Karthika Deepam September 3rd Episode: సమస్యల వలయంలో కార్తీక్.. ఆ భయంతో జ్యోత్స్న!
దాసు పారిజాతం కొడుకని తెలిసి షాక్ అవుతుంది దీప. తర్వాత దాసు పారిజాతం కొడుకని తెలిసినా కార్తీక్ కూడా షాక్ అవుతాడు. రాఖీ కట్టిన జ్యోత్స్నకి కాశి డబ్బులు ఇవ్వబోతే అతడిని అవమానించేలాగా మాట్లాడుతుంది జ్యోత్స్న. తనకోసం కాఫీ తెచ్చిన సుమిత్రతో మీ పెంపకం బాగోలేదని మొహం మీదే చెప్తాడు దాసు. తన పెళ్లి కాశి తో జరిపించకపోతే చనిపోతానని కార్తీక్ ని బెదిరిస్తుంది స్వప్న. మరోవైపు కూతురికి ఆమె జన్మ రహస్యం చెప్తాడు దాసు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 3 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 139వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నువ్వు నా కూతురివి అని జరిగినదంతా జ్యోత్స్న తో చెప్తాడు దాసు. నేను నమ్మను, నేను నీ కూతురిని ఏమిటి అని అసహ్యించుకుంటుంది జ్యోత్స్న. నిన్ను ఇంతకాలం కలవని మనిషి నిన్ను ఎక్కడ తీసుకొచ్చి ఎందుకు నిజం చెప్తాడు నువ్వే ఆలోచించు అయినా దీనంతటికి సాక్ష్యం మా అమ్మ పారిజాతం. కావాలంటే వెళ్లి అడుగు అంటూ తన ప్రేమ, పెళ్లి వ్యవహారం అంతా చెప్తాడు దాసు. కాశీ నీ సొంత తమ్ముడు అని కూడా చెప్తాడు.

నువ్వు నేను అనుకున్నట్లుగా పెరిగితే ఈ నిజం చెప్పే వాడిని కాదు కానీ నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తున్నావు అందుకే నువ్వు నాకు నచ్చలేదు, నేల మీద నడు నలుగురితోని కలు అని ఆమెకి, బుద్ధులు చెప్తాడు, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నిజం బయటపడిన రోజు ఈ దాసు కూతురుగానే మిగిలిపోతావు, ఈ నిజం ఎవరికీ తెలియదు అంటాడు దాసు. కానీ ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అంటుంది జ్యోత్స్న. వెళ్లి మా అమ్మ పారిజాతాన్ని అడుగు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దాసు. మరోవైపు సైకిల్ తీసుకొని ఇంటికి వస్తారు అనసూయ, దీప.
ఆలోచనలో ఉన్న దీపని చూసి ఇది ఇంకా సన్యాసి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నట్లుగా ఉంది అనుకుంటుంది అనసూయ. తర్వాత శౌర్య సుమిత్ర గారి ఇంట్లో ఉందేమో తీసుకొని రా అని కోడలితో చెప్తుంది. దీప ఆ ఇంటికి వెళ్తుండగా అప్పుడే కార్తీక్ శౌర్య ని తీసుకొని ఇంటికి వస్తాడు. దీప నానమ్మ సైకిల్ కొంది అని చెప్పటంతో ఆనందంగా అటువైపు పరుగులు తీస్తుంది శౌర్య. అప్పుడు కార్తీక్, దీప దాసు వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. నాక్కూడా కంగారుగా ఉంది బాబు ఇప్పుడు దాసు బాబాయ్ కొడుకుతో స్వప్న పెళ్ళంటే కచ్చితంగా మీ అమ్మగారికి నిజం తెలుస్తుంది.
అందుకే వాళ్ళిద్దర్నీ కొద్దిరోజులు దూరంగా ఉండమనండి ఈ లోపు ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అంటుంది దీప. ఆగి ఆలోచించే సమయం లేదు మా నాన్న మా ఆఫీస్ లో పనిచేసే అబ్బాయిని తీసుకువచ్చి స్వప్న తో పెళ్లి చేయాలనుకుంటున్నాడంట స్వప్న ఫోన్ చేసి చెప్పింది. తను ప్రాణాలతో ఉండాలంటే ఆ పెళ్లి జరగకూడదు నిజం తెలిస్తే మా అమ్మ ప్రాణాలతో ఉండదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు కార్తీక్.
మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది మీరేమీ కంగారు పడకండి ఎట్టి పరిస్థితులలోని మీ అమ్మగారికి ఈ విషయం తెలియనివ్వకండి అంటుంది దీప. నాకేం చేయాలో అర్థం కావడం లేదు ముందు నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు అనసూయ మనవరాల్ని ఆడిస్తూ ఏమైనా కావాలంటే నన్నే అడుగు అమ్మని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తుంది, మనసులో చంటి దానికి గుండె జబ్బు త్వరగా తగ్గిపోతే బాగున్ను అనుకుంటుంది.
మరోవైపు కోపంగా ఇంటికి వచ్చిన జ్యోత్స్న ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా భయపడుతుంది, ఈ ఇల్లు నాది కాదా, నేను ఇంటి వారసురాల్ని కాదా అని ఆలోచనలో పడుతుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి చాలా కంగారుగా ఉంది, నా కొడుకు ఏం మాట్లాడాడు, వాడిని బాధ పెట్టినట్లుగా నువ్వేమీ మాట్లాడలేదు కదా అంటుంది పారిజాతం. జ్యోత్స్న మాటలలో పారిజాతం సొంత మనవరాలు తానే అన్న విషయం జ్యోత్స్న కి తెలిసిందని గ్రహిస్తుంది.
కంగారు పడుతూ జ్యోత్స్న చేయి పట్టుకొని నన్ను క్షమించు నా స్వార్థం కోసమే ఇదంతా చేశాను అంటుంది. నువ్వు మంచి పనే చేశావు గ్రానీ,ఒక పనిమనిషి కూతుర్ని తీసుకువచ్చి ఈ ఇంటికి వారసురాలిని చేసావు లేదంటే నేను ఒక పనిమనిషి కూతురుగా బ్రతకవలసి వచ్చేది అని పారిజాతాన్ని మెచ్చుకుంటుంది జ్యోత్స్న. అయినా ఇదంతా నీకు ఎవరు చెప్పారు అంటుంది పారిజాతం. ఆ విషయం నన్ను అడుగు అనేసరికి వెనక్కి తిరిగి చూస్తారు జ్యోత్స్న, పారిజాతం అక్కడ దాసు ఉంటాడు.
నేనే చెప్పాను అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు దాసు.నువ్వు చెప్పడమేమిటి అంటుంది పారిజాతం. మళ్లీ తనే మాట్లాడుతూ మనల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే కొంప కొల్లేరు అవుతుంది అని జ్యోత్స్నని ఇంట్లోకి పంపించేస్తుంది తర్వాత దాసుని పక్కకు తీసుకువెళ్లి పిల్లల్ని మార్చేసిన విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఆరోజు నేను అక్కడే ఉన్నాను అని జరిగిందంతా చెప్తాడు దాసు. ఆ మాటలకి కంగారు పడిపోతుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











