Karthika Deepam August 7th episode: జ్యోత్స్న మాటలకి షాక్ లో శౌర్య.. భర్తని చెప్పుతో సన్మానించిన దీప!

కూతురు కావాలని దీపకి కోర్టు నోటీసులు పంపిస్తాడు నర్సింహ. తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని సుమిత్ర దంపతుల కాళ్లు పట్టుకుంటుంది దీప. లాయర్ దగ్గరికి వెళ్తున్న దీప, కార్తీక్ నర్సింహ ట్రాప్ లో చిక్కుకుంటారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోర్టుకి వస్తారు పారిజాతం, జ్యోత్స్న. కోర్టులో లాయర్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోతుంది దీప. కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కోర్టులో దీపకి కార్తీక్ కి అక్రమ సంబంధం ఉందని సాక్షాధారాలు చూపిస్తాడు లాయర్.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 7 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 117వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

లాయర్ విష్ణువర్ధన్ తన వాదన వినిపించి తన క్లైంట్ కి కూతుర్ని అప్పగించాలని కోరుతాడు. తన కూతుర్ని తన నుంచి విడదీయొద్దని జడ్జిని బ్రతిమాలుకుంటుంది దీప. లాయర్ జ్యోతి దీప ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఒకరోజు గడువు కోరుతుంది. జడ్జి పర్మిషన్ ఇస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విష్ణువర్ధన్ మాట్లాడుతూ మీరు ఎన్ని వాయిదాలు తీసుకున్నా మేమే గెలుస్తాం అంటాడు. నేను కూడా అదే చెప్తున్నాను ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అంటుంది జ్యోతి.

Karthika Deepam 2 Serial 7th August 2024 Episode Number 117 Here is full story

తర్వాత బయటికి వచ్చిన దీప ఏడుస్తూ ఉంటుంది, ఈ విషయాలు అన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ ని అడుగుతుంది జ్యోతి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్తాడు కార్తీక్. సరే ముందు దీప ని తీసుకొని ఇంటికి వెళ్ళు అని కార్తీక్ కి చెప్తుంది జ్యోతి. తర్వాత దీపని ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోతి. ఏ నమ్మకంతో ధైర్యంగా ఉండాలి అని ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దీప.

అక్కడికి వచ్చిన నర్సింహ ఆమెని ఎగతాళి చేస్తూ మాట్లాడుతాడు. ఈరోజు కేసు ఓడిపోయావు రేపు కూతుర్ని కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండు అంటాడు. అనసూయ కొడుకుని మందలించి అక్కడి నుంచి తీసుకొని పోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఇలా కూర్చున్నారేంటి రండి ఇంటికి వెళ్దాం అంటాడు. మీరు వెళ్ళండి, మీరు చేస్తున్న ఈ సాయాన్ని కూడా ఏ మూల నుంచో ఫోటో తీసి సాక్ష్యాలు చూపిస్తారు దయచేసి వెళ్ళిపోండి అంటుంది దీప.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వెళ్ళిపోతాను కానీ ఎట్టి పరిస్థితులలోనూ శౌర్య మీకు దూరం కాదు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు ఇంటి బయట సుమిత్రతో ఆడుకుంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే కోర్ట్ నుంచి వచ్చిన జ్యోత్స్న ని పలకరిస్తుంది శౌర్య. అమ్మమ్మతో ఆడుకుంటున్నావా, ఎంత ఆడుకుంటావో ఇప్పుడే ఆడుకో రేపటి నుంచి ఆడుకోవడానికి నువ్వు ఇక్కడ ఉండవు కదా అంటుంది జ్యోత్స్న. ఎందుకు అని అడుగుతుంది శౌర్య.

