Karthika Deepam september 2nd episode: దీపని కన్ఫ్యూజన్ లో పడేసిన స్వామీజీ.. జ్యోత్స్నకు దాసు రహస్యం !

నర్సింహ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు తనకు ఇవ్వమని తల్లి తో గొడవ పడతాడు. కార్తీక్ అతని చెంప పగలగొట్టి అనసూయని అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తాడు. దాసు పారిజాతం కొడుకని తెలిసి షాక్ అవుతుంది దీప. తర్వాత దాసు పారిజాతం కొడుకుని తెలిసినా కార్తీక్ కూడా షాక్ అవుతాడు. రాఖీ కట్టిన జ్యోత్స్నకి కాశి డబ్బులు ఇవ్వబోతే అతడిని అవమానించేలాగా మాట్లాడుతుంది జ్యోత్స్న. తనకోసం కాఫీ తెచ్చిన సుమిత్రతో మీ పెంపకం బాగోలేదు మొహం మీదే చెప్తాడు దాసు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 2 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 139వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

దీప తో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. అప్పుడే శౌర్య వచ్చి అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. అవును బయలుదేరిపోయారంట వచ్చేస్తారంట అని చెప్తాడు కార్తిక్. తర్వాత బయటికి వెళ్దాం కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది అని శౌర్య తో చెప్పి ఆమెను తీసుకొని బయటకు వెళ్తాడు కార్తీక్. మరోవైపు దాసు అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది సుమిత్ర. అటుగా వచ్చిన పారిజాతంతో మీతో జ్యోత్స్న గురించి మాట్లాడాలి అంటుంది. అప్పుడే అటుగా గా వచ్చిన జ్యోత్స్న నా గురించి గ్రానీతో ఏం మాట్లాడతావు అని అడుగుతుంది.

Karthika Deepam 2 Serial September 2nd 2024 Episode Number 139 Here is full story

నిన్ను ఇలా తయారు చేసింది మీ గ్రానీ యే కదా, అంటూ దాసు జ్యోత్స్న గురించి చెప్పిన మాటలు చెప్తుంది సుమిత్ర. వాడు ఏం మాట్లాడుతాడు వాడికే తెలియదు ఆ మాటలు పట్టించుకోవద్దు అంటుంది పారిజాతం. దాసు ఏమి తింగరి వాడు కాదు, ఎవరినీ పల్లెత్తి మాట అనని దాసు ఈరోజు నీ గురించి అలా మాట్లాడాడంటే నా మీద నాకే సిగ్గుగా ఉంది అంటుంది సుమిత్ర.

అతను అలా మాట్లాడటానికి ఏం హక్కు ఉంది, అతను ఎవరు నా గురించి ఎలా మాట్లాడడానికి అని కోప్పడుతుంది జ్యోత్స్న. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారు అంటే వాళ్ల మీద కోప్పడటం కాదు తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యు అయినా ఇదంతా మీ గ్రానీ వల్లే ఇకమీదట నా కూతురు జోలికి మీరు రాకండి నా కూతురికి మంచి చెడ్డ నేనే చెప్పుకుంటాను అని అత్తగారికి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర.

Karthika Deepam 2 Serial September 2nd 2024 Episode Number 139 Here is full story

జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ నీ కొడుకు ఎక్కడ అని పారిజాతాన్ని అడుగుతుంది. ఇప్పుడే వెళ్లిపోయాడు అంటుంది పారిజాతం. ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది జ్యోత్స్న. సీన్ కట్ చేస్తే దాసు నడుస్తూ ఉంటాడు అతని దగ్గరికి స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వేస్తుంది జ్యోత్స్న. అంత స్పీడ్ గా వచ్చి బ్రేక్ వేయడం ఎందుకు స్లోగానే రావచ్చు కదా అంటాడు దాసు. నువ్వు ఎవరివి నాకు చెప్పడానికి, అయినా నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అని కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. గబగబా జ్యోత్స్న కారు ఎక్కిన దాసు జ్యోత్స్న ని కూడా కారు ఎక్కమని చెప్తాడు.

