Karthika Deepam August 8th episode: నర్సింహపై చెప్పు విసిరేసిన దీప.. భర్తకు అండగా శోభ
లాయర్ దగ్గరికి వెళ్తున్న దీప, కార్తీక్ నర్సింహ ట్రాప్ లో చిక్కుకుంటారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోర్టుకి వస్తారు పారిజాతం, జ్యోత్స్న. కోర్టులో లాయర్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోతుంది దీప. కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కోర్టులో దీపకి కార్తీక్ కి అక్రమ సంబంధం ఉందని సాక్షాధారాలు చూపిస్తాడు లాయర్. దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి. మరోవైపు కోర్టు బయట దీప ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు నర్సింహ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 8 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 118వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీనంగా నడుచుకుంటూ జ్యోతి దగ్గరికి వస్తుంది దీప. రేగిన జుట్టుతో కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చిన దీపని చూసి కంగారుపడుతుంది జ్యోతి. దీపకి మంచినీళ్లు ఇచ్చి ఆమె నిదానించిన తర్వాత దీప రావడానికి కారణం అడుగుతుంది. నాకు విడాకులు కావాలి అంటుంది దీప. ఆ మాటలకి షాక్ అవుతుంది జ్యోతి. నువ్వు కోర్టులో జరిగిన దానికి కంగారు పడినట్లుగా ఉన్నావు మొదటి వాయిదాకే ఇలా అయిపోతే ఎలా వాళ్ళు నిన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి అలా చేస్తున్నారు అంటుంది జ్యోతి. నేను చాలా పోరాడి అలసిపోయాను ఇక ఓపిక లేదు. కోర్టులో ఆ లాయర్ అక్రమ సంబంధం అంటూ మాట్లాడుతుంటే నన్ను నరికేసినట్లుగా అనిపిస్తుంది నేను ఇంక వాడితో వేగలేను నాకు విడాకులు ఇప్పించండి అంటుంది దీప. విడాకులు అంత త్వరగా రావు అంటుంది జ్యోతి. వస్తాయమ్మా మీరు అర్జీ పెట్టండి, విడాకులు రావడానికి ఏం చేయాలో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు దీపకి అన్యాయం జరుగుతుంటే మనం ఏమి సాయం చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు దశరథ్ దంపతులు. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం దీప కి తల్లి లేదు గాని ఉంటే నీ కన్నా ఎక్కువగా ఆలోచించి ఉండేది కాదు అంటుంది.

ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని కోపంగా అంటుంది సుమిత్ర. శౌర్య లేకపోతే దీప బ్రతకలేదు అని తెలిసిన నీకు కార్తీక్ లేకపోతే జ్యోత్స్న బ్రతకలేదనే విషయం తెలియదా దాని గురించి ఆలోచించకుండా ఈ దీప గురించి ఆలోచిస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. ఎంగేజ్మెంట్ నా మేనల్లుడు కావాలని ఏమి ఆపుకోలేదు, మళ్లీ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాము కానీ దీప పరిస్థితి అలా కాదు అంటుంది సుమిత్ర.
కోర్టు నుంచి దీప కూతురు కోసం ఇక్కడికే వస్తుంది తన ముందు మీరు అలా మాట్లాడకండి బాధపడుతుంది అంటుంది సుమిత్ర. అప్పుడే దీప ఇంటికి వచ్చి కూతుర్ని పిలుస్తుంది. అక్కడ కనిపించకపోవడంతో సుమిత్ర వాళ్ళ ఇంట్లో ఉందేమో అనుకొని అక్కడికి వెళుతుంది. సుమిత్ర పాప బయటే ఆడుకుంటుంది అని చెప్పడంతో బయట లేదమ్మా అని కంగారుగా చెప్తుంది దీప. దాని బాబు తీసుకెళ్లాడేమో అని అంటుంది పారిజాతం. ఆమెని మందలిస్తుంది సుమిత్ర.
దీపతో పాటు శౌర్య ను వెతకటానికి బయటికి వస్తారు దశరథ్ దంపతులు. అదిగో బంతి కూడా ఇక్కడే ఉంది పాప ఇంత సేపు ఎక్కడైనా ఆడుకుంది అంటుంది సుమిత్ర. కార్తీక్ బాబు తీసుకెళ్లేరేమో ఒకసారి ఫోన్ చేస్తాను అని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది దీప. ఫ్రెండ్ తో మాట్లాడుతున్న కార్తీక్ ఫోన్ గమనించడు. తర్వాత మిస్డ్ కాల్ చూసి తిరిగి దీప కి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దీప ఫోన్ చేశారంటే మళ్ళీ ఏమైనా జరిగిందేమో అనుకొని సుమిత్ర ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్.
మరోవైపు పారిజాతం శౌర్య కనిపించడం లేదు అని చెప్పటానికి జ్యోత్స్న దగ్గరికి వెళుతుంది. దాని బాబే దానిని తీసుకొని వెళ్లి ఉంటాడు అంటుంది జ్యోత్స్న. కానీ దీపకి మన ఇల్లు కంచుకోట లాగా మారింది,మీ తల్లిదండ్రులు మీ బావ దానికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు కట్టుకున్న మొగుడు కూడా ప్రేక్షకుడి లాగా చూస్తూ ఉండిపోతున్నాడు అంటుంది పారిజాతం. వాడు ప్రేక్షకుడు కాదు మన పాలిట దేవుడు అంటుంది దీప. ఎందుకు అంటుంది పారిజాతం.
వాడు కేసు గెలిచి కూతుర్ని తీసుకొనిపోతే అప్పుడు దీప తట్ట బుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు శౌర్య కనిపించడం లేదు పరిస్థితి ఏంటి అంటుంది పారిజాతం. సైలెంట్ గా ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ ఇంటికి రావడంతో శౌర్య కనిపించడం లేదని విషయం చెప్తుంది దీప. ఏం జరిగిందో అని పరి పరి విధాల ఆలోచిస్తూ ఉంటారు కార్తీక్ వాళ్ళు. కార్తీక్ గొంతు విని బీరువాలో దాకున్న శౌర్య బయటకి వస్తుంది.
కంగారు గా ఆమెని పట్టుకున్న దీప పిలుస్తున్నా ఎందుకు పలకలేదు అని అడుగుతుంది. నన్ను బూచాడు వెతుకు పోతాడు కదా అందుకే బీరువాలో దాక్కున్నాను. కార్తీక్ ఉంటే బూచాడిని రానివ్వడు కదా అందుకే కార్తీక్ గొంతు విని బయటికి వచ్చానుఅంటుంది శౌర్య. ఇక్కడికి ఎవరూ రారమ్మ అయినా బూచాడు వస్తాడని నీతో ఎవరు చెప్పారు అంటుంది అంటుంది దీప. జో చెప్పింది అంటుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం


Click it and Unblock the Notifications











