Karthika Deepam July 9th episode: అత్తమామల ముందే కార్తీక్ ని నిలదీసిన జ్యోత్స్న.. శౌర్య ప్రవర్తనికి షాక్ లో దీ
హాస్పిటల్లో జాయిన్ చేసిన శౌర్య ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు నర్సింహ. ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదు నేను అని చెప్పి షాకిస్తాడు కార్తీక్. అందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప, జీవితంలో మాకు కనిపించొద్దు అంటూ కన్నీటితో వేడుకుంటుంది. తర్వాత తను వుంటున్న ఇంటిని ఖాళీ చేసి సుమిత్ర వాళ్లకి చెప్పకుండా బయటికి వచ్చేస్తుంది దీప. జ్యోత్స్న దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కానీ ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని చెప్పడంతో కంగారు పడతారు సుమిత్ర వాళ్ళు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 9వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 92వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ ని పదేపదే కలవరిస్తున్న శౌర్యని దగ్గరికి తీసుకొని ఎందుకు పదేపదే కార్తీక్ ని కలవరిస్తావు అంటుంది దీప. హాస్పిటల్లో కార్తీక్ బాబు అన్న మాటలు దీప వినేసిందా అందుకే కార్తీక్ బాబుని పదేపదే తలుచుకుంటుందా అని భయపడుతుంది దీప. మరోవైపు భార్యకి కాఫీ ఇస్తూ కార్తీక్ కనిపించడం లేదు ఏమిటి అని అడుగుతాడు శ్రీధర్. ప్రొద్దున బయటకు వెళ్ళటం చూశాను కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటుంది కాంచన. అడగాలి కదా అంటాడు శ్రీధర్. వాడు ఏమైనా చిన్నపిల్లాడా అడిగి పంపించడానికి అంటుంది కాంచన.

కన్న తల్లివే కదా అత్త అడగొచ్చు అంటూ అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న తో కబుర్లలో పడిన శ్రీధర్ కోడలికి మర్యాదలు చేయడం మర్చిపోయాను ఏమి కావాలి అని అడుగుతాడు శ్రీధర్. బావ కావాలి అంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ లోపలికి వస్తుండడం చూసిన శ్రీధర్ అదిగో వస్తున్నాడు తీసుకో అంటాడు. లోపలికి వస్తున్న కార్తీక్ ని చూసి దీప దొరికిందా అని అడుగుతుంది జ్యోత్స్న.
దీపకి ఏమైంది అని కంగారుగా అడుగుతారు శ్రీధర్ దంపతులు. దీప రాత్రి నుంచి కనిపించడం లేదు బావకి తెలుస్తుందేమో అని అడగటానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న. శ్రీధర్ కార్తీక్ ని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు హాస్పిటల్ కి వెళ్లాను అంటాడు కార్తీక్. అక్కడికి ఎందుకు అంటుంది కాంచన. జరిగిందంతా చెప్తాడు కార్తీక్. ఇంత జరిగితే ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పని దీపా నీకు మాత్రమే అన్నీ చెప్తుంది పైగా తన బాధ్యత నువ్వు తీసుకున్నావు కదా అందుకే నిన్ను అడగడానికి వచ్చాను.
నీకు దీప గురించి ఏమైనా తెలిస్తే చెప్పు ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మరోవైపు గోడమీద కార్తీక్ పేరు రాసి కార్తీక్ తో మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది శౌర్య. ఆమె ప్రవర్తనకి షాక్ అవుతుంది దీప. ఇది హాస్పిటల్లో కార్తీక్ బాబు అన్నమాట వినేసిందా, కార్తీక్ బాబాయ్ తన తండ్రి అనుకుంటుందా ఎలా తెలుసుకోవడం అని అనుకుంటుంది. ఏమిటమ్మా ఈ పిచ్చి పని అని కార్తీక్ పేరు తుడి చేయబోతుంది దీప కానీ తల్లిని వద్దని వారిస్తుంది శౌర్య.

మనం ఇక్కడున్న విషయం నాన్నకి తెలుస్తుందా అని అడుగుతుంది శౌర్య, తెలియదు అంటుంది దీప. అలా అయితే కార్తీక్ కి కూడా మనం ఇక్కడ ఉన్నట్లు తెలియదు అంటుంది శౌర్య. ఆమె మాటలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడుతుంది దీప. మరోవైపు ఇంటికి వచ్చిన జ్యోత్స్న ని ఏమైంది అని అడుగుతుంది పారిజాతం. బావకి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నాడు అంటుంది జ్యోత్స్న. ఇంట్లో దీప గురించి వేడివేడి చర్చలు జరుగుతున్నాయి అంటుంది పారిజాతం.
మనం కూడా పాల్గొందాం పద అని జ్యోత్స్న అనడంతో ఇద్దరూ హాల్లోకి వెళ్తారు. అప్పటికే దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర వాళ్లు. అప్పుడు పారిజాతం కల్పించుకొని ఇప్పుడు ఆలోచించవలసింది వెళ్ళిపోయిన దాని గురించి కాదు ఇంట్లో ఉన్న మనవరాలు గురించి. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది ఇప్పుడైనా పెళ్లి విషయం పై దృష్టి పెట్టండి అంటుంది పారిజాతం. ఇన్నాళ్ళకి మీ అత్తగారు ఒక మంచి సలహా ఇచ్చింది.
పారిజాతం చెప్పినట్లే కాంచన ఇంటికి వెళ్లి ముహూర్తాలు పెట్టుకు రండి అని కొడుకుని కోడల్ని పంపిస్తాడు శివ నారాయణ. వాళ్లు వెళ్లిన తర్వాత నన్ను మెచ్చుకున్నారు కదా నాకు గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా కావాలి అని అడుగుతుంది పారిజాతం. పెళ్లి ముహూర్తాలు పెట్టని హారమే చేయిస్తాను అంటాడు శివ నారాయణ. ఆనందపడుతుంది పారిజాతం కానీ నీకు కాదు నా మనవరాలికి అని నవ్వుకుంటూ వెళ్లిపోతాడు శివ నారాయణ. మూతి ముడుచుకుంటుంది పారిజాతం.

పెళ్లి జరగనీ గ్రానీ నీకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాను అంటుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాత మాట్లాడుతూ పద నీ పెళ్లయిన వరకు దీప మన కళ్ళ ముందే ఉండాలి, అది ఎక్కడ ఉందో వెతుకుదాం పద అనటంతో ఇద్దరూ కలిసి దీపని వెతకడం కోసం బయలుదేరుతారు. కార్ లో వెళ్తున్న జ్యోత్స్న ఈరోజు నా లైఫ్ లోనే బ్యాడ్ డే, దీప వెళ్లిపోయినందుకు ఆనందపడటం మానేసి దానికోసం వెతుకుతున్నాను చూడు ఇదంతా నా ఖర్మ అంటుంది.
పారిజాతం కూడా దీపని తిట్టుకుంటుంది. మరోవైపు పాలు తాగుతూ పొలమారిపోయి పాలు వంపేస్తుంది శౌర్య. పాలు క్లీన్ చేస్తూ ఉంటుంది దీప. అప్పుడు శౌర్య మాట్లాడుతూ మనల్ని ఎవరైనా తలుచుకుంటే పొలమారతారంట కదా నన్ను నాన్న తలుచుకొని ఉంటాడంటావా అంటుంది శౌర్య. ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











