Karthika Deepam september 4th episode: కార్తీక్‌తో జ్యోత్న్స పెళ్లి..దీపను ఇంట్లోంచి గెంటేయాలి..పారిజాతం కుట్ర

దాసు పారిజాతం కొడుకని తెలిసి కార్తీక్ కూడా షాక్ అవుతాడు. రాఖీ కట్టిన జ్యోత్స్నకి కాశి డబ్బులు ఇవ్వబోతే అతడిని అవమానించేలాగా మాట్లాడుతుంది జ్యోత్స్న. తనకోసం కాఫీ తెచ్చిన సుమిత్రతో మీ పెంపకం బాగోలేదని మొహం మీదే చెప్తాడు దాసు. తన పెళ్లి కాశి తో జరిపించకపోతే చనిపోతానని కార్తీక్ ని బెదిరిస్తుంది స్వప్న. మరోవైపు కూతురికి ఆమె జన్మ రహస్యం చెప్తాడు దాసు. తాను విన్నది నమ్మలేక పారిజాతం దగ్గరికి వచ్చి తాను విన్నది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 4 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 141వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

పారిజాతం పిల్లల్ని మార్చేసిన సంఘటన తర్వాత పారిజాతం సైదుల్ని చంపించిన సంఘటన అన్ని చెప్తాడు దాసు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు, అయినా ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని అడుగుతుంది పారిజాతం. ఒక నిజాన్ని ఇన్ని చావులతో పూడ్చిన తర్వాత ఆ నిజం చూసినవాడికి చెప్పే ధైర్యం ఉంటుందా అని అడుగుతాడు దాసు. కన్న కొడుక్కి హాని తల పెట్టే అంత కసాయి దాన్ని కాదు, నిజానికి ఇవన్నీ నీకోసమే చేశాను అంటుంది పారిజాతం. కానీ ఇన్ని ప్రాణాలు తీయడం పాపం అంటాడు దాసు.

Karthika Deepam 2 Serial September 4th 2024 Episode Number 141 Here is full story

ఈ నిజం నాకు చెప్పకుండా జ్యోత్స్న కు ఎందుకు చెప్పావు అంటుంది పారిజాతం. నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా కూతుర్ని చూసి వెళ్ళిపోదామని కానీ తను పెరిగిన విధానం నాకు నచ్చలేదు, నిజం చెప్తే అయినా తను నేల మీద నడుస్తుందని నిజం చెప్పాను నీకు ఇంకొక నిజం కూడా చెప్పాలి నువ్వు చంపేయమన్న దశరథ్ అన్నయ్య బిడ్డని సైదులు చంపలేదు, ఆ బిడ్డ బ్రతికే ఉంది అంటాడు దాసు. ఆ మాటలకి షాక్ అవుతుంది పారిజాతం. ఆ బిడ్డని వెతికి పట్టుకుంటాను తనకి నిజం చెప్తాను అంటాడు దాసు.

అలా చేస్తే నీ కూతురు భవిష్యత్తు పాడైపోతుంది, నన్ను ఆ శివ నారాయణ బ్రతకనివ్వడు అంటుంది పారిజాతం. నువ్వు నా కూతుర్ని పొగరుబోతు లాగా పెంచావు అందుకే తనకి నిజం చెప్పాను ఇప్పుడైనా నేల మీద నడుస్తుంది అంటాడు దాసు. ఒక్క నిజం చెప్పి వందల కోట్ల ఆస్తికి నీ కూతుర్ని దూరం చేయకు అంటుంది పారిజాతం. నా కూతురు డబ్బున్న మనిషిగా కాదు, మనసున్న మనిషిలాగ పెరగాలి. ఆ దీప ని చూడు ఎంత పద్ధతిగా ఉంటుందో, తను మనుషుల్ని దగ్గర చేసుకుంటుంది.

Karthika Deepam 2 Serial September 4th 2024 Episode Number 141 Here is full story

ఈ ఇంటి అసలు వారసురాలు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆ దీపలా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను, అసలు వారసురాలిని పట్టుకొని ఆమెకి నిజం చెప్తాను అంటూ తల్లి పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు దాసు. దాసు ఇన్ని నిజాలు నా దగ్గర దాస్తాడు అనుకోలేదు, నేను ఎవరికోసమైతే ఇదంతా చేశానో వాడే నాకు రివర్స్ అవుతున్నాడు నిజం తెలిసేలోపు కార్తీక్ జ్యోత్స కి పెళ్లి చేసేయాలి, తర్వాత దీపని ఇంట్లోంచి పంపించేయాలి అనుకుంటుంది పారిజాతం. మరోవైపు స్వప్న కార్తీక్ కి ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి మా ఇంటికి వచ్చేయ్ అంటుంది.

