Karthika Deepam september 5th episode: పారిజాతం తిక్క కుదిర్చిన శివ నారాయణ.. తీవ్ర ఆందోళనలో జ్యోత్స్న!

తనకోసం కాఫీ తెచ్చిన సుమిత్రతో మీ పెంపకం బాగోలేదని మొహం మీదే చెప్తాడు దాసు. తన పెళ్లి కాశి తో జరిపించకపోతే చనిపోతానని కార్తీక్ ని బెదిరిస్తుంది స్వప్న. మరోవైపు కూతురికి ఆమె జన్మ రహస్యం చెప్తాడు దాసు. తాను విన్నది నమ్మలేక పారిజాతం దగ్గరికి వచ్చి తాను విన్నది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న. తనకు తెలిసిన నిజం నలుగురికి తెలిసేలోపు కార్తీక్ తో పెళ్లి జరిగిపోవాలి అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 5 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 141వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఈ ఇంటికి వారసురాలిని నేనే అనుకుంటూ ఇల్లు చూస్తూ వెనక్కి నడుస్తూ వస్తుంది జ్యోత్స్న. అదే సమయంలో అటుగా వస్తున్న దీప కూడా చూసుకోక పోవడంతో ఇద్దరూ డాష్ ఇచ్చుకుంటారు. తేరుకున్న దీప వెనక్కి నడుస్తున్నావేంటి అని అడుగుతుంది, నా ఇల్లు నా ఇష్టం ఎలాగైనా నడుస్తాను నువ్వెందుకు అడ్డగా వచ్చావు అంటుంది జ్యోత్స్న. నేను కరెక్ట్ గానే వచ్చాను అంటూ కంగారుపడుతున్న జ్యోత్స్న ని చూసి ఎందుకు కంగారు పడుతున్నావు అంటుంది. నేను ఎందుకు కంగారు పడతాను అంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial September 5th 2024 Episode Number 142 Here is full story

కార్తీక్ బాబు పెళ్లి గురించి మాట్లాడారు కానీ ఇంకా ముహూర్తాల గురించి ఇంట్లో ఎవరూ మాట్లాడటం లేదు కదా అంటుందిదీప. మంచి విషయం గుర్తు చేశావు ముందు నా పెళ్లి బావతో అవ్వాలి అనుకుంటుంది జ్యోత్స్న. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటుంది దీప. అన్ని నీతో చెప్పాలా అంటూ దీపని కసురుకొని అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత దీప ఎందుకలా మాట్లాడింది తను నాకు ఏమైనా హింటిస్తుందా అనుకుంటుంది జ్యోత్స్న.

మరోవైపు దీప ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ స్వప్న ఉంటుంది. నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది దీప. నువ్వు జ్యోత్స్న తో మాట్లాడుతున్నప్పుడు వచ్చాను, డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఇక్కడ కూర్చున్నాను అంటుంది. ఏమిటి అంత అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు అంటుంది దీప. తన పెళ్లి విషయం చెప్తుంది స్వప్న. అదే సమయంలో కార్తీక్ ఇంటికి రావడం గమనించిన జ్యోత్స్న అతడిని రిసీవ్ చేసుకోవడానికి వెళుతుంది కానీ అంతలోనే కార్తీక్ దీప రూమ్ వైపు వెళ్తాడు.

Karthika Deepam 2 Serial September 5th 2024 Episode Number 142 Here is full story

స్వప్న మాటలు ఆలకించి ఈ పెళ్లి జరగడం నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు అంటాడు కార్తీక్. ఎందుకు జరగదు నువ్వు కాశీకి బావవి అని తెలిస్తే నాకు అన్నయ్య కిందే లెక్క, అలాంటిది కాశి నీకు బంధువు అంటే మా పేరెంట్స్ ఒప్పుకుంటారు. నువ్వు దీప వచ్చి నా పేరెంట్స్ తో మాట్లాడండి అంటుంది స్వప్న. ఇప్పటివరకు మన మధ్య ఉన్న దూరం ఎంతో తెలియదు కానీ ఇప్పుడు నువ్వు నాకు కావలసిన మనిషివి, నువ్వు అనుకున్నట్లుగానే ఈ పెళ్లి జరుగుతుంది అంటాడు కార్తీక్.