Karthika Deepam 2 Serial 7th August 2024 Episode Number 117 Here is full story

రేపు మీ నాన్న వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది జ్యోత్స్న.ఆ మాటలకి షాక్ అయిపోతుంది శౌర్య. నిజంగా బూచాడు తీసుకెళ్లిపోతాడా అమ్మమ్మ అని జాలిగా అడుగుతుంది. అలాంటిదేమీ జరగదు నువ్వు ఆడుకో అని చెప్పి లోపలికి వెళుతుంది సుమిత్ర. శౌర్యతో అలా ఎందుకు మాట్లాడావు అని కూతుర్ని అడుగుతుంది. కోర్టులో జరిగిందంతా చెప్తుంది పారిజాతం. అసలు మీరు కోర్టుకు ఎందుకు వెళ్లారు, నువ్వు వెళ్తే వెళ్లావు దాన్ని ఎందుకు తీసుకువెళ్లావు అని పారిజాతాన్ని అడుగుతాడు దశరథ్.

అక్కడ నిందలు వేస్తున్నది పక్కింటి వాడి మీద కాదు నా బావ మీద. నన్ను ఏమన్నా పట్టించుకోను కానీ నా బావని ఏమైనా అంటే ఊరుకునేది లేదు ఈ జడ్జిమెంట్ నాక్కూడా అవసరం అందుకే తెలుసుకోవటానికి వెళ్ళాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. దాని మనసు చెడగొట్టకండి,దానిని ప్రశాంతంగా ఉంచండి అని అత్తగారిని రిక్వెస్ట్ చేస్తుంది సుమిత్ర. మధ్యలో నేనేం చేశాను తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మంచికి పోయిన వాళ్లకే చెడు ఎదురవుతుంది అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. అత్తయ్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని భర్తతో చెప్పి బాధపడుతుంది సుమిత్ర.

Karthika Deepam 2 Serial 7th August 2024 Episode Number 117 Here is full story

మరోవైపు శ్రీధర్ ఫ్రెండ్స్ కార్తీక్ కేసు గురించి అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అదే విషయం భార్యతో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఫ్రెండ్స్ తో ఏమని చెప్పారు అని అడుగుతాడు. వాయిదాల పద్ధతిలో నా కొడుకు పరువు తీసేస్తున్నాడు అని చెప్తాను అంటాడు శ్రీధర్. పరువు గురించి మీరు మాట్లాడొద్దు అంటాడు కార్తీక్.ఆ మాటలకి కార్తీక్ తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అవుతారు, మీ నాన్నగారిని అంత మాట అనేసావేంటి అంటుంది కాంచన.

మరి ఏంటమ్మా బయట వాళ్ళు ఎన్నో మాటలు అంటారు వాళ్లకి సరైన సమాధానం చెప్పడం మానేసి మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా నన్ను నమ్ము నేను ఆ తల్లి బిడ్డలు విడిపోకుండా ఉండడం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ . కొడుకుని ఏమీ అనొద్దని భర్తని మందలిస్తుంది కాంచన. మరోవైపు తన పరిస్థితిని తలుచుకొని ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది దీప. దారిలో చెప్పు తెగిపోతుంది దానికి పిన్ను పెట్టి నడుస్తూ ఉంటే మళ్ళీ తెగిపోతుంది.

అటుగా వస్తున్న నర్సింహ రోడ్డుమీద నీ కోడలు ఒక్కతే నడుస్తుందేంటి దానికి ఒక చిన్న జలక్ ఇచ్చి వస్తాను అని తల్లి వద్దని వారిస్తున్నా వినకుండా కారు దిగి దీప దగ్గరికి రాబోతున్న నర్సింహ పై చెప్పు చూసుకోకుండా విసిరేస్తుంది దీప. మన మానాన మనం పోదాం రా అంటే వినలేదు ఇప్పుడు నీకు ఈ చెప్పు సన్మానం అవసరమా అని కొడుకుని మందలిస్తుంది అనసూయ. భర్త ని వెనకేసుకొస్తున్న శోభ ని కూడా మందలించి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అనసూయ. వాళ్లని కోపంగా చూస్తూ ఉండిపోతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X