సమస్య మీ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏం మాట్లాడుకుంటాము అంటాడు కార్తీక్. సరే అయితే రెస్టారెంట్ కి వచ్చేయ్, వచ్చేటప్పుడు దీప ని కూడా తీసుకురా అంటుంది స్వప్న. తను ఎందుకు, తనని ఇబ్బంది పెట్టవద్దు అంటాడు కార్తీక్. అయితే మనమే తన ఇంటికి వెళ్లి అక్కడే మాట్లాడదాం అని కార్తీక్ చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. అన్నింటికీ కంగారే, ఫోన్ పెట్టేసింది. స్వప్న దీప ఇంట్లో ఉన్న సమయంలో నాన్న అక్కడికి వస్తే ఏం జరుగుతుందో అని కంగారు పడతాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial September 4th 2024 Episode Number 141 Here is full story

మరోవైపు జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ ఇంతకాలం ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేసావు రేపు నిజం తెలిసి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తే నా పరిస్థితి ఏమిటి? నేను ఈ రిచ్ లైఫ్ కి అలవాటు పడ్డాను, పేదరాలిగా బ్రతకలేను అందుకే ఈ నిజం ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు నేను త్వరగా బావని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి కూతురుగా కాకపోయినా కార్తీక్ భార్యగా నాకు మంచి హోదా ఉంటుంది అంటుంది జ్యోత్స్న. అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది కానీ ఆస్తి నీ పేరు మీద వచ్చిన తర్వాత మీ నాన్నకి తమ్ముడికి సాయం చేయాలి అంటుంది పారిజాతం.

నువ్వు కొత్త బంధాలు పెట్టకు, వాళ్ళు ఎప్పటికీ నా వాళ్ళు కాదు కానీ నువ్వు నాకోసం ఇంత చేశావు కాబట్టి వాళ్ళకి సాయం చేస్తాను, బయటికి ఇలా మాట్లాడుతున్నాను కానీ నిజం తెలిసింది దగ్గర నుంచి చాలా కంగారుగా ఉంది నన్ను కాసేపు వంటరిగా వదిలేయ్ అంటుంది జ్యోత్స్న. తర్వాత ఈ ఇల్లు నాదే అంటూ ఇల్లంతా చూస్తూ వచ్చి హాల్లో కూర్చుంటుంది జ్యోత్స్న. ఆమెకి జ్యూస్ ఇస్తుంది సుమిత్ర. నేను నీ కూతురిని కాదు అని తెలిసినా కూడా ఇలాగే ప్రేమిస్తావా అని మనసులో అనుకుంటుంది జోత్స్న.

Karthika Deepam 2 Serial September 4th 2024 Episode Number 141 Here is full story

అంతలోనే దశరథ్ వచ్చి ఈ కారు నీకు బుక్ చేస్తున్నాను నీకు నచ్చిందా అని అడుగుతాడు. మీ ఇష్టమే అంటుంది జ్యోత్స్న. అదేంటి ఎప్పుడూ నా ఇష్టం అంటావు ఇప్పుడు మీ ఇష్టం అంటున్నావు అని అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తే నిజం తెలిసిన రోజు నన్ను గెంటయ్యటానికి మీరు ఏ మాత్రం ఆలోచించరు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. బయటికి మాత్రం ఆ కారు నాకు నచ్చింది అమ్మ అందుకే అలా చెప్పాను అనుకుంటుంది.

మనసులో ఈ ఆస్తి మాత్రమే కాదు ఈ తల్లిదండ్రులుగా కూడా నాకు మీరే కావాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయి ఇల్లంతా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. కూతురు ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన సుమిత్ర ఈరోజు జ్యోత్స్న కొత్తగా కనిపిస్తుంది అనుకుంటుంది. మరోవైపు ఇల్లంతా చూస్తూ ఇంటి బయటకు వచ్చిన జ్యోత్స్న ఇంటి వైపు చూస్తూ ఈ ఇల్లు నాది,ఈ ఇంటికి వారసురాల్ని నేను అనుకుంటూ వెనకడుగు వేస్తూ ఉంటుంది. అప్పుడే దీప చూసుకోకుండా లోపలికి వస్తూ ఆమెకి డాష్ ఇస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X