Karthika Deepam september 6th episode: నర్సింహాని రెచ్చగొట్టిన జ్యోత్స్న.. మనవరాలు పనికి ఆనందంలో పారిజాతం!
తన పెళ్లి కాశి తో జరిపించకపోతే చనిపోతానని కార్తీక్ ని బెదిరిస్తుంది స్వప్న. మరోవైపు కూతురికి ఆమె జన్మ రహస్యం చెప్తాడు దాసు. తాను విన్నది నమ్మలేక పారిజాతం దగ్గరికి వచ్చి తాను విన్నది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న. తనకు తెలిసిన నిజం నలుగురికి తెలిసేలోపు కార్తీక్ తో పెళ్లి జరిగిపోవాలి అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే చాటుగా విన్న జ్యోత్స్న వాళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు అని అపోహపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 6 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 142వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్న నర్సింహ మీద కత్తిపీట ఎత్తి బయటికి పొమ్మని, దీప జోలికి రావద్దని బెదిరిస్తుంది అనసూయ. నేను అడిగింది ఇవ్వకపోతే తల్లి, పెళ్ళాం అని కూడా చూడను చంపి పారేస్తాను అంటాడు నర్సింహా. సంబంధం తెగిపోయింది తెగిపోయినట్లే ఉండు హద్దు దాటి ప్రవర్తిస్తే సమాధానం గట్టిగా చెప్పాల్సి ఉంటుంది, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి పో అంటుంది దీప. ఇల్లు,పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఇవ్వకపోతే మీ ఇద్దరి అంతు చూస్తాను అని అనసూయ, దీపని బెదిరిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. ఇదంతా శౌర్య చాటు నుంచి చూస్తుంది, నర్సింహా వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి దీపని భయంతో హత్తుకుంటుంది. తర్వాత రోడ్డు మీద నడుస్తున్న నర్సింహని కలుస్తుంది జ్యోత్స్న.

వాళ్లు బెదిరిస్తే బెదిరిపోయి వచ్చావు, నీ పెళ్ళాం నిన్ను కాదని వేరే ఎవరితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావు, నువ్వు ఏమి చేయలేకపోయావు అంటూ నర్సింహాని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నేను తలుచుకుంటే దీప ఏమవుతుందో తెలుసా అని పౌరుషంగా మాట్లాడుతాడు నర్సింహ. నీ వల్ల ఏమీ కాదు అని కోర్టులోనే తెలిసింది అంటుంది జ్యోత్స్న. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు, ఇప్పుడే వెళ్లి దాన్ని చంపేస్తాను అంటాడు నర్సింహా.
ఆ పని నీవల్ల అవుతుందా అంటుంది జ్యోత్స్న. ఎందుకు కాదు, అలా జరిగితే నా కూతురు నా దగ్గరికి వస్తుంది, నా రెండో పెళ్ళాం కూడా నా మాట వింటుంది అయితే అందుకు మీ సాయం కావాలి, ఏదైనా కేస్ అయితే మీరు సాయం చేస్తారా అంటాడు నర్సింహ. నేను ఇరుక్కుంటే అంటుంది జ్యోత్స్న, చచ్చినా మీ పేరు చెప్పను అంటాడు నర్సింహ. దాంతో ఓకే అంటుంది జ్యోత్స్న. మరోవైపు నర్సింహని చూసిన శౌర్య మళ్లీ గుండె నొప్పి తో బాధపడుతుంది.

