Karthika Deepam September 9th Episode: ప్రాణాపాయ స్థితిలో కార్తీక్.. షాక్ లో కుటుంబ సభ్యులు!

తనకు తెలిసిన నిజం నలుగురికి తెలిసేలోపు కార్తీక్ తో పెళ్లి జరిగిపోవాలి అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే చాటుగా విన్న జ్యోత్స్న వాళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు అని అపోహపడుతుంది. పంతులు తో ముందే మాట్లాడి కుటుంబ సభ్యులందరి ముందు పెళ్లి ముహూర్తం త్వరగా జరిగేలా పెట్టిస్తుంది జ్యోత్స్న. మరోవైపు వంట చేయడం కోసం ఒక ఇంటికి వెళ్తున్న దీపని దారిలో కనిపించిన కార్తీక్ తన కారులో డ్రాప్ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 9 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 144వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఒక్కతే కూర్చుని కూరలు కోసుకుంటున్న దీప ఎవరు ఉండరు అని తెలిస్తే సరదాగా శౌర్యని అత్తయ్యని కూడా తీసుకొని వచ్చేదాన్ని అనుకుంటుంది. వాళ్ళందరూ వస్తే నా పని ఎలా అవుతుంది అంటూ అక్కడికి వస్తాడు నర్సింహ. షాక్ అయిన దీపని చూస్తూ వీడేమిటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నావా అంటాడు. నన్ను నీడలా వెంటాడుతున్న నువ్వు నేను ఎక్కడికి వెళ్తున్నానో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు నేను పని చేసుకుంటున్నాను వచ్చే నాలుగు డబ్బులు రానివ్వకుండా చేయొద్దు అంటుంది దీప. సరే నీతో నాకు మాటలు ఎందుకు, ఆ ఇల్లు డబ్బు నాకు ఇచ్చేయ్ నేను ఏమి చేయకుండా వదిలేస్తాను అంటాడు నర్సింహా. అది నా తండ్రి కష్టార్జితం నా కూతురికి ఇవ్వటానికి అది తప్పితే వేరే ఏమీ లేదు అంటుంది దీప. అయితే నిన్ను చంపేస్తాను అంటాడు నర్సింహా.

Karthika Deepam 2 Serial Today s Episode 144 of September 9th 2024 Here is full story

చుట్టూ చూస్తున్న దీప తో నీకు ఇంకా అర్ధం కాలేదా, ఇక్కడ ఏ కార్యక్రమం జరగడం లేదు నిన్ను చంపటానికి ఈ సెట్ అప్ అంతా అంటూ ఆమె మీదకి కత్తి దూస్తాడు, ఇప్పటికైనా ఇదంతా వదిలేయ్ అంటుంది దీప. అయినా వినిపించుకోకుండా ఆమె మీద అటాక్ చేస్తాడు అప్పుడే వచ్చిన కార్తీక్ దీప కి అడ్డుగా వెళ్లడం తో అతనికి కత్తిపోటు తగులుతుంది. దాన్ని చంపుదాము అనుకుంటే నువ్వు అడ్డుగా వచ్చావ్ ఏంటి అయినా నిన్ను కూడా చంపాల్సిందే కదా అంటూ మరొకసారి పొడుస్తాడు నర్సింహా. అప్పుడు దీప కత్తిపీట చూపించి అతడిని బెదిరించి అక్కడినుంచి పారిపోయేలాగా చేస్తుంది.

మరోవైపు శివరామయ్య ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుని చాలా రోజులైంది జ్యోత్స్న,కార్తీక్ కూడా ఉండి ఉంటే బాగుండేది అంటాడు శివ నారాయణ. ఇద్దరు బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు అని నవ్వుతుంది పారిజాతం. అదే సమయంలో దీప కార్తీక్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది.

Karthika Deepam 2 Serial Today s Episode 144 of September 9th 2024 Here is full story

డాక్టర్లు కార్తీక్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇదంతా నా వల్లే జరిగింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్పాలి అని ఏడుస్తుంది దీప. అప్పుడే కాంచన నుంచి ఫోన్ రావడంతో లోపల నుంచి సిస్టర్ ఫోన్ తీసుకొని వచ్చి పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్తుంది, ఏమని రాసి ఉంది అంటే అమ్మ అని రాసి ఉంది అంటుంది సిస్టర్. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి కార్తీక్ బాబు హాస్పిటల్ లో ఉన్నాడు నరసింహ పొడి చేశాడు త్వరగా రండి అని చెప్తుంది. మరోవైపు జోత్స్న ఫ్రెండ్ మాట్లాడుతూ మీ బావ ఇంకా రాలేదేమిటి అని జ్యోత్స్న ని అడుగుతుంది.

మా బావ మీద నీకు ఇంట్రెస్ట్ పెరిగినట్లు ఉంది అంటుంది జ్యోత్స్న. కాదు నీ మీదే ఇంట్రెస్ట్ తగ్గినట్లుగా ఉంది లేదంటే ఇంకా రాకపోవటం ఏమిటి అంటుంది ఆ ఫ్రెండ్. అప్పుడు జ్యోత్స్న కార్తీక్ కి ఫోన్ చేయటంతో దీప ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్తుంది. నర్సింహ తనతో ఉన్న మాటలు గుర్తు చేసుకుని అతడిని తిట్టుకుంటూ అక్కడినుంచి కంగారుగా బయలుదేరుతుంది జ్యోత్స్న. మరోవైపు హాస్పిటల్ కి చేరుకున్న కాంచన వాళ్ళు బాధపడుతూ అసలు ఏం జరిగింది అని దీప అని అడుగుతారు.

Karthika Deepam 2 Serial Today s Episode 144 of September 9th 2024 Here is full story

దీప జరిగిందంతా చెప్తుంది, జ్యోత్స్న కూడా అప్పుడే వస్తుంది, దశరథ్ అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయండి ఆ నర్సింహ ని వదిలిపెట్టేది లేదు అని శ్రీధర్ తో చెప్తాడు. అప్పుడే డాక్టర్ లోపలి నుంచి రావడంతో కార్తీక్ కండిషన్ గురించి అందరూ అడుగుతారు. కత్తిపోటు బలంగా తగలటం వల్ల అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్తాడు డాక్టర్. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X