కార్తీక్ దీప ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనుకుని వెళ్లిన జ్యోత్స్న ఆ మాటలు విని లోపల స్వప్న ఉందన్న విషయం తెలియక దీప, కార్తీకే పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కార్తీక్ మాటలకి ఆనందించిన స్వప్న ఇంట్లో ఏం జరిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆలోచనలో ఉన్న దీప తో మీకున్న సమస్యలు చాలు ఈ విషయం గురించి ఆలోచించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

నా కష్టాల్లో అంత సాయం చేసిన మీరు కష్టాల్లో ఉంటే ఒంటరిగా ఎలా వదిలేస్తారు అనుకుంటుంది దీప. మరోవైపు తనకి కాఫీ ఇచ్చిన పారిజాతం మొహం చూసిన శివ నారాయణ మోహం నిండా ఏంటా మచ్చలు అని అడుగుతాడు. దాసు గురించి ఆలోచనలో ఉన్న పారిజాతం దగ్గరికి కొత్త సైకిల్ తీసుకొని వచ్చిన సౌర్య ఆడుకుందాం రమ్మని పారిజాతాన్ని పిలుస్తుంది.ఆమె రాను అని చెప్పటంతో అమ్మ వస్తుందేమో పిలుస్తాను అని సైకిల్ అక్కడే వదిలేసి వెళుతుంది శౌర్య.

Karthika Deepam 2 Serial September 5th 2024 Episode Number 142 Here is full story

వాళ్ల మీద కోపంతో ఆ సైకిల్ బ్రేక్స్ బోల్ట్ తీసిపారేస్తుంది పారిజాతం. అప్పుడు అంటుకున్న ఆయిల్ మరకలు అయి ఉంటాయి అనుకుంటుంది పారిజాతం. కానీ భర్తకు ఏమి చెప్పకుండా ఏదో అంటుకొని ఉంటుంది అని చెప్పి బయటకి తన కాఫీ తీసుకొని వచ్చేస్తుంది. తర్వాత దాసు గురించి ఆలోచిస్తూ కాఫీ తాగుతూ ఉన్న పారిజాతాన్ని బ్రేకుల్లేని సైకిల్ తో గుద్దేస్తుంది శౌర్య. వేడి కాఫీ మూతికి తగలడంతో గోలపెడుతుంది పారిజాతం.

అప్పుడే బయటకు వచ్చిన శివనారాయణ ఏం జరిగింది అంటే జరిగినదంతా చెప్తుంది శౌర్య. బ్రేకులు వెయ్యొచ్చు కదా అని శివ నారాయణ అంటే బ్రేకులు వేసాను కానీ పట్టలేదు అంటుంది శౌర్య. సైకిల్ వైపు చూసిన శివ నారాయణ ఎవరో తీసేసినట్లున్నారు అని కోపంగా భార్య వైపు చూసి నేను బోల్టు అతికించి ఉంచుతాను నువ్వు వెళ్ళు అని శౌర్యని పంపించేస్తాడు తర్వాత మర్యాదగా నువ్వు బోల్టు ఆ సైకిల్ కి తగిలించు అని ఆర్డర్ వేస్తాడు.

మొగుడ్ని తిట్టుకుంటూ ఆ బోల్టు వెతికి తీసుకువచ్చి సైకిల్ కి బిగిస్తుంది పారిజాతం. చిన్నపిల్ల మీద నీ ప్రతాపం చూపించడం ఏంటి, వయసుకు తగ్గ పనులు చేయవు అని భార్యని అసహ్యించుకొని వెళ్ళిపోతాడు శివ నారాయణ. ఈ మాత్రానికే ఇంత హడావుడి ఏం చేస్తున్నాడు రేపటి రోజున మనవరాలిని మార్చేశాను అని తెలిస్తే ఇదే సైకిల్ తో నన్ను చిదగ్గొడతాడు అనుకొని కంగారుపడుతుంది పారిజాతం. మరోవైపు ఇందాక తను విన్న మాటలు తలుచుకొని దీపని తిట్టుకుంటూ ఉంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial September 5th 2024 Episode Number 142 Here is full story

అంతలోనే దీప ఇంటికి వచ్చిన నర్సింహ డబ్బులు, ఇల్లు నువ్వు కోడలు పేరు మీద రాసేసావంట కదా అవి నా పేరు మీద రాయు అని తల్లితో గొడవ పడతాడు. అమ్మని నీకు నచ్చినట్లుగా మార్చేసుకున్నావు అని దీపపై కోప్పడతాడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు దీప, అనసూయ. డబ్బు నా చేతిలో పెడితే వెళ్ళిపోతాను అంటాడు నర్సింహ.వీడి పని ఇలా కాదు అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళుతుంది అనసూయ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X