కార్తీకదీపం వంటలక్క.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఎన్ని లక్షలంటే?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన సీరియల్ కార్తీకదీపం. ఈ డైలీ సీరియల్ లో వంటలక్కగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమీ విశ్వనాథ్. డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్ అంశాలతో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బుల్లితెర ఆడియన్స్ కు ఈ సీరియల్ ద్వారా ప్రేమే విశ్వనాథ్ ఎంతగానో పరిచయమైంది. దీపా పాత్రలో వంటలక్కగా మారి నేచురల్ నటనతో ఆకట్టుకుంది. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్ మొదటి సీజన్ ముగిసింది. 2017 అక్టోబర్ 16 నుంచి మొదలైన కార్తీక దీపం డైలీ సీరియల్ 2023 జనవరి 23 వరకు కొనసాగింది.

ఐదున్నర ఏళ్లుగా కార్తీకదీపం సీరియల్ 1569 ఎపిసోడ్స్ స్టార్ మా లో ప్రసారమయ్యాయి. నిరుపం పరిటాల ఈ డైలీ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించారు. కాగా ఆయన ప్రేయసి పాత్ర లో ప్రేమీ విశ్వనాథ్ నటించారు. వీరిద్దరి నటనకు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ముఖ్యంగా వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఆడియన్స్ తో కంటతడి పెట్టించింది. తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ అన్నింటిలోనూ ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర ఆమెది. అయితే మొదటి సీజన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం రెండవ సీజన్ కూడా ప్రారంభమైంది.

Karthika Deepam 2 Serial Actress Premi vishwanath Get Shocking Remuneration

గత ఏడాది నుంచి కార్తీకదీపం 2 స్టార్ మా లో ప్రసారం అవుతుంది. సీజన్ 2 లోను ఆసక్తికరమైన సన్నివేశాలు, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటున్నారు. దీప పాత్రను నటించిన ప్రేమి విశ్వనాథ్ రెండవ సీజన్లోనూ మరింతగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న అన్ని సీరియల్స్ లోనూ దీపా పాత్ర అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రేమి విశ్వనాథ్ పేరు కన్నా ఈమెను వంటలక్క అంటేనే అందరూ గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ రేంజ్ లో ఆ పాత్రకు ప్రేమే విశ్వనాథ్ న్యాయం చేసింది. అయితే ఈమె బుల్లితెరపై అలరిస్తూ ఆకట్టుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఆమె వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలిసి ఉండవు. ఈ క్రమంలో ఆమె ఊరు, ఫ్యామిలీ, గత సీరియల్స్, ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ కు ఆమె అందుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఇక వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఆమె కేరళ వాసి. 2014 నుంచి సీరియల్స్ లోనే నటిస్తూ వస్తోంది. తొలుత మలయాళం సీరియల్స్ లో నటించి మెప్పించింది. అక్కడ మంచి గుర్తింపు రావడంతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళం లో దాదాపు నాలుగు సీరియల్లలో నటించింది.

ఇక 2017లో కార్తీకదీపం సీరియల్ ప్రారంభం కావడంతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పటివరకు తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో పాటు గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియస్ లోను నటించింది. ఇక ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్లో నటిస్తూ బిజీగా ఉండింది. అయితే ప్రేమి విశ్వనాథ్ టెలివిజన్ రంగంలో సీనియర్ యాక్ట్రెస్ గా మారిపోయింది. దీంతో ఆమె ఒక్కరోజు షూటింగ్ కు ఎంత తీసుకుంటుంది, ఆమె రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఎంత ఉండింది అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Karthika Deepam 2 Serial Actress Premi vishwanath Get Shocking Remuneration

అయితే ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి. ఈమె ఒక్కరోజు షూటింగ్ కి ప్రస్తుతం 50 వేల రూపాయలు ఛార్జ్ చేస్తుందంట. ఇలా నెలలో 20 నుంచి 25 రోజులపాటు షూటింగ్ బిజీ లోనే ఉంటుంది. దీంతో నెల ఆదాయం 10 నుంచి 12 లక్షల మధ్య ఉంటుందని అర్థం అవుతుంది. రోజుకు 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ అంటే టెలివిజన్ రంగంలో ఆమె లేడీ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు.

ఇక ఆమె చూడడానికి చిన్న వయసుకురాలు లా కనిపించిన ఆమెకు కాలేజీకి వెళ్లే కొడుకు ఉండడం విశేషం. ఆమెకు ఒక్కడే కొడుకు ఉన్నాడు. వినీత్ బట్ అనే పాపులర్ ఆస్ట్రాలజర్ ను పెళ్లి చేసుకుంది. నటుడు జయసూర్యకు ప్రేమీ విశ్వనాథ్ బంధువు కావడం విశేషం. ఇక వంటలక్క సీరియల్స్ తో బుల్లితెరపై అలరించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది. ఇక ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం 2 సీరియల్ లో మాత్రమే నటిస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం 311 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారం అవుతుంది.

Karthika Deepam 2 Serial Actress Premi vishwanath Get Shocking Remuneration

ఇక వంటలక్క తన నటనకు గాను మలయాళం ప్రేక్షకుల నుంచే కాకుండా తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా మంచి గుర్తింపు పొందింది. తన పాత్రకు న్యాయం చేయడంలో మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈమె టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది ప్రేమీ విశ్వనాథ్. 2014లో మొదట మొదటిసారిగా 'కరుతముత్తు' మలయాళం టీవీ సిరీస్ లో నటించినందుకు గాను బెస్ట్ డెబ్యూటెంట్ ఫీమేల్ యాక్ట్రెస్ విభాగంలో ఏషియా నెట్ టెలివిజన్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు అదే సిరీస్ లో తన నటనకు గాను జేసీ ఫౌండేషన్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన కార్తీక దీపం సీరియల్ నటించినందుకు బెస్ట్ సిరీయల్ యాక్ట్రెస్ విభాగంలో స్టార్ మా పరివార్ అవార్డ్ ను అందుకుంది. అంతే కాదు వంటలక్క పలు చిత్రాల్లోనూ నటించి వెండి తెరపైనా సందడి చేసింది. తెలుగులో అక్కినేని నాగచైతన్య 'కస్టడీ', తమిళంలో 'సల్మాన్ 3డీ' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అంలరించింది. ఇక మలయాళంలో 'అకమే' అనే షార్ట్ ఫిల్మ్ కు ప్రొడ్యూసర్ గాను వ్యవహరించింది. ఏదేమైనా ప్రేమీ విశ్వనాథ్ మాత్రం టెలివిజన్ రంగంలో దూసుకుపోతోంది. ఇక ఆమె నటిస్తున్న కార్తీక దీపం2 సీరియల్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. జ్యోత్స్న పాత్రతో వచ్చే సన్నివేశాలతో దీపా చాలా కష్టాలు పడుతుంది. అందుకు సంబంధించిన సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రేమి విశ్వనాథ్ తన అమాయకమైన రూపసౌందర్యంతో, అద్భుతంగా పెర్ఫామ్ చేస్తోంది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X