Karthika Deepam September 11th Episode: అద్భుతం కోసం జ్యోత్స్న ఎదురుచూపులు.. కార్తీక్ ప్రాణాలు కాపాడిన శౌర్య!
పంతులు తో ముందే మాట్లాడి కుటుంబ సభ్యులందరి ముందు పెళ్లి ముహూర్తం త్వరగా జరిగేలా పెట్టిస్తుంది జ్యోత్స్న. మరోవైపు వంట చేయడం కోసం ఒక ఇంటికి వెళ్తున్న దీపని దారిలో కనిపించిన కార్తీక్ తన కారులో డ్రాప్ చేస్తాడు. అక్కడ నర్సింహ దీప మీద హత్యాయత్నం చేస్తే ఆమెని కాపాడబోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు కార్తీక్. ఇదంతా దీప వల్లే అంటూ ఆమెపై ఫైర్ అవుతాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 11 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 146వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్య మనం చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేదు అంటూ కూతురిని తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరుతుంది దీప. దీప తో పాప జాగ్రత్త అని చెప్తుంది అనసూయ. తర్వాత కార్తీక్ ఆరోగ్యం బాగోవాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది. మరోవైపు హాస్పిటల్ లో డాక్టర్ కార్తీక్ ని టెస్ట్ చేస్తూ పదేపదే పిలుస్తూ ఉంటాడు, అయినా కార్తీక్ రెస్పాండ్ అవ్వకపోవడంతో బయటికి వచ్చి అదే విషయం చెప్తాడు. అతను కోమాలోకి వెళ్ళిపోతే కోలుకోవడం చాలా కష్టం అందుకే మీరు ఎవరైనా వచ్చి ప్రయత్నించండి అతను రెస్పాండ్ అవుతాడేమో చూద్దాం అనడంతో కుటుంబ సభ్యులందరూ కార్తీక్ దగ్గరికి వెళ్తారు.

ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ కార్తీక్ ని లేవమని ఏడుస్తూ ఉంటారు. కార్తీక్ రెస్పాండ్ అవ్వకపోవటంతో అతను మెల్లమెల్లగా కోమాలోకి వెళ్ళిపోతున్నారు 90% వెళ్ళిపోయారు అతను కోమాలోకి వెళ్ళిపోతే మనకి దక్కటం కష్టమే అంటాడు డాక్టర్. దాంతో భరించలేక ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. పారిజాతం కూడా ఆమె వెనకాలే వెళ్లి ఈ పరిస్థితి అంతటికీ కారణం నువ్వే, హాస్పిటల్ లోనే చాలా జాతకాలు మారిపోతూ ఉంటాయి, నా స్వార్థం కోసం చేసిన పని నీకు శాపంగా మారింది అంటుంది. అలా అనకు గ్రానీ నేను పలానా వాళ్ళ నా దగ్గర పుట్టాలని కోరుకోలేదు, పలానా దగ్గర పెరగాలని కోరుకోలేదు కానీ బావ ని మాత్రం పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను.
దీప మీద ఉన్న కోపం ఎంత నిజమో, బావ మీద ఉన్న ప్రేమ కూడా అంతే నిజం. బావకి ఏమైనా జరిగితే అంతకంటే ముందు నేనైతే చచ్చిపోతాను అంటుంది జ్యోత్స్న. కానీ డాక్టర్ 99% కామలోకి వెళ్లిపోయాడు అని చెప్పారు అంటుంది పారిజాతం. ఇంకా 1% ఛాన్స్ ఉంది కదా, ఈ లోపు ఏదైనా అద్భుతం జరగాలి అంటుంది జ్యోత్స్న. అప్పుడే శౌర్య కార్తీక్ అంటూ పరిగెట్టుకొని వస్తుంది. ఆమెని ఆపాలనుకుంటుంది పారిజాతం కానీ ఆమె చేయి కొరికేసి నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోతుంది శౌర్య.

శౌర్య కార్తీక్ అని ఏడుస్తూ పిలుస్తూ ఏడుస్తూ ఉంటే ఆమె పిలుపుకి రెస్పాండ్ అవుతాడు కార్తీక్. డాక్టర్ ఆ విషయం గమనించి శౌర్య ని పిలవటం ఆపొద్దు పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పడంతో శౌర్య మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉండటంతో కార్తీక్ కోమాలోంచి బయటపడతాడు. మేము చేయలేని పని నువ్వు చేసావు ఇక కార్తీక్ కి ఎలాంటి ప్రమాదం లేదు కొన్ని టెస్టు చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు డాక్టర్.
సీన్ కట్ చేస్తే తన ఇంట్లో మంచం మీద ఉన్న కార్తీక్ తన చుట్టూ ఉన్న మనుషులను చూసి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేను కోలుకోలేను మీరు మీ ఇంటికి వెళ్లిపోండి, కోలుకున్న తర్వాత నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు. మా రోజుల్లో ఎవరైనా రాకపోతే బాధపడే వాళ్ళం కానీ ఈ రోజుల్లో వచ్చిన వాళ్ళని వెళ్లిపోమన్నాడు అమెరికా ప్రభావం అంటాడు శివ నారాయణ. అలాంటిదేమీ లేదు తాతయ్య అర్థం చేసుకోండి అంటాడు కార్తీక్.
అందరికీ రూల్స్ వర్తిస్తాయి కానీ నాకు వర్తించవు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అంటుంది జ్యోత్స్న. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే మీరు ఏం మాట్లాడుతారో నాకు తెలుసు అందుకే వెళ్ళిపోమన్నాను అనుకుంటాడు కార్తీక్. అప్పుడే స్వప్న ఫోన్ చేసి నీకు బాగోలేదంట కదా మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పు వస్తాను అంటుంది. ఇప్పుడు వద్దు ఇక్కడికి వచ్చే సమయం దగ్గరలోనే ఉంది అప్పుడు నేనే తీసుకొని వస్తాను అంటాడు కార్తీక్.

నాకు మీ ఇంటికి వచ్చే అర్హత లేదా.. నీ ఫోన్ ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో దీప కి ఫోన్ చేస్తే విషయం చెప్పింది మీ ఇంటి అడ్రస్ అడిగితే తను కూడా ఇలాగే చెప్పింది అంటుంది స్వప్న. తనకు నిజం తెలుసు కాబట్టి అలా చెప్పి ఉంటుంది అనుకుంటాడు కార్తీక్. స్వప్నతో మాట్లాడుతూ నేను కోలుకున్న తర్వాత నేనే నిన్ను కలుస్తాను అర్థం చేసుకో అంటాడు కార్తీక్. సరే త్వరగా కోలుకో త్వరగా కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. మరోవైపు కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉన్న మనవరాలు దగ్గరికి వచ్చిన పారిజాతం కార్తీక్ దగ్గరికి వెళ్దాం పద అంటుంది.
అంతకంటే ముందు వేరే దగ్గరికి వెళ్ళాలి అంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తప్పు చేశాడు అని గ్రానీ కొడుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారు మరి ఆ దీప ని ఎందుకు ఉంచుకుంటున్నారు దీప వల్లే ఈ పరిస్థితి అంతా అంటుంది. దానికి కారణం దీప కాదు అంటూ దీపని వెనకేసుకొస్తారు సుమిత్ర దంపతులు. మేనల్లుడు ప్రాణాల మీదకు వచ్చిన కూడా నీకేమీ అనిపించడం లేదా, అయినా తను ఈ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఎవరికి ప్రశాంతత లేదు అంటుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