అనసూయ టాబ్లెట్ తీసుకురమ్మని దీపతో చెప్తుంది కానీ ఈ టైంలో టాబ్లెట్ వెయ్యట్లేదు అంటుంది దీప. నొప్పి వచ్చినప్పుడు కార్తీక్ బాబు టాబ్లెట్ వేయమన్నాడు అని అనసూయ చెప్పడంతో టాబ్లెట్ వేస్తుంది దీప. తర్వాత ఇంటి కోసం డబ్బు కోసం నర్సింహ ఇంకెంత ఇబ్బంది పెడతాడో అని భయపడుతుంది దీప. మరోవైపు డబ్బు ఇవ్వకపోతే ఆమ్లెట్ వేయను అన్న శోభతో ఒక్కరోజు ఆగు నీ చేతిలో పాతిక లక్షలు పెడతాను అంటాడు నర్సింహ. మందేస్తే ఇంతకంటే డబ్బా కబుర్లు నేను చెప్తాను అంటుంది శోభ. ఇన్ని రోజులు వేరు, ఈరోజు వేరు.
ఇన్నాళ్లు ఏం చేయాలో తెలియక వాళ్ళ కాళ్లు వీళ్ళ కాళ్లు పట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలిసింది. రేపు ఒక్కరోజు ఆగు నీ మొగుడికి నువ్వంటే ఎంత ప్రేమ చూపిస్తానో అంటాడు నర్సింహ. ఏం చేస్తావు అంటుంది శోభ. చెప్పను కానీ నేను చేయబోయే పనితో పని ఇద్దరి జాతకాలు మారిపోతాయి అంటాడు నర్సింహా. ఏం చేయబోతున్నాడు అనుకుంటుంది శోభ. మరోవైపు జ్యోత్స్న రమ్మంది అంటూ కాంచన, కార్తీక్ దశరథ్ ఇంటికి వస్తారు. ఎందుకు రమ్మన్నావు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు.

అప్పుడే పంతులుగారు కూడా రావటంతో బావ పెళ్లికి ముహూర్తం పెట్టమని ఎప్పుడో చెప్పాడు కానీ మీరు అందరూ మర్చిపోయారు అందుకే నేను పంతులు గారిని పిలిచాను అంటుంది. పెళ్లికూతురు తొందర పడుతుంది అని అందరూ నవ్వుకుంటారు. తర్వాత పెళ్లి ముహూర్తం చూడమంటే ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది అంటాడుపంతులు. అతను ఇంటికి రావడానికి ముందే అదే రోజు ముహూర్తం పెట్టమని జ్యోత్స్న చెప్పటంతో ఆ ముహూర్తమే పెడతాడు పంతులు.
అందరూ సమయం లేదు అని కంగారుపడుతూ ఉంటే నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయినా పర్వాలేదు అంటుంది జ్యోత్స్న. మనసులో నేను తొందరపడకపోతే వాళ్ళిద్దరూ తొందర పడతారు అని దీప, కార్తీక్ గురించి అనుకుంటుంది జ్యోత్స్న. మనవరాలు పెళ్ళికి తొందర పడుతుంది అని నవ్వుతాడు సీతారామయ్య. అదే ముహూర్తాన్ని ఖాయం చేయమంటారు. తర్వాత కార్తీక్ అక్కడ నుంచి బయటకు వస్తుంటే అక్కడ దీనంగా కూర్చున్న శౌర్య కనిపిస్తుంది.

ఏం జరిగింది అంటే బూచోడొచ్చాడు అని జరిగింది చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉండు అని దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో వినటానికి అని జ్యోత్స్న కూడా వెనకాతల వెళుతుంది. దీప నర్సింహ వచ్చిన సంగతి చెప్తుంది. పోలీస్ కేసు పెడదాం అంటాడు కార్తీక్, వద్దు అంటుంది దీప. నువ్వు వద్దన్నా మా బావ వినడు, నువ్వంటే మా బావకి అంత గౌరవం అంటూ తన పెళ్లి విషయం గురించి కూడా చెప్తుంది. నేను మాట్లాడుతున్న విషయం వేరు అని కోపంగా అంటాడు కార్తీక్.
విషయం ఏదైనా సంతోషకరమైన విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పుకోవాలి అంటుంది జ్యోత్స్న. చాలా మంచి మాట చెప్పావు, చాలా సంతోషం అంటుంది దీప. కానీ నువ్వు పెళ్లికి రావు, ఆ నర్సింహ నిన్ను అంతవరకు బ్రతకనివ్వడు అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. ఆలోచనలో ఉన్న జ్యోత్స్న ని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది దీప. పెళ్లి ఎల్లుండే కదా నీకు రావడం వీలవుతుందో లేదో అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











