Karthika Deepam September 10th Episode: జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం..దీపకి శ్రీధర్ స్ట్రాంగ్ వార్నింగ్
దీప, కార్తీక్ స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే చాటుగా విన్న జ్యోత్స్న వాళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు అని అపోహపడుతుంది. పంతులు తో ముందే మాట్లాడి కుటుంబ సభ్యులందరి ముందు పెళ్లి ముహూర్తం త్వరగా జరిగేలా పెట్టిస్తుంది జ్యోత్స్న. మరోవైపు వంట చేయడం కోసం ఒక ఇంటికి వెళ్తున్న దీపని దారిలో కనిపించిన కార్తీక్ తన కారులో డ్రాప్ చేస్తాడు. అక్కడ నర్సింహ దీప మీద హత్యాయత్నం చేస్తే ఆమెని కాపాడబోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 10 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 145వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఐ సి యు నుంచి బయటికి వచ్చిన డాక్టర్ని కార్తీక్ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతాడు శ్రీధర్. అతని కండిషన్ ఏమీ బాగోలేదు, ఇంకా సీరియస్ గానే ఉంది అతనికి ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి ఆ గ్రూప్ బ్లడ్ మన హాస్పిటల్ లో లేదు ఆ బ్లడ్ గ్రూపు మీ ఎవరి దగ్గరైనా ఉంటే ఇవ్వచ్చు అంటాడు డాక్టర్. నీది ఓ పాజిటివే కదా అని జ్యోత్స్న ని అడుగుతాడు దశరథ్.

తాగి ఉన్నప్పుడు బ్లడ్ ఇవ్వకూడదని తెలిసిన జ్యోత్స్న నిజం తెలిస్తే అసహ్యించుకుంటారని వారం రోజుల క్రితమే ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చాను అని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు దీప నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పడంతో ఆమె బ్లడ్ తీసుకుంటారు డాక్టర్లు. తర్వాత పారిజాతం మనవరాల్ని పక్కకు తీసుకువెళ్లి నువ్వు ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చాను అన్నది అబద్ధం కదా అంటుంది. అవును అంటుంది జ్యోత్స్న.
అబద్ధం ఎందుకు చెప్పావు అంటుంది పారిజాతం. తాగాను అని చెప్తుంది జ్యోత్స్న. ఆమె చెంప పగలగొట్టి నీ అంత నష్ట జాతకురాలిని నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు మీ బావ ఉన్న పరిస్థితికి కారణం నువ్వని నాకు తెలుసు నువ్వు పార్టీకి పిలవక పోయి ఉంటే వాడు ఇప్పుడు ఈ పరిస్థితులలో ఉండేవాడు కాదు, ఇప్పుడు ఈ పెళ్లి జరగదు, కనీసం బ్లడ్ ఇస్తే నీ మీద అందరికీ మంచి అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు ఆ దీప దేవత అయి కూర్చుంది అని మనవరాలికి చివాట్లు పెడుతుంది.

నువ్వు కొట్టిన దెబ్బకి మొత్తం దిగిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అంటుంది జ్యోత్స్న. వెళ్లి మొహం కడుక్కో, నువ్వు తాగావనే విషయం నీ మొహం చూస్తేనే తెలుస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. తరువాత నర్సింహ దీప ని చంపుతాడని రెచ్చగొడితే వాడు బావ జోలికి వచ్చాడు వాడిని వదిలిపెట్టను అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు బట్టల షాపింగ్ కోసం హడావిడి పడుతూ ఉంటుంది శౌర్య.
మనవరాలిని మెచ్చుకుంటూ తల్లి తెలివితేటలే నీకు వచ్చాయి తను కూడా చదువుకొని ఉండి ఉంటే కలెక్టరైపోయేది అంటుంది పారిజాతం. తను చదువుకోకపోతే నువ్వేం చేస్తున్నావ్ నానమ్మ అని ప్రశ్నిస్తుంది శౌర్య. ఒకరకంగా తను చదువు మానేయటానికి నేనే కారణం ఆ నర్సింహ గాడి కన్నా నా వల్లే దీప కి ఎక్కువ అన్యాయం జరిగింది అని మనసులోనే క్షమాపణ చెప్పుకుంటుంది అనసూయ. మరోవైపు బ్లడ్ ఇచ్చి వచ్చిన దీపకి థాంక్స్ చెప్తుంది కాంచన.

తనకెందుకు థాంక్స్ చెప్తున్నావు ఈరోజు నీ కొడుకు ఉన్న పరిస్థితికి కారణం తనే, తను ఏ రోజున మన ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి దరిద్రం దాపరించింది, తనవల్లే ఈరోజు నా కొడుక్కి ఈ గతి పట్టింది అంటూ దీప మీద విరుచుకుపడతాడు శ్రీధర్. ఇందులో తన తప్పేముంది, నర్సింహ దీపని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటుంది సుమిత్ర. అయితే ఏంటి ఆ మొగుడు పెళ్ళాలు తగులాడుకోవడం కాదు మధ్యలో వీడిని చంపేస్తున్నారు, కోర్టులో తీయవలసిన పరువు మొత్తం తీసేసారు.
ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకే తీసుకొచ్చారు అయినా వాడికి వందసార్లు చెప్పాను దీప వాళ్ళ జోలికి వెళ్లొద్దని అయినా వినలేదు, ఈవిడ వచ్చిన దగ్గరనుంచి రెస్టారెంట్ పనులన్నీ పక్కన పెట్టేసాడు అంటాడు శ్రీధర్. అంతలోనే డాక్టర్ వచ్చి కార్తీక్ కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు దాంతో మరింత రెచ్చిపోయిన శ్రీధర్ వాడికి ఏమైనా అయిందంటే మిమ్మల్ని ఎవ్వరినీ వదిలిపెట్టను అని దీపకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సుమిత్ర దీపని అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. కార్తీక్ బాబు కి మెలకువ వచ్చే వరకు ఉంటాను అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఈ గొడవ ఇంతటితో ఆగదు అంటూ అక్కడి నుంచి పంపించేస్తుంది సుమిత్ర. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా ఏడుస్తూ అనసూయ కి చెప్తుంది దీప. ఆ మాటలు విన్న శౌర్య కార్తీక్ కి ఏమైంది నేను తనని చూడాలి అంటుంది. ఏమీ కాలేదు అని దీప సర్ది చెప్పాలనుకుంటుంది కానీ లేదు తనకి ఏదో అయింది లేదంటే నువ్వు ఇలా ఏడవవు నేను చూడాలి అని పేచీ పెడుతుంది జ్యోత్స్న.

శౌర్య ఏడిస్తే ఆమె ఆరోగ్యం పాడవుతుందని తెలిసిన అనసూయ దీపతో పాపని అక్కడికి తీసుకు వెళ్ళద్దు అంటుంది. కానీ శౌర్య కి కార్తీక్ బాబు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అత్తయ్య ఇప్పుడు నేను చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు అంటూ కూతుర్ని తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరుతుంది దీప. మనవరాలికి ఏం జరుగుతుందో అని కంగారుపడుతుంది అనసూయ. నర్సింహని తిట్టుకుంటూ కార్తీక్ బాబుకి ఏమీ జరగకూడదు అని దేవుడిని వేడుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











