Karthika Deepam July 8th episode: కోలుకోలేని షాక్ లో పారిజాతం.. కార్తీక్ కి అబద్దం చెప్పిన కడియం బాబాయ్!
నర్సింహతో జరిగిన గొడవకి కంగారుపడిన శౌర్య స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన శౌర్య ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు నర్సింహ. ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదు నేను అని చెప్పి షాకిస్తాడు కార్తీక్. అందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప, జీవితంలో మాకు కనిపించొద్దు అంటూ కన్నీటితో వేడుకుంటుంది. తర్వాత తను వుంటున్న ఇంటిని ఖాళీ చేసి సుమిత్ర వాళ్లకి చెప్పకుండా బయటికి వచ్చేస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 91వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఇప్పుడు టిఫిన్ సెంటర్ కి మంచి పేరు వచ్చింది నా దగ్గర నుంచి చిట్కాలు కూడా తెలుసుకున్నావు కాబట్టి ఇక నా అవసరం హోటల్ కి లేదు అందుకే నేను ఇక్కడనుంచి దూరంగా వెళ్లిపోతాను అంటుంది దీప.అలా అనకమ్మా నువ్వు చేసిన సాయం నేను ఎప్పుడూ మర్చిపోను అంటాడు బాబాయ్. ఒకరకంగా నువ్వే నాకు పని ఇచ్చి నన్ను ఆదుకున్నావు అంటుంది దీప.

శౌర్య ని చూస్తూ పాపని చూస్తే జాలి వేస్తుంది ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పాను పాపని తీసుకురమ్మని అంటాడు బాబాయి. ఇప్పుడు వచ్చాను కదా అంటుంది శౌర్య. ఈ పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు అంటాడు బాబాయ్. నాకు ఎక్కడైనా తక్కువ అద్దెతో ఇల్లు చూపించు బాబాయ్ అంటుంది దీప. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అతని దగ్గర ఒక ఇల్లు ఉంది అక్కడ ఉందువుగానివి పదా అనటంతో ముగ్గురు అక్కడి నుంచి వెళ్తారు. మనం అమ్మమ్మ ఇంటికి వెళ్లడం లేదా అని అడుగుతుంది శౌర్య. లేదు అంటుంది దీప.
కడియం బాబాయ్ దీపకి ఇల్లు చూపిస్తాడు, బాబాయ్ ఫ్రెండ్ ఇంటి తాళాలు వాళ్లకి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు బాబాయి అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు ఆ ఇంటి నుంచి వచ్చేసావు అని అడుగుతాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాడు. నా గురించి నిజం చెప్పొద్దు నేను ఎక్కడ ఉన్నానో తెలియదని చెప్పండి అని బాబాయ్ కి చెప్తుంది దీప. ఫోన్ లిఫ్ట్ చేసిన బాబాయ్ కార్తీక్ తో దీప గురించి తెలియదని చెప్తాడు. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ దీప కనిపించడం లేదు..

తనని వెతకండి నేను కూడా వెతుకుతాను ఒకవేళ ఆమె కనిపిస్తే ఆమెకు తెలియకుండా నాకు చెప్పండి అని చెప్తాడు. సరే అని ఫోన్ పెట్టేసిన బాబాయి. అసలు ఏం జరిగిందమ్మా అని మళ్ళీ అడుగుతాడు బాబాయ్. సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటుంది దీప. అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులు కొన్ని ఆమె చేతిలో పెడితే వద్దు అంటుంది దీప. నన్ను తండ్రి లాంటి వాడివి అంటావు కదా ఏ తండ్రీ కూతురు కష్టంలో ఉంటే వదిలేయలేడు అయినా నీ జీతమే నీకు ఇస్తున్నాను అంటాడు బాబాయ్.
తర్వాత దీప మాట్లాడుతూ ఇకమీదట నువ్వు కూడా ఇక్కడికి రావద్దు బాబాయ్ నీ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం ఎవరికైనా తెలుస్తుంది నేను ఎక్కడ ఉన్నాను అనే విషయం ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నాను అంటుంది దీప. నా చేతులు కట్టేస్తున్నావు అంటూ అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతాడు బాబాయ్.మరోవైపు జ్యోత్స్న ని నిజంచెప్పమని నిలదీస్తుంది పారిజాతం. హాస్పిటల్లో జరిగిందంతా చెప్తుంది జ్యోత్స్న.

ఆ మాటలకి కుప్పకూలిపోతుంది పారిజాతం. నువ్వు తప్పు చేశావు, శత్రువుని మన పక్కనే పెట్టుకోవాలి అంటారు పెద్దవాళ్ళు అందుకే పెళ్లి అయ్యేవరకు దీప మన కాంపౌండ్ లోనే ఉండాలి తనని వదిలేసి తప్పు చేశావు అని మనవరాలిని మందలిస్తుంది. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అంటుంది జ్యోత్స్న. మీ బావకి తెలుస్తుంది అంటుంది పారిజాతం. నిజం చెప్తాడంటావా అంటుంది జ్యోత్స్న. చెప్పేలా అడుగు అంటుంది పారిజాతం.
మరోవైపు కార్తీక్ చేసిన పని గురించి దీప, దీప వెళ్ళిపోవటం గురించి కార్తీక్ ఇద్దరూ ఆలోచనలో పడతారు. ఆ తర్వాత శౌర్య ని పిలిచి టానిక్ వేసుకోమంటుంది దీప. కానీ ఆ ఇంటిని వదిలేసి వచ్చినందుకు తల్లిపై అలుగుతుంది శౌర్య. నాకు ఈ ఇల్లు నచ్చలేదు అయినా అక్కడ నుంచి ఎందుకు వచ్చేసాం,నీకు కార్తీక్ కి ఏమైనా గొడవ జరిగిందా, నిన్ను కలవరించలేదని నీకు కోపం వచ్చిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
ఆమెకి ఏవో మాటలు చెప్పి నచ్చ చెప్తుంది దీప. కార్తీక్ కి మనం ఇక్కడికి వచ్చినట్లు చెప్పలేదు తను నాకోసం వెతుకుతాడు అందుకే మనం కార్తీక్ ఇంటికి వెళ్దామా అని అమాయకంగా అడుగుతుంది శౌర్య. ఎందుకు అస్తమానం కార్తీక్, కార్తీక్ అంటావు ఇక మనం ఎక్కడికీ వెళ్లడం లేదు అంటుంది దీప. అలా అయితే కార్తీక్ ఇక్కడికి వస్తాడా అని అడుగుతుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