నా కార్ నువ్వు ఎందుకు ఎక్కావు అని జ్యోత్స్న అడుగుతుంది కానీ దాసు గట్టిగా మాట్లాడటంతో కారు ఎక్కి కూర్చుంటుంది. మరోవైపు సైకిల్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు దీప, అనసూయ. ఈ సైకిల్ చూస్తే చంటిది ఎంతో సంతోష పడిపోతుంది అంటుంది అనసూయ. అవును ఇకమీదట మనకి అన్ని సంతోషాలే కష్టాలన్నీ పోయాయి అంటుంది దీప. అంతలోనే అక్కడికి ఒక స్వామీజీ వచ్చి కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి అంటాడు. అనసూయ, దీప ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.

నీకు తెలిసిన నిజం నువ్వు చెప్పడం లేదు అని అనసూయతో అంటాడు స్వామీజీ. కంగారుపడుతుంది అనసూయ. తర్వాత దీప తో మాట్లాడుతూ అయిన వాళ్ళ మధ్యలో అనాధగా బ్రతుకుతున్నావు అని చెప్తాడు స్వామీజీ. మా అత్తయ్య నాకేం చెప్పడం లేదు అని అడుగుతుంది దీప. కానీ ఏమీ చెప్పకుండా కష్టాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు స్వామీజీ. అప్పుడు దీప అనసూయ తో మాట్లాడుతూ నా దగ్గర ఏం నిజం దాస్తున్నావు అని అడుగుతుంది.

Karthika Deepam 2 Serial September 2nd 2024 Episode Number 139 Here is full story

వాడేదో మాట్లాడితే నన్ను నిలదీస్తావేంటి అంటుంది అనసూయ. లేదు నువ్వు కోర్టులో కూడా నా తమ్ముడు పెద్ద తప్పు చేశాడు అన్నావు, గుళ్లో స్వామి కూడా నీ తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు అని చెప్పారు అందుకే కాకులు పిండం కూడా ముట్టుకోలేదు అన్నారు, నిజంగానే కాకులు పిండం ముట్టుకోలేదు అంటే నా తల్లిదండ్రులు వేరే ఉన్నారా అని అడుగుతుంది దీప. నీ మొహం నువ్వు నా తమ్ముడు కూతురివే, నీ తల్లి అంబుజ వల్లే అని దీప ని మభ్యపెట్టి ఆమెకి నిజం చెప్పకుండా దాచేస్తుంది అనసూయ.

నాకు కష్టాలు రాబోతున్నాయి అని స్వామి చెప్పారు ఏ రూపంలో రాబోతున్నాయో అనుకుంటుంది దీప. మరోవైపు కారులో వెళ్తున్న జ్యోత్స్న ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని దాసుని అడుగుతుంది. కధ మొదలైన దగ్గరికి అని చెప్పి ఒక హాస్పిటల్ కి తీసుకు వస్తాడు దాసు. తనతోపాటు రమ్మని ఒక కిటికీ దగ్గరికి తీసుకువెల్లి ఇక్కడే ఇద్దరు పిల్లల జీవితాలు తారుమారయ్యాయి అంటూ ఒక రూమ్ కి తీసుకు వెళ్తాడు.

ఇక్కడే ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలకు దూరమయ్యారు అంటాడు దాసు. ఏం మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న. ఇది తెలియాలంటే నీకు ఒక కథ తెలియాలి అంటాడు దాసు. నీ చెత్త కధలు వినటానికి నా దగ్గర టైం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెనకే వచ్చిన దాసు ఆమెకి తన జన్మ రహస్యం చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న, నువ్వు నా తండ్రి ఏమిటి అంటూ అసహ్యించుకుంటుంది. నిన్ను మార్చేసింది మరెవరో కాదు మా అమ్మ అని దాసు చెప్పటంతో మరింత షాక్ అవుతుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X