karthika Deepam 2 Serial 6th June 2024

ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీధర్, ఎక్కడికి అని అడుగుతాడు మీ అత్తగారింటికే కదా అంటుంది కాంచన. తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా అనుకుంటాడు శ్రీధర్. అంతలోనే కాంచన మాట్లాడుతూ ఈరోజు పారిజాతం పిన్ని పుట్టినరోజు కదా అన్నయ్య అందరిని రమ్మని ఫోన్ చేశాడు మీరు అక్కడికే కదా రెడీ అవుతున్నారు ఆగండి నేను కూడా రెడీ అయిపోతాను అంటుంది.

అప్పటికే కావేరీ కి వస్తాను అని మాట ఇవ్వటంతో నాకు రావటం కుదరదు ఆఫీసులో ఆడిటింగ్ వుంది కార్తీక్ ని వెళ్ళమని చెప్పు అని భార్యకి నచ్చజెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. మరోవైపు కార్తీక్ పారిజాతానికి బొకే ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతాడు. దీప పాయసం చేస్తుంది అది నీకు స్పెషల్ ఏ కదా అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. చిన్న బుచ్చుకున్న కార్తీక్ ఫోన్ మాట్లాడాలి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు.

గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా కిచెన్ లో పనిచేసుకుంటున్న దీపని చూస్తాడు కార్తీక్. ఇంత సాఫ్ట్ గా ఉండే దీప కూతురు విషయానికి వచ్చేసరికి ఇంత వైలెంట్ గా మారిపోతుందా అనుకుంటూ ఆమెని మనసులోనే మెచ్చుకుంటాడు కార్తీక్. కార్తీక్ తనని చూడటం దీప గమనిస్తుంది. పని పూర్తి అయిన తర్వాత నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది, సడన్గా ఆమె రావటం చూసి షాక్ అవుతాